ప్రియాంకపై విమర్శలు.. మద్దతిచ్చిన తల్లి | Priyanka Chopra Trolled For Sindoor And Changing Name | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 12 2018 3:44 PM | Last Updated on Wed, Dec 12 2018 10:48 PM

Priyanka Chopra Trolled For Sindoor And Changing Name - Sakshi

ప్రియాంక చోప్రా వివాహం చేసుకున్న దగ్గర నుంచి విమర్శించే వాళ్లు ఎక్కువ అయ్యారు. మొన్నటికి మొన్న హలీవుడ్‌ మ్యాగ్‌జైన్‌ ఒకటి ప్రియాంకను గ్లోబల్‌ స్కామ్‌ ఆర్టిస్ట్‌ అని.. నిక్‌ జోనస్‌కి ఇష్టం లేకుండానే ప్రియాంక, అతన్ని పెళ్లి చేసుకుందని.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిక్‌ ఆ బంధం నుంచి తప్పుకుంటే మంచిదని కారు కూతలు కూసిన సంగతి తెలిసిందే. కానీ ప్రియాంక మాత్రం ఈ విషయాలను ఏ మాత్రం పట్టించుకోలేదు. తాజాగా మరో మహిళ ప్రియాంకను ఉద్దేశిస్తూ ఇలానే ఓ ట్వీట్‌ చేశారు.

దీపికా భరద్వాజ్‌ అనే ట్విట్టర్‌ యూజర్‌ ‘గట్టిగా అరచి మరి చెప్తారు. కేవలం బిడ్డల్ని కనడానికే తప్ప ఇతర ఏ విషయాల్లోను నాకు పురుషుడితో అవసరం లేదు అని. కానీ వారికి తగిన వాడు దొరికిన మరు క్షణంలోనే అందరిలానే అందమైన వధువుగా తయారవుతారు. అతనో సూర్యుడు, చంద్రుడు, ఓ తార అన్నట్లు మాట్లాడతారు. సింధూరం ధరిస్తారు.. ఆఖరుకి పేరును కూడా మార్చుకుంటారు. ఇది బాలీవుడ్‌ మహిళావాదుల అసలు రూపం’ అంటూ ప్రియాంకను ఉద్దేశిస్తూ(ప్రియాంక తన పేరును ప్రియాంక చోప్రా జోనస్‌గా మార్చుకున్నారు) ట్వీట్‌ చేశారు.

అయితే ఈట్వీట్‌ని ప్రియాంక పెద్దగా పట్టించుకోలేదు. కానీ ప్రియాంక తల్లి మధు చోప్రా మాత్రం కాస్తా ఘాటుగానే స్పందించారు. ‘సిందూరం అనేది స్త్రీ జీవితాని ఆటంకం కాబోదు. త్వరలోనే ప్రియాంక ఈ విషయాన్ని ప్రూవ్‌ చేస్తుంది’ అంటూ రీ ట్వీట్‌ చేశారు మధు చోప్రా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement