'లియో' మూవీ హైనా వల్ల స్టార్ హీరో ఫ్యాన్స్ మధ్య గొడవ? | Leo Movie Hyena Name Vijay And Ajith Fans Issue | Sakshi
Sakshi News home page

Leo Movie Hyena: లోకేశా.. హైనా పేరు వల్ల ఇంత రచ్చ ఏందయ్యా?

Published Sun, Oct 22 2023 6:35 PM | Last Updated on Mon, Oct 23 2023 1:40 PM

Leo Movie Hyena Name Vijay And Ajith Fans Issue - Sakshi

'లియో' సినిమా కొందరికి నచ్చింది. మరికొందరికి నచ్చలేదు. కానీ ఇందులో హైనా క్యారెక్టర్ మాత్రం చూసిన ప్రతిఒక్కరికీ పిచ్చపిచ్చగా నచ్చేసింది. మూవీ సక్సెస్‌లో మేజర్ రోల్ ప్లే చేసిన ఈ జంతువు పాత్ర వల్ల ఇద్దరు స్టార్ హీరో ఫ్యాన్స్ తిట్టుకుంటున్నారు. ఈ వ్యవహారంలో విజయ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారండోయ్. ఇంతకీ హైనా వల్ల హర్ట్ అయిన స్టార్ హీరో అభిమానులు ఎవరు? అసలెందుకీ గొడవ?

(ఇదీ చదవండి: చిన్నప్పటి ఫ్రెండ్ కోసం కదిలొచ్చిన చిరంజీవి.. స్వయంగా ఆస్పత్రికి వెళ్లి!)

అసలేం జరిగింది?
LCU అదేనండి లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తీసిన సినిమా 'లియో'. దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ మూవీలో ఓ హైనా క్యారెక్టర్ కూడా ఉంది. సినిమా ఎంట్రీ సీన్‌లో హీరో దీనితో పోరాడుతాడు. తర్వాత దాన్ని అటవీశాఖ అధికారులకు అప్పగిస్తాడు. కొన్నాళ్లకు దాన్ని మచ్చిక చేసుకుని సుబ్రహ్మణ్యం అని పేరు కూడా పెడతాడు. క్లైమాక్స్‌లో ఇదే హైనా హీరో ఫ్యామిలీని కాపాడే సీన్ ఒకటి ఉంటుంది. థియేటర్లలో అరుపులే అసలు.

సమస్య ఏంటి?
అయితే లియో సినిమాలో హైనాకి సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టడం అజిత్ ఫ్యాన్స్‌కి నచ్చలేదు. ఎందుకంటే తమ అభిమాన హీరో పూర్తి పేరు అజిత్ కుమార్ సుబ్రమణియన్. దీంతో కావాలనే హైనాకి ఈ పేరు పెట్టారని కామెంట్స్ చేస్తున్నారు. అయితే దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఉద్దేశం మాత్రం అది అయ్యిండదు. ఎందుకంటే గతంలో ఓసారి మాట్లాడుతూ.. హీరో అజిత్ తోనూ సినిమా చేస్తానని అన్నాడు. ఇలా సినిమా చేస్తానని అన్నవాడు.. సదరు హీరో పేరు వచ్చేలా చేయడు కదా! సో అదన్నమాట విషయం. కానీ ఇదంతా వినే మూడ్‌లో ఫ్యాన్స్ లేరు. విజయ్ vs అజిత్ అభిమానులు ఈ విషయమై సోషల్ మీడియాలో గొడవపడుతున్నారు.

(ఇదీ చదవండి: 'అల వైకుంఠపురములో' నటుడికి నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement