పండగ స్పెషల్.. దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ కొత్త పోస్టర్ | Thalapathy Vijay's 'The GOAT' Movie New Poster | Sakshi
Sakshi News home page

పండగ స్పెషల్.. దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ కొత్త పోస్టర్

Published Wed, Jan 17 2024 3:01 PM | Last Updated on Wed, Jan 17 2024 3:08 PM

Thalapathy Vijay The GOAT Movie New Poster - Sakshi

దళపతి విజయ్‌ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్' (G.O.A.T). వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీల మీనాక్షిచౌదరి హీరోయిన్ కాగా.. స్నేహ, లైలా, మోహన్‌, ప్రశాంత్‌, ప్రభుదేవా, అజ్మల్‌ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతమందిస్తున్నాడు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. 

(ఇదీ చదవండి: సంక్రాంతి సినిమాల సందడి.. ఏది హిట్? కలెక్షన్స్ ఎంత?)

ఇప్పటికే కశ్మీర్‌, హైదరాబాద్‌లో షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం చైన్నెలో జరుగుతోంది. ఈ మధ్య రెండు పోస్టర్స్ రిలీజ్ చేయగా.. వాటితో కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. అలానే ఈ చిత్రం విజయ్.. ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ఓ క్లారిటీ వచ్చింది. తాజాగా సంక్రాంతి సందర్భంగా మరో పోస్టర్ విడుదల చేశారు. 

ఈ ఫొటోలో భాగంగా మిలటరీ గెటప్‌లో తుపాకీ పట్టుకుని విజయ్‌, ప్రభుదేవా, ప్రశాంత్‌, అజ్మల్‌ కనిపించారు. ఈ సినిమా వేసవి కానుకగా థియేటర్లలోకి రానుందని తెలుస్తోంది. అలానే ఈ చిత్రాన్ని టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తీస్తున్నట్లు కూడా రూమర్స్ వస్తున్నాయి. వీటిపై క్లారిటీ రావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ సాయిపల్లవి చెల్లి.. కుర్రాడు ఎవరంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement