sports women
-
గాయాలు నన్ను అచేతనం చేశాయి.. మోడలింగ్‌లోకి వెళ్తా (ఫొటోలు)
-
విజేత కోనేరు హంపి
న్యూఢిల్లీ: భారత చెస్ స్టార్, ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్ కోనేరు హంపికి ప్రతిష్టాత్మక బీబీసీ క్రీడా అవార్డుల పురస్కారం దక్కింది. వార్షిక అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హంపి ‘ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్–2020’గా ఎంపికైంది. ఈ విభాగంలో రెజ్లర్ వినేశ్ ఫొగాట్, స్ప్రింటర్ ద్యుతీ చంద్, షూటర్ మనూ భాకర్, భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్‌లతో పోటీ పడిన తెలుగు తేజం హంపి తుది విజేతగా నిలిచింది. 40 మంది సభ్యుల జ్యూరీ ఈ అవార్డు నామినీలను ఎంపిక చేయగా... అభిమానుల ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయించారు. ఐదుగురు నామినీల్లో అత్యధిక ఓట్లు హంపికే వచ్చాయని బీబీసీ తెలిపింది. అవార్డుల ప్రకటన కార్య క్రమాన్ని ‘వర్చువల్’గా బీబీసీ నిర్వహించింది. వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో ఇప్పటి వరకు పతకం గెలిచిన ఏకైక భారత అథ్లెట్ అయిన అంజూ జార్జ్‌కు ‘లైఫ్ టైమ్ అచీవ్మెంట్’ అవార్డు... షూటర్ మనూ భాకర్‌కు ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు లభించాయి. భారత క్రీడారంగంలోని అత్యు త్తమ క్రీడాకారిణులకు తగిన గుర్తింపునిస్తూ 2019లో ఈ అవార్డును బీబీసీ ప్రారంభించగా... బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్ పీవీ సింధు తొలి విజేతగా నిలిచింది. ఈ అవార్డు నాకు మాత్రమే కాకుండా మొత్తం చెస్ క్రీడకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నా. క్రికెట్ సహా ఇతర క్రీడలతో పోలిస్తే భారత్‌లో చెస్‌పై ఎక్కువ మంది దృష్టి ఉండదు. ఇకపై మార్పు వస్తుందని ఆశిస్తున్నా. నా ఆత్మవిశ్వాసం, మానసిక దృఢత్వం కారణంగానే ఇన్నేళ్లుగా విజయాలు సాధించగలుగుతున్నాను. ఒక మహిళా క్రీడాకారిణి ఆటను వదిలేయాలని ఎప్పుడూ అనుకోరాదు. పెళ్లి, పిల్లలు జీవితంలో భాగమే కానీ మన జీవన గమనాన్ని మార్చరాదు. –హంపి -
మన మహిళలు మరెన్నో పతకాలు సాధిస్తారు
న్యూఢిల్లీ: భవిష్యత్తులో భారత మహిళా క్రీడాకారిణులు దేశానికి మరెన్నో పతకాలు అందిస్తారని ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు ఆశాభావం వ్యక్తం చేసింది. 2019 సంవత్సరానికిగాను బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచిన ఆమె... అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీబీసీ ఏర్పాటు చేసిన అవార్డు కార్యక్రమంలో వీడియో ద్వారా యువ మహిళా క్రీడాకారిణులకు సందేశాన్నిచ్చింది. ‘యువ క్రీడాకారిణులకు నా సందేశం ఏమిటంటే... ఒక మహిళగా మనపై మనకు నమ్మకం ఉండాలి. పతకం సాధించగలమనే దృఢ సంకల్పం ఉండాలి. ఇవి ఉంటే పతకం సాధించడం పెద్ద కష్టం కాబోదు. నాకు నమ్మకం ఉంది... త్వరలోనే మహిళా క్రీడాకారిణులు భారత్‌కు అనేక పతకాలను సాధిస్తారు. ‘స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్’అవార్డును నా మద్దతు దారులకు, అభిమానులకు అంకితం చేస్తున్నా. ఇటువంటి అవార్డులు భవిష్యత్తులో మరింత సాధించాలనే స్ఫూర్తిని మాలో రగిలిస్తాయి.’అని పేర్కొంది. 2012లో పదిహేడేళ్ల వయసులో తొలిసారి బ్యాడ్మింటన్ ప్రపంచ మహిళల ర్యాంకింగ్స్‌లో టాప్–20లో చోటుదక్కించుకున్న సింధు... అ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఐదు ప్రపంచ చాంపియన్‌షిప్ మెడల్స్‌ను గెల్చుకున్న ఆమె... ఒలింపిక్స్‌లో సింగిల్స్ విభాగంలో రజత పతకం సాధించిన తొలి భారత బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా నిలిచింది. అంతేకాకుండా గత నాలుగు సంవత్సరాలుగా ర్యాంకింగ్స్‌లో టాప్–10లోనే కొనసాగుతోంది. బీబీసీ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును వెటరన్ అథ్లెట్ పి.టి ఉష సొంతం చేసుకుంది. 1984 లాస్ఏంజిల్స్ ఒలింపిక్ గేమ్స్‌లో ఉష మహిళల 400 మీటర్ల హార్డిల్స్ పరుగు పందెంలో 0.01 సెకను తేడాతో కాంస్య పతకాన్ని కోల్పోయింది. ఈ కార్యక్రమానికి కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు గౌరవ అతిథిగా హాజరయ్యారు. -
అర్చరీ క్రీడకారిణి జ్యోతి సురేఖకు గన్నవరంలో ఘనస్వాగతం
-
అధికారుల తీరుపై క్రీడాకారిణి ఆవేదన