స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. ఇది పాట మాత్రమే కాదు. జీవనామృతం. ఈ కాలంలో ప్రేమాభిమానాలను పంచుకోవాల్సిన కుటుంబ సభ్యులే ద్వేషాలను పెంచుకుంటున్నారు. అందరూ కాకపోయినా ఎక్కువ మంది కుటుంబాల్లో జరుగుతోంది ఇదే. అయితే ఒక్కోసారి గొడవలు పడ్డా, కొట్టుకున్నా కష్టకాలంలో అండగా నిలుస్తుంది స్నేహితులు మాత్రమే. కాగా సోమవారం స్నేహితుల దినోత్సవాన్ని ప్రపంచమంతా జరుపుకుంది.
సినీ పరిశ్రమలోనూ హీరోల అభిమానులు తమ హీరో గొప్ప అంటే తమ హీరో తోపు అని సామాజిక మాధ్యమాల్లో విమర్శించుకోవడం పరిపాటే. తమిళ సినిమాలో ఒకప్పుడు రజినీకాంత్, కమల్ హాసన్ అభిమానులు ఈ విషయంలో తీవ్రంగా గొడవపడేవారు. అయితే రాను రానూ ఆ పరిస్థితి తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత విజయ్, అజిత్ అభిమానుల మధ్య ఇలాంటి పోటీ తీవ్ర రూపు దాల్చింది. ఇప్పుడు అది కూడా సన్నగిల్లింది. తాజాగా రజనీకాంత్, విజయ్ అభిమానుల మధ్య ఎవరు సూపర్ స్టార్? అన్న వివాదం నడుస్తోంది.
అయితే హీరోలు మాత్రం తామంతా ఒకటేనని వివాదాలు వద్దని తమ అభిమానులకు హితవాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అభిమానులకు అది తలకెక్కడం లేదు. కాగా దర్శకుడు వెంకట్ ప్రభు చుట్టూ ఎప్పుడు చూసినా మిత్ర బృందమే ఉంటుంది. స్నేహానికి అంత విలువనిచ్చే ఆయన స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆయన ట్విటర్‌లో 'ఇది చాలా సంతోషకరమైన స్నేహితుల దినోత్సవం. ప్రేమను వ్యాపింపజేయండి' అని పేర్కొన్నారు. అందులో నటుడు రజనీకాంత్, కమల్ హాసన్, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ చరణ్, ఆయన తండ్రి గంగై అమరన్ తో కలిసి ఉన్న ఫొటోలను పోస్ట్ చేశారు. అదేవిధంగా విజయ్, అజిత్‌తో కలిసి ఉన్న మరో ఫొటోను పోస్ట్ చేశారు.
Happy friendship day🙏🏽❤️ spread love pic.twitter.com/TJ8Ab1HTEx
— venkat prabhu (@vp_offl) August 6, 2023
చదవండి: మిగతా హీరోయిన్లకు సమంత కథ వేరే!
Comments
Please login to add a commentAdd a comment