ఇప్పుడే కదా కలిసింది... | Priyanka Chopra Mother Reacted About Nick jonas | Sakshi
Sakshi News home page

ఇప్పుడే కదా కలిసింది...

Published Mon, Jun 25 2018 2:16 PM | Last Updated on Mon, Jun 25 2018 2:18 PM

Priyanka Chopra Mother Reacted About Nick jonas - Sakshi

ప్రియుడు నిక్‌ జోనస్‌, తల్లి మధు చోప్రాతో ప్రియాంక చోప్రా

బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా...హాలీవుడ్‌ సింగర్, ఆర్టిస్ట్‌ నిక్‌ జోనస్‌ ప్రస్తుతం బీ టౌన్‌లో బాగా వినిపిస్తున్న పేర్లు వీరిద్దరివే. ఇటీవలే ప్రియాంక చోప్రా ముంబైలో తన నూతన గృహప్రవేశానికి గెస్ట్‌గా బాయ్‌ఫ్రెండ్‌ నిక్‌ జోనస్‌ను ఆహ్వానించారు. పనిలో పనిగా తన తల్లి మధుకు నిక్‌ను పరిచయం చేశారు ప్రియాంక. ఈ సందర్భంగా మధు తన కూతురు ప్రియాంక, నిక్‌తో కలిసి ముంబైలోని ఒక టాప్‌ రెస్టారెంట్‌కు డిన్నర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ‘నిక్‌ గురించి మీ అభిప్రాయం ఏంట’ని మీడియా మధు చోప్రాను ప్రశ్నించగా ఆమె కాస్తా భిన్నంగా స్పందించారు.

ఈ విషయం గురించి మధు చోప్రా ‘మేము కేవలం డిన్నర్‌ చేయడం కోసం మాత్రమే వెళ్లాము. అప్పుడు అక్కడ నిక్‌ కూడా ఉన్నాడు. కానీ అప్పుడు అతనితో మాట్లాడ్డానికి కుదరలేదు. ఆ సమయంలో దాదాపు పదిమంది దాకా నిక్‌ జోనస్‌ చుట్టూ మూగారు. దాంతో అతని గురించి తెలుసుకోవడానికి నాకు అవకాశం లభించలేదు. అయినా నేను నిక్‌ను కలవడం ఇదే తొలిసారి. ఇంత తక్కువ సమయంలో అతని గురించి అప్పుడే ఒక నిర్ణయానికి రాలేను’ అని తెలిపారు.

కాగా గతంలో ప్రియాంక తల్లి మధు విదేశీయుడికి తన కూతురిని కట్టబెట్టడం ఇష్టం లేదని పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే నిక్‌ ఇప్పటికే ప్రియాంకను తన కుటుంబసభ్యులకు పరిచయం చేశారు. నిక్‌ తరఫు బంధువుల పెళ్లికి కూడా ప్రియాంక హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement