1/21
ఏడాది క్రితం చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత మిడిల్ డిస్టెన్స్ రన్నర్ హర్మిలన్ బైన్స్ రెండు రజతాలతో సత్తా చాటింది.
2/21
800, 1500 మీటర్ల విభాగాల్లో ఆమె ఈ రెండు వెండి పతకాలను సొంతం చేసుకుంది.
3/21
అయితే గాయాలపాలైన హర్మిలన్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయింది.
4/21
దాదాపు సీజన్ మొత్తం గాయం వెంటాడటంతో కనీసం ఒలింపిక్స్ క్వాలిఫయింగ్‌లో పోటీ పడే చాన్స్ కూడా లేకపోయింది.
5/21
ఒలింపిక్స్‌కు దూరం కావడంతో మానసికంగా తాను చాలా దెబ్బ తిన్నానని హర్మిలన్ వెల్లడించింది.
6/21
‘ఎలాగైనా పారిస్ ఒలింపిక్స్‌లో ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నా. కానీ ఒక గాయం తర్వాత మరో గాయం నన్ను అచేతనంగా మార్చేశాయి.
7/21
నేను ఎంతగా ఒలింపిక్స్ గురించి ఆలోచించానంటే గాయం నుంచి పూర్తిగా కోలుకోకుండానే ఒక క్వాలిఫయింగ్ రేస్‌లో కూడా పాల్గొన్నాను. ఒలింపిక్స్ చాన్స్ పోవడంతో నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను.
8/21
అసలు ఏం చేయాలో, ఏం చేస్తున్నానో కూడా అర్థం కాని పరిస్థితి. ఆట నుంచి తప్పుకోవాలని భావించా. ఒకదశలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చింది’ అని హర్మిమలన్ గుర్తు చేసుకుంది.
9/21
ఈ ఏడాది ఆరంభంలో కాలి మడమకు గాయం కాగా, కొన్ని నెలలకు కండరాల్లో చీలిక వచ్చింది.
10/21
అదే స్థితిలో రేస్‌లో పాల్గొనడంతో కండరాల గాయం తీవ్రమై ఇప్పుడు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. దీనికి శస్త్రచికిత్స తర్వాత తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటాని హర్మిలన్ పేర్కొంది.
11/21
‘పోటీల్లో కాకుండా మామూలుగా రన్నింగ్ చేసేందుకే నాకు కనీసం తొమ్మిది నెలలు పట్టవచ్చు. కాబట్టి ట్రాక్‌పై దిగడమనేది ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు.
12/21
ఈ స్థితిలో మరో కెరీర్ ప్రత్యామ్నాయాన్ని చూస్తున్నాను. మున్ముందు మోడలింగ్‌లోకి వెళ్లే ఆలోచన ఉంది. త్వరలో మరిన్ని వివరాలు చెబుతాను’ అని హర్మిలన్ చెప్పింది.
13/21
హర్మిలన్ తల్లి మాధురి సింగ్ కూడా అథ్లెటే.
14/21
2002 బుసాన్ ఆసియా క్రీడల్లో 800 మీటర్ల పరుగులో ఆమె రజతం గెలిచింది.
15/21
తల్లి బాటలోనే మిడిల్ డిస్టెన్స్ వైపు వెళ్లిన హర్మిలన్ తల్లి సాధించిన ఘనతను పునరావృతం చేయడంతో పాటు మరో రజతాన్ని కూడా గెలిచి ఒక మెట్టు పైన నిలిచింది.
16/21
హర్మిలన్ తండ్రి అమన్‌దీప్ బైన్స్ కూడా 1500 మీటర్ల పరుగులో జాతీయ చాంపియన్ కావడంతో పాటు ‘శాఫ్’ క్రీడల్లో మెడల్ గెలుచుకున్నాడు.
17/21
18/21
19/21
20/21
21/21