
సాక్షి, హైదరాబాద్: అందరూ ఎంతో ఇష్టంగా ఎదురు చూసే ఫ్రెండ్‌షిప్ డే వేడుకల కోసం నగరంతో పాటు వండర్లా కూడా సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా ఆగస్టు 4న స్నేహితుల దినోత్సవం సందర్భంగా నగరంలోని ప్రతిష్టాత్మక అమ్యూజ్మెంట్ పార్క్ వండర్లా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. స్నేహానికి ప్రతీకగా ఆ రోజు వండర్లా టిక్కెట్ ఒకటి కొంటే మరొకటి ఉచితంగా అందిస్తున్నారు. ఈ ప్రత్యేక ఆఫర్ ఆన్‌లైన్‌లో మాత్రమే అందిస్తున్నామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె.చిట్టిలపిల్లి తెలిపారు.
లైవ్ డీజే, స్పెషల్ ఈవినింగ్ జుంబా సెషన్‌లు, ఫన్ గేమ్స్, ఉత్కంఠ భరిత పార్క్ రైడ్‌లు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. సాధారణ రోజుల్లో కన్నా పార్క్‌లు ఎక్కువ సేపు తెరిచి ఉంటాయన్నారు. బుక్కింగ్ కోసం https://bookings.wonderla.com/ లేదా హైదరాబాద్ పార్క్ – 084 146 76333, +91 91000 63636ను సంప్రదించవచ్చు.