![Priyanka Chopra Mother Madhu Chopra Denies Rumors Of Daughter Divorce With Nick Jonas - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/23/priyanka-chopra-mother.jpg.webp?itok=qeF1mZDL)
Madhu Chopra Respond On Her Priyanka Chopra And Nick Jonas Divorce Rumors: గ్లోబల్ కపుల్ ప్రియాంక చోప్రా-నిక్ జోనస్‌లు త్వరలో విడాకులు తీసుకోబోతున్నారా? అంటూ నిన్నటి నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి కారణం లేకపోలేదు. ప్రియాంక తన సోషల్ మీడియా ఖాతాలు ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్‌బుక్ ప్రొఫైల్లో నేమ్ నుంచి భర్త నిక్ జోనస్ ఇంటి పేరును తీసేసింది. దీంతో టాలీవుడ్ కపుల్స్ నాగ చైతన్య-సమంత బాటలోనే ఈ గ్లోబల్ జంట నడుస్తుందని, త్వరలోనే వీరు కూడా విడాకుల ప్రకటన ఇవ్వబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది.
చదవండి: Priyanka Chopra And Nick Jonas: భర్త పేరు తొలగించిన ప్రియాంక... అసలేం జరిగింది?
ఈ నేపథ్యంలో ప్రియాంక తల్లి మధు చోప్రా ఈ వార్తలపై స్పందించింది. సోమవారం సాయంత్రం ఆమె న్యూస్ పోర్టల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ ప్రియాంక-నిక్‌ల విడాకులంటూ వస్తున్న వార్తలను ఖండించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రియాంక-నిక్ విడాకులపై వస్తున్న వార్తలను నమ్మొద్దని, అవన్నీ వట్టి పుకార్లేనని ఆమె స్పష్టం చేసింది. అంతేగాక ఇలాంటి ఆసత్య ప్రచారాలను వైరల్ చేయొద్దని ఆమె నెటిజన్లను కోరింది.
చదవండి: విడాకుల తర్వాత సమంత తొలి ఇంటర్వ్యూ, ఆసక్తికర విషయాలు వెల్లడి
కాగా ఇటీవల ప్రియాంక-నిక్‌లు కొత్త ఇంటిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల గృహ ప్రవేశం చేసి కొత్త ఇంటికి మకాం మార్చిన ఈ జంట అక్కడ దీపావళి వేడుకులను ఘనంగా జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వారి సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. కాగా 2018 డిసెంబర్ 1న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ప్యాలెస్‌లో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం రెండు రోజుల పాటు వీరి వివాహ మహోత్సవాన్ని నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment