ప్రియాంక పెళ్లిపై ఆందోళన లేదు | Priyanka Chopra not in a rush to get married? | Sakshi
Sakshi News home page

ప్రియాంక పెళ్లిపై ఆందోళన లేదు

Published Sat, Nov 12 2016 2:06 PM | Last Updated on Mon, Sep 4 2017 7:55 PM

ప్రియాంక పెళ్లిపై ఆందోళన లేదు

ప్రియాంక పెళ్లిపై ఆందోళన లేదు

ముంబై: బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌  ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లోనూ వెలిగిపోతోంది. బాలీవుడ్‌, హాలీవుడ్‌ అవకాశాలతో ఈ బ్యూటీ తీరికలేకుండా ఉంది. ప్రియాంకకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని ఆమె తల్లి మధు చోప్రా చెప్పింది. కెరీర్‌లో, జీవితంలో ప్రియాంక సంతోషంగా ఉందని, ఆమె పెళ్లి గురించి తాను ఆందోళన చెందడం లేదని తెలిపింది.

అందరి తల్లుల మాదిరిగా తాను కూడా ప్రియాంక పెళ్లి గురించి ఆందోళన చెందానని మధు చోప్రా చెప్పింది. అయితే తాను సంతోషకర, సురక్షిత స్థానంలో ఉన్నానని ప్రియాంక ధైర్యం చెప్పిందని వెల్లడించింది. పెళ్లి చేసుకోవాలని తన కుమార్తెను ఒత్తిడి చేయబోనని మధు చోప్రా చెప్పింది. క్వాంటికో టీవీ సిరీస్‌లో నటించడం ద్వారా ప్రియాంక హాలీవుడ్‌లో పాపులర్‌ అయ్యింది. క్వాంటికో సీజన్‌ 2లోనూ ఆమె నటిస్తోంది. అలాగే హాలీవుడ్‌ సినిమా బేవాచ్‌లోనూ ప్రియాంకకు ఆఫర్‌ వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement