RRR: Friendship Day Special Song Released From RRR Movie | ఆర్‌ఆర్‌ఆర్‌ - Sakshi
Sakshi News home page

RRR Dosti Song: చరణ్‌, తారక్‌ల స్నేహహస్తం

Published Sun, Aug 1 2021 11:10 AM | Last Updated on Sun, Aug 1 2021 12:34 PM

RRR First Song: Friendship Day Special Song Released From RRR Movie - Sakshi

RRR Friendship Song: జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం ‘రౌద్రం..రణం..రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌). భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి అదిరిపోయే గిఫ్ట్‌ వచ్చేసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి తొలి పాటను 'ఫ్రెండ్‌షిప్‌ డే' సందర్భంగా ఆగస్ట్‌1న ఉయయం 11గంటలకు విడుదల చేశారు. ఎం.ఎం కీరవాణి సంగీత దర్శకత్వంలో ‘దోస్తీ’ అంటూ సాగే ఈ థీమ్‌ సాంగ్‌ చివర్లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు కనిపించారు.

'ఊహించని చిత్ర విచిత్రం..స్నేహానికి చాచిన హస్తం..ప్రాణానికి ప్రాణం ఇస్తుందో, తీస్తుందో'...అంటూ సాగిన ఈ సాంగ్‌ చివర్లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకోవడం హైలైట్‌గా నిలిచింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్‌ అందించగా, ఎం.ఎం.కీరవాణి సంగీతం సంగీతం అందించారు. తెలుగు, తమిళ్‌, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం రూపొందుతుండటంతో ఒక్కో భాషలో ఒక్కో సింగర్‌తో ఈ పాటని పాడించారు. హేమచంద్ర, అనిరుధ్‌ రవిచందర్‌, విజయ్‌ ఏసుదాసు, అమిత్‌ త్రివేది, యాజిన్‌ నైజర్‌ వివిధ భాషల్లో ఈ పాటను ఆలపించారు.

ఇక ఈ సాంగ్‌ పాడిన ఐదుగురు సింగర్స్‌ ఈ వీడియో సాంగ్‌లో కనిపించి సందడి చేశారు. ఈ పాట కోసం దాదాపు ఆరున్నర కోట్ల రూపాయలతో సెట్‌ వేసినట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు. ఒలివియా మోరిస్, ఆలియా భట్‌ కథానాయికలుగా నటిస్తున్నఈ సినిమా అక్టోబర్‌ 13న విడుదల కానుంది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement