నటప్రతిభనే తన సిరి, సంపదగా మార్చుకుని, బుల్లితెరపై కనిపిం, వెండితెరపై మెరిసింది .. సిరి హనుమంత్! ప్రస్తుతం వరుస సిరీస్‌లతో వెబ్ వీక్షకుల వీరాభిమానాన్ని సొంతం చేసుకుంటున్న ఈ నటి గురిం కొన్ని మాటలు.. సిరి పుట్టి, పెరిగినదంతా వైజాగ్‌లోనే. ఎంబీఏ చదువుతున్నప్పుడే జీవితంలో ఏదైనా కొత్తగా చేయాలని నిర్ణయించుకుంది. అందుకే ఆ చదువును మధ్యలోనే వనేసి హైదరాబాద్‌కు వచ్చేసింది. మొదట కొన్ని లోకల్ చానల్స్‌లో న్యూస్‌రీడర్‌గా పనిచేసింది.
►‘ఉయ్యాలా జంపాలా’ అనే సీరియల్లో నటించే అవకాశం రావడంతో నటన వైపు ఆడుగులు వేసింది. తర్వాత ‘అగ్నిసాక్షి’, ‘సావిత్రమ్మగారి అబ్బాయి’ వంటి పలు సీరియల్స్‌లోనూ చేసింది. సిరీస్‌ల్లోనూ తన అభినయ సత్తాను చాటుకుంది. ఆమె నటించిన ‘ సాఫ్ట్‌వేర్ బిచ్చగాళ్లు’, ‘రామ్ లీలా’, ‘మేడం సార్ మేడం అంతే’ వంటి వెబ్ సిరీస్‌లు యూట్యూబ్ ట్రెండింగ్‌లో నిలిచాయి.
►మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, తన ‘హే సిరి’ యూట్యూబ్ చానల్‌కు ఆరు లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్స్‌ను సంపాదించుకుంది. ఇక బిగ్‌బాస్ సీజన్5 కి వెళ్లొచ్చాక తనకున్న పాపులారిటీని డబుల్ కాదు, త్రిబుల్ చేసుకుంది. చేతినిండా పలు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్, వాణిజ్య ప్రకటనలతో పాటు అప్పుడప్పుడు సినిమాల్లోనూ కనిపిస్తోంది. ప్రస్తుతం జీ5లో స్ట్రీమ్ అవుతోన్న సూపర్ హిట్ ‘పులి మేక’ , ఆహా లోని ‘బీఎఫ్‌ఎఫ్’ సిరీస్‌లతో అలరిస్తోంది.
►చిన్నప్పుడే తండ్రికి దూరం కావడంతో చాలా కష్టాలు చూశా. అందుకే, బాగా సెటిల్ అయి., మంచి స్థాయికి చేరుకున్నాకే పెళ్లి చేసుకుంటా. – సిరి హనుమంత్
Comments
Please login to add a commentAdd a comment