Tiktok Star Mokshita Raghav: Now Turns As Webseries Star Deets Here - Sakshi
Sakshi News home page

Mokshita Raghav: టిక్‌టాక్‌ స్టార్‌ నుంచి ఇప్పుడు వెబ్‌స్టార్‌గా..

Published Sun, Feb 27 2022 8:41 AM | Last Updated on Sun, Feb 27 2022 10:47 AM

Tiktok Star Mokshita Raghav Now Turns As Webseries Star - Sakshi

పెద్ద పెద్ద సినిమాల్లో నటించినా రాని గుర్తింపును కేవలం పది సెకన్ల వీడియోలో నటించి సాధించిన సోషల్‌ మీడియా స్టార్స్‌ ఎందరో! అలాంటి ఓ టిక్‌టాక్‌ స్టారే మోక్షిత రాఘవ్‌.. ఇప్పుడు వెబ్‌స్టార్‌గా దూసుకుపోతోంది..   

 ♦ పుట్టింది ఢిల్లీలో.. పెరిగింది ముంబైలో. 
 ♦  చదువు పూర్తిచేసి, ఓ మంచి ఉద్యోగం సాధించి, స్థిరపడాలనుకున్న ఆమెను మార్చేసింది.. చైనీస్‌ యాప్‌ టిక్‌టాక్‌.  
 ♦  మోక్షిత చేసే టిక్‌టాక్‌ వీడియోల వ్యూస్, లైకుల సంఖ్య టాప్‌స్పీడ్‌లో పరుగెత్తుతుండటంతో చదువుకు ఫుల్‌స్టాప్‌ పడింది. 
 ♦  పూర్తిగా చదువు మానేసి, నటిగా మారాలని నిర్ణయించుకుంది. తల్లిదండ్రులు మందలించినా..మేన తను మాత్రం ఆ జోరు కొనసాగించి టిక్‌టాక్‌ స్టార్‌గా ఎదిగింది. 


♦ పలు అందాల పోటీల్లో పాల్గొని మోడల్‌గానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘రూబరూ ఫేస్‌ ఆఫ్‌ బ్యూటీ ఇంటర్నేషనల్‌ 2016’, ‘మిస్‌ ముంబై 2019’ పోటీల్లో విజేతగా నిలిచింది. 
♦  ప్రతిభ ఉంటే అవకాశాలకేం కొదవ అన్నట్లు.. పదిసెకన్ల వీడియోలతోనే ఎన్నో బుల్లితెర అవకాశాలను కొట్టేసింది. మరెన్నో యూట్యూబ్‌ షార్ట్‌ మూవీల్లో నటించి మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్‌తో పాపులర్‌ అయింది. 


 ♦  ప్రస్తుతం ‘అతిథి ఇన్‌ హౌస్‌’, ‘ప్రభా కి డైరీ సీజన్‌ 2’, ‘కాంట్రాక్ట్‌ కిల్లర్‌’ సిరీస్‌లతో అలరిస్తోంది. 
అందరూ కొత్తదనం కోరుకుంటున్నారు. అదే మాలాంటి సోషల్‌మీడియా స్టార్స్‌కు వరంగా మారింది. నటిగా ఎదగాలంటే ఫ్లాట్‌ఫాం కంటే పోషించే పాత్ర ముఖ్యమని నేను నమ్ముతా. 
– మోక్షిత రాఘవ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement