అందరు అనుకునే మనిషిని కాదు: బిగ్‌ బాస్‌ బ్యూటీ | Bigg Boss Sri Satya Open About Her Financial Struggles In Life | Sakshi
Sakshi News home page

Sri Satya: 'అమ్మకు నెలకు రూ.లక్ష.. అందుకే కారు కూడా లేదు'

Published Fri, Jul 26 2024 4:07 PM | Last Updated on Fri, Jul 26 2024 6:06 PM

Bigg Boss Sri Satya Open About Her Financial Struggles In Life

టాలెంట్‌ ఉన్నా అవకాశాలు రావాలంటే అదృష్టం కూడా ఉండాలి. బహుశా అది లేకపోవడం వల్లేనేమో హీరోయిన్‌ గ్లామర్‌ ఉన్న బిగ్‌బాస్‌ బ్యూటీ  శ్రీసత్యకు మంచి ఆఫర్స్‌ రావడం లేదు. ఒకవేళ చిన్నచిన్న సినిమా ఆఫర్లు వచ్చినా పెద్దగా సక్సెస్ మాత్రం రావడం లేదు. తాజాగా తన లైఫ్‌లో ఎదుర్కొన్న ఇబ్బందులను ఓ ఇంటర్వ్యూలో  పంచుకున్నారు. అందరూ అనుకుంటున్నట్లు తాను డబ్బు మనిషిని కాదని అన్నారు.  అమ్మ కోసం నెలకు దాదాపు రూ.లక్షకు పైగా ఆస్పత్రికి ఖర్చవుతుందని తాను పడుతున్న బాధలను వివరించారు.

 శ్రీసత్య మాట్లాడుతూ..'జనాలు అందరూ అనుకుంటారు డబ్బు మనిషి అని. నేను బాధల్లో ఉన్నానంటే ఎవరు వచ్చి హెల్ప్ చేయరు. తినడానికి కూడా ఫ్రీగా ఫుడ్‌ ఎవరు ఇవ్వరు. కానీ డబ్బు అందరికీ ఇంపార్టెంటే. కానీ ఆ విషయాన్ని ఒప్పుకోరంతే. మమ్మీ ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారు. ఆమెకు నెలకు రూ.లక్షకు పైగా ఖర్చవుతుంది. కారు కొనడానికి నా వద్ద డబ్బుల్లేవు. 2019లో ఓ చిన్న కారు కొన్నా. అది పాడయిపోవడంతో ఎక్కువ ఖర్చవుతుందని అమ్మేశా. ఇప్పటికీ నా వద్ద కారు లేదు. ఎందుకంటే వచ్చిన డబ్బులన్నీ అమ్మ ఆస్ప‍త్రి ఖర్చులకే సరిపోతాయి' అని వెల్లడించింది. కాగా.. శ్రీసత్య బిగ్‌బాస్‌ సీజన్‌-6లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. హౌజ్‌లో తనదైన ఆట తీరుతో బాగా ఆకట్టుకుంది. అంతే కాకుండా బీబీ జోడి డ్యాన్స్‌ షోతో అలరించింది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement