Modelling
-
గాయాలు నన్ను అచేతనం చేశాయి.. మోడలింగ్‌లోకి వెళ్తా (ఫొటోలు)
-
టిక్‌టాక్ వీడియోలు చేస్తూ చదువుకు ఫుల్స్టాప్ :నటి
పెద్ద పెద్ద సినిమాల్లో నటించినా రాని గుర్తింపును కేవలం పది సెకన్ల వీడియోలో నటించి సాధించిన సోషల్ మీడియా స్టార్స్ ఎందరో! అలాంటి ఓ టిక్‌టాక్ స్టారే మోక్షిత రాఘవ్.. ఇప్పుడు వెబ్‌స్టార్‌గా దూసుకుపోతోంది.. ♦ పుట్టింది ఢిల్లీలో.. పెరిగింది ముంబైలో. ♦ చదువు పూర్తిచేసి, ఓ మంచి ఉద్యోగం సాధించి, స్థిరపడాలనుకున్న ఆమెను మార్చేసింది.. చైనీస్ యాప్ టిక్‌టాక్. ♦ మోక్షిత చేసే టిక్‌టాక్ వీడియోల వ్యూస్, లైకుల సంఖ్య టాప్స్పీడ్లో పరుగెత్తుతుండటంతో చదువుకు ఫుల్స్టాప్ పడింది. ♦ పూర్తిగా చదువు మానేసి, నటిగా మారాలని నిర్ణయించుకుంది. తల్లిదండ్రులు మందలించినా..మేన తను మాత్రం ఆ జోరు కొనసాగించి టిక్‌టాక్ స్టార్‌గా ఎదిగింది. ♦ పలు అందాల పోటీల్లో పాల్గొని మోడల్‌గానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘రూబరూ ఫేస్ ఆఫ్ బ్యూటీ ఇంటర్నేషనల్ 2016’, ‘మిస్ ముంబై 2019’ పోటీల్లో విజేతగా నిలిచింది. ♦ ప్రతిభ ఉంటే అవకాశాలకేం కొదవ అన్నట్లు.. పదిసెకన్ల వీడియోలతోనే ఎన్నో బుల్లితెర అవకాశాలను కొట్టేసింది. మరెన్నో యూట్యూబ్ షార్ట్ మూవీల్లో నటించి మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్‌తో పాపులర్ అయింది. ♦ ప్రస్తుతం ‘అతిథి ఇన్ హౌస్’, ‘ప్రభా కి డైరీ సీజన్ 2’, ‘కాంట్రాక్ట్ కిల్లర్’ సిరీస్‌లతో అలరిస్తోంది. అందరూ కొత్తదనం కోరుకుంటున్నారు. అదే మాలాంటి సోషల్‌మీడియా స్టార్స్‌కు వరంగా మారింది. నటిగా ఎదగాలంటే ఫ్లాట్‌ఫాం కంటే పోషించే పాత్ర ముఖ్యమని నేను నమ్ముతా. – మోక్షిత రాఘవ్ -
రోజుకు రూ.500 ఇచ్చేవారు.. చాలా కష్టాలు పడ్డా: సమంత
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. అయితే ఇండస్ట్రీకి రాకముందు సమంత కూడా సాధారణ అమ్మాయిలా ఎన్నో కష్టాలు ఎదుర్కొందట. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమంత ఈ విషయాలపై ఓపెన్ అప్ అయ్యింది. తల్లిదండ్రుల కోరిక మేరకు బాగా చదివి టాపర్‌గా నిలిచేదాన్ని అని చెప్పిన సామ్ పై చదువులకు డబ్బులు లేక చదువు మానేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. హీరోయిన్ కాకముందు పెద్ద పెద్ద ఫంక్షన్స్‌కు హాజరయ్యే గెస్ట్‌లకు వెల్కమ్ చెప్పే అమ్మాయిగా చేసిందట. దీనికి గాను రోజుకు రూ. 500 ఇచ్చేవారట. ఇక ఒకనొక సమయంలో డబ్బులు లేక ఒక్కపూట భోజనంతోనే దాదాపు రెండు నెలలు గడిపినట్లు సమంత పేర్కొంది. పాకెట్ మనీ కోసం మోడలింగ్ వైపు వెళ్తున్న సమయంలో కుటుంబసభ్యులు కొందరు నీకిది అవసరమా అంటూ వెనక్కి లాగే ప్రయత్నం చేశారని, కానీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందడుగు వేసినట్లు చెప్పుకొచ్చింది. -
ఆ రోజు ఆటోలో కూర్చోని బాగా ఏడ్చాను: కృతి సనన్
టాలీవుడ్లో ‘వన్.. నేనోక్కడినే’ తో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన జతకట్టింది కృతి సనన్. ఆ తర్వాత బాలీవుడ్‌కు మాకాం మార్చిన ఈ అమ్మడు అక్కడ బిజీ హీరోయిన్గా మారిపోయింది. బీ టౌన్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ ఈ భామ భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కృతి తాను మోడలింగ్ చేస్తున్నప్పటి విషయాలను పంచుకుంది. తన మొదటి ర్యాంప్ వ్యాక్ షోలో ఏదో పొరపాటు విషయమై కొరియోగ్రాఫర్ తన పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. ఆ షో ముగింపులో దాదాపు 20 మోడళ్ల ముందు ఆ కొరియోగ్రాఫర్ తనని తిట్టాడని చెప్పింది కృతి. ఆ తర్వాత తను ఆటోలో కూర్చుని ఆ విషయాన్ని తలుచుకుని ఏడవటం మొదలుపెట్టి.. అక్కడి నుంచి ఇంటికి వెళ్లి వాళ్ల అమ్మతో చెప్పి బాధపడినట్లు తెలిపింది. దీంతో ఆమె కృతిసనన్‌తో.. ఈ వృత్తిలో నువ్వు రాణించగలవో లేదో నాకు తెలీదు గానీ ముందు నువ్వు మానసికంగా మరింత బలంగా ఉండాలి. నీ మీద నీకు నమ్మకం ఉండాలంటూ ధైర్యం చెప్పిందని అప్పటి విషయాలని గుర్తుచేసుకుంది కృతి. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో బోలెడు సినిమాలు ఉన్నాయి. ఇటీవలే ఈ నటి బచ్చన్ పాండే షూటింగ్ పూర్తి చేసింది. ఇందులో అక్షయ్ కుమార్ సరసన నటించింది. గణపత్‌లో టైగర్ ష్రాఫ్ సరసన నటిస్తుండగా, వరుణ్ ధావన్‌తో కలిసి నటిస్తున్న ‘భేదియా’ చిత్రం కోసం షూట్ కూడా చేసింది. ‘హమ్ దో హుమారే దో’ లో కూడా నటిస్తోంది. చదవండి: Street Light Movie: పగలంతా పెద్ద మనుషులు, రాత్రి అయితే..? -
సినిమాల్లోకి రాకముందు పూజా హెగ్డే ఏం చేసేదో తెలుసా?
పూజా హెగ్డే.. ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా దూసుకుపోతుంది. ‘అల వైకుంఠపురములో’ ఇచ్చిన సక్సెస్‌తో బుట్టబొమ్మ రేంజ్ మారిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని ఇండస్ట్రీల నుంచి పూజాకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. దీంతో డిమాండ్‌ను బట్టి పారితోషికాన్ని సైతం పెంచేసింది ఈ బ్యూటీ. మరి తొలినాళ్లలో సినిమాల్లోకి రాకముందు పూజా ఏం చేసేది? ఆమె తొలి సంపాదన ఎంత అన్న వివరాలను తెలుసుకుందాం. -
‘అప్పుడు నా సంపాదన నెలకు రూ.5 వేలు’
కేవలం డబ్బు సంపాదించాలనే ఆలోచనే నన్ను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేలా చేసింది అంటున్నారు బాలీవుడ్ ‘ఖిలాడి’ అక్షయ్ కుమార్. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన అక్షయ్ కుమార్ తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ‘నేను ఇప్పటికి దాదాపు 130 దాకా సినిమాలు చేసి ఉంటాను. కానీ కెరియర్ తొలినాళ్లలో కేవలం యాక్షన్ సినిమాలు మాత్రమే చేశాను. దర్శకులు, నిర్మాతలు కేవలం నన్నో యాక్షన్ హీరోగా మాత్రమే గుర్తించేవారు’ అంటూ చెప్పుకొచ్చారు. మార్షల్ ఆర్ట్స్ స్కూల్ ప్రారంభించాలనే ఉద్దేశంతో బ్యాంకాక్ వెళ్లి ఐదేళ్ల పాటు థాయ్ బాక్సింగ్ నేర్చుకున్నాను అన్నారు. తరువాత ‘ముంబై వచ్చి మార్షల్ ఆర్ట్స్ స్కూల్ ప్రారంభించాను. అప్పుడు మార్షల్ ఆర్ట్స్ ట్రైన్ర్గా నెలకు రూ. 5000 సంపాదించేవాడిని. నా పర్సనాలిటీ చూసిన కొందరు నన్ను మోడల్‌గా ప్రయత్నించమన్నారు. వారి సలహాతో నేను మోడలింగ్ ప్రయత్నాలు ప్రారంభించాను. తొలుత నేను ఓ ఫర్నిచర్ కంపెనీ యాడ్‌లో నటించాను. కేవలం రెండు గంటల పనికే నాకు రూ. 21,000 ఇచ్చారు. అలా నెమ్మదిగా ఇండస్ట్రీలో ప్రవేశించాను. కెరీర్ తొలినాళ్లలో దాదాపు 10 -11 సంవత్సరాలు యాక్షన్ సినిమాలే చేశాను. ఆ తర్వాత నెమ్మదిగా కామెడీ, రొమాంటిక్ సినిమాలు చేయడం ప్రారంభించాను’ అన్నారు. 1991లో ‘సౌగంధ’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు అక్షయ్ కానీ మరుసటి ఏడాది వచ్చిన ‘ఖిలాడి’ సినిమా అక్షయ్ కెరియర్ను మలుపు తిప్పింది. డబ్బు సంపాదించాలనే ఆలోచనతోనే ఇండస్ట్రీలోకి వచ్చాను అన్నారు అక్షయ్. 2018లో ఫోర్బ్స్ విడుదల చేసిన అత్యధిక పారితోషికం తీసుకునే నటుల జాబితాలో చేరారు ఈ ఖిలాడీ హీరో. ప్రస్తుతం అక్షయ్ విలన్‌గా నటించిన 2. ఓ విడుదలకు సిద్ధంగా ఉండగా.. హౌస్‌ఫుల్ 4, కేసరి చిత్రాలకు సైన్ చేశారు. -
షమీ కోసం ఎంతో చేశా, కానీ...
లైంగిక ఆరోపణలు, గృహ హింస చట్టం కేసులతో భర్త షమీని ఉక్కిరి బిక్కిరి చేసిన హసీన్ జహాన్ మళ్లీ వార్తల్లో నిలిచారు. నాలుగు నెలల విరామం తర్వాత తిరిగి ఆమె ప్రొఫెషనల్ ఫీల్డ్‌లోకి దిగిపోయారు. స్వతహాగా మోడల్ అయిన హసీన్.. కోల్‌కతాలో నిర్వహించిన ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్‌తో సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడారు. ‘షమీ కోసం నా కెరీర్‌ను, ఇష్టాలను వదిలేసుకున్నా. నా కలల్ని చంపుకున్నా. కానీ, అతని నుంచి నాకేం ఒరగలేదు. పైగా ఇప్పుడు నన్ను ఒంటరిగా వదిలేశాడు. అందుకే నాకు గుర్తింపునిచ్చి.. తిండి పెట్టిన ఫీల్డ్‌లోకి తిరిగి వచ్చేశా. ప్రస్తుతం మోడలింగ్ కోసం కోల్‌కతాతోపాటు ముంబై, ఇతర నగరాల్లో అవకాశాలు వస్తున్నాయి’ అని జహాన్ తెలిపారు. మోడలింగ్ కోసం మొదట పాత పరిచస్తులకు, స్నేహితులకు ఫోన్ చేయాలంటే ఇబ్బందిగా అనిపించిందని, కానీ, కూతురి కెరీర్ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో వారితో మాట్లాడి అవకాశాలు దక్కించుకున్నట్లు ఆమె తెలిపారు. తాను బయటకు వెళ్లినప్పుడు కూతురి బాగోలును తన తండ్రితోపాటు కూతురు(మొదటి భర్తతో కలిగిన సంతానం) చూసుకుంటున్నారని హసీన్ జహాన్ వెల్లడించారు. కాగా, భర్త షమీ ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు నడుపుతున్నాడంటూ ఆరోపణలతో మొదలుపెట్టిన హసీన్.. లైంగిక ఆరోపణలు, ఫిక్సింగ్, గృహ హింస తదితర కేసులతో షమీకి ఉక్కిరి బిక్కిరి చేశారు. చివరకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీని సైతం కలిసి న్యాయం చేయాలని ఆమె కోరారు. ఆపై కూతురి పోషణ కోసం రూ. 10 లక్షల భరణం ఇప్పించాలంటూ కోల్‌కతా కోర్టులో ఆమె ఓ కేసు దాఖలు చేయగా.. అది విచారణలో ఉంది. కథువా కేసు; షమీ భార్య షాకింగ్ కామెంట్స్ ట్విస్ట్: తెరపైకి షమీ భార్య మాజీ భర్త! -
కలలు కల్లలయ్యాయి..
షాంఘై : కలల జీవితాన్ని అందుకునేందుకు రష్యా నుంచి చైనా వచ్చిన 14 ఏళ్ల మోడల్ కలలు కల్లలయ్యాయి. ఆశల జీవితం వాకిట క్యాట్ వాక్ చేస్తూ కుప్పకూలి ఆమె ప్రాణాలు విడిచింది. రష్యాకు చెందిన వాల్డా జ్యూబా ఓ ఏజెన్సీతో 'స్లేవ్ లేబర్'గా మూడు నెలల ఒప్పందం కుదర్చుకుని మోడలింగ్ కోసం చైనాకు వచ్చింది. ఈ ఒప్పందంలో మెడికల్ ఇన్సూరెన్స్ లేదు. చనిపోయే ముందు వాల్డా.. షాంఘైలో ఆసియన్ ఫ్యాషన్ షోలో పాల్గొంది. 13 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన షో కారణంగా ఆమె ఉద్వేగానికి గురైంది. అనంతరం తీవ్ర ఒత్తిడితో కోమాలోకి వెళ్లిపోయింది. దీంతో కార్యక్రమ నిర్వహకులు వాల్డాను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో రెండు రోజుల పాటు చికిత్స పొందిన ఆమె చివరకు ప్రాణాలు విడిచింది. ఇది వాల్డా సమస్యే కాదు. రష్యా నుంచి చైనాకు మోడలింగ్‌కు వస్తున్న ఎందరో రష్యన్ యువతుల దీనగాథ. ఆశల జీవితం కోసం వస్తున్న మోడల్స్ ప్రాణాలతో చైనా ఏజెన్సీలు చెలగాటమాడుతున్నాయి. చిన్నవాటికి కూడా బాగా వేధిస్తున్నాయి. -
కళ్లతో కోట్ల సంపాదన..!
నార్త్ కరోలినా : అతనో దొంగ. ఓ రేపిస్ట్. ఐదు నేరారోపణలతో జైలు జీవితం గడుపుతున్నాడు. అలాంటి వ్యక్తి జీవితం ఒక్కసారి టర్న్ అవుతుందని, అతని కోటీశ్వరుడు అవుతాడని ఎవరైనా అనుకుంటారా?. మేఖీ జీవితంలో అలాంటి సంచలనం జరిగింది. ఓ మోడలింగ్ కంపెనీ కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చి బెయిల్‌పై అతన్ని విడిపించుకుంది. అందుకు ఓ కారణం ఉంది. మేఖీ హెటెరోక్రోమియా అని కంటి జబ్బుతో బాధపడుతున్నాడు. కానీ ఆ జబ్బే అతని పాలిట వరంగా మారింది. హెటెరోక్రోమియా జబ్బు వల్ల కళ్లు రెండూ వేర్వేరు రంగుల్లోకి మారుతాయి. ఫొటోలో మేఖీ కళ్లు ఎలా మారయో చూడండి. మేఖీ ఫొటోను చూసిన మోడలింగ్ కంపెనీ అతని గురించి వివరాలు కనుక్కుని మోడలింగ్ చేయాలని కోరింది. మోడలింగ్ ఏజెన్సీ ఆఫర్‌తో మేఖీ ఎగిరి గంతేశాడు. మోడల్‌గా మారిన అనంతరం మేఖీ తన చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు. ఇన్‌స్టాలో మేఖీకి 20 వేల ఫాలోవర్స్ ఉన్నారు. -
మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ కు.. కాంట్రాక్ట్ కష్టాలు!
మూడేళ్ళ వయసునుంచే మోడలింగ్ ఫీల్డ్ లో ప్రతిభను ప్రదర్శించిన ఆ చిన్నారి... ప్రపంచంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ గా పేరొందింది. డాల్సీ అండ్ గబ్బనా.... రాబర్ట్ కావిల్లా.... అర్మానీ వంటి ఎంతోమంది ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లతో పని చేసింది. పదేళ్ళ వయసున్న ఆ రష్యా చిన్నది... ఇప్పుడు అమెరికాకు చెందిన టాప్ మోడలింగ్ కాంట్రాక్ట్ విషయంలో సమస్యను ఎదుర్కొంటోంది. రష్యాలో జన్మించిన లిటిల్ సూపర్ మోడల్... 'ఎల్ ఏ మోడల్స్ యూత్' సెక్షన్ కాంట్రాక్ట్ కు సైన్ చేసి... ప్రపంచంలోనే ఎంతోమంది అభిమానులను ఆకర్షించింది. అయితే ఆ అభిమానం ఆమె భవిష్యత్తుకు మాత్రం సహకరించేలా కనిపించడం లేదు. ఇంటర్నెట్ లో పోస్ట్ చేసిన క్రిస్టినా ప్రిమెనోవా చిత్రాలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయని, ఈ పోకడ సరికాదని కొందరు వ్యాఖ్యానించడం ఇప్పుడు ఆమెకు అడ్డంకిగా మారింది. క్రిస్టినాకు ఫేస్ బుక్ లో సుమారు 20 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. అయితే చిన్నతనంలోనే ఆమె ప్రతిభా పాటవాలను ప్రోత్సహిస్తున్నవారు కొందరైతే... అసూయ, ఆగ్రహం వ్యక్తం చేసేవారూ అందులో కొనసాగుతున్నారు. కొందరు ఆమె చిన్నపిల్లని చూడకుండా ఆమె శరీరభాగాలపై ఎన్నోఅసభ్య కామెంట్లు కూడా పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటోపై ఓ కామెంటర్ తనతో ఉండటం ఇష్టమేనా అన్నాడు. అలాగే కొందరు సెక్సీ లెగ్స్ అన్నారు. అయితే క్రిస్టినా తల్లి 40 ఏళ్ళ గ్లికేరియా పిమెనోవా మాత్రం.. తాను పోస్ట్ చేసిన ఫోటోల్లో ఎలాంటి అసభ్యతా లేదంటోంది. చిన్నారి ధరించిన వస్త్రాలు రెచ్చగొట్టేవిగా లేవని ఆమె వాదిస్తోంది. పసి పిల్లలను అసభ్యంగా చూడటం సరికాదని, తన కూతురు భవిష్యత్తును పాడు చేయొద్దని ఓ పత్రికతో విన్నవించింది. క్రిస్టినా ఫొటోలను తరచుగా ఇన్ స్టాగ్రామ్ లోనూ, ఫేస్ బుక్ లోనూ పోస్ట్ చేసే బాధ్యతను తల్లి గ్లైకేరియా కొనసాగిస్తోంది. కూతురుపై వచ్చే అనుచిత వ్యాఖ్యలను వెంటనే డిలీట్ చేస్తూ, ఆమె పోస్ట్ లు ఛైల్డ్ ఫ్రెండ్లీ గా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటోంది. క్రిస్టినా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ పేజీల్లో ఎవరైనా పోస్టు చేసే వీడియోలు, చిత్రాలు, కామెంట్లు.. క్రిస్టినా వయసుకు తగ్గవిగా లేకపోతే డిలీట్ చేయబడతాయని గ్లికేరియా హెచ్చిరిస్తోంది. అంతేకాక పోస్ట్ చేసిన వారిని బ్లాక్ చేస్తామని చెప్తోంది. అయితే ఆన్ లైన్ లో క్రిస్టినా... ఎంతోమంది అభిమానులను కూడగట్టుకున్నా... అతి చిన్న వయసు కావడంతో ఆమెకు సోషల్ మీడియాలో ప్రవేశం ఉండకూడదని కొందరు అభ్యంతరాలు కూడ వ్యక్తం చేస్తున్నారు.