
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. అయితే ఇండస్ట్రీకి రాకముందు సమంత కూడా సాధారణ అమ్మాయిలా ఎన్నో కష్టాలు ఎదుర్కొందట. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమంత ఈ విషయాలపై ఓపెన్ అప్ అయ్యింది.
తల్లిదండ్రుల కోరిక మేరకు బాగా చదివి టాపర్‌గా నిలిచేదాన్ని అని చెప్పిన సామ్ పై చదువులకు డబ్బులు లేక చదువు మానేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. హీరోయిన్ కాకముందు పెద్ద పెద్ద ఫంక్షన్స్‌కు హాజరయ్యే గెస్ట్‌లకు వెల్‌కమ్ చెప్పే అమ్మాయిగా చేసిందట. దీనికి గాను రోజుకు రూ. 500 ఇచ్చేవారట.
ఇక ఒకనొక సమయంలో డబ్బులు లేక ఒక్కపూట భోజనంతోనే దాదాపు రెండు నెలలు గడిపినట్లు సమంత పేర్కొంది. పాకెట్ మనీ కోసం మోడలింగ్ వైపు వెళ్తున్న సమయంలో కుటుంబసభ్యులు కొందరు నీకిది అవసరమా అంటూ వెనక్కి లాగే ప్రయత్నం చేశారని, కానీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందడుగు వేసినట్లు చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment