Hyena
-
'లియో' మూవీ హైనా వల్ల స్టార్ హీరో ఫ్యాన్స్ మధ్య గొడవ?
'లియో' సినిమా కొందరికి నచ్చింది. మరికొందరికి నచ్చలేదు. కానీ ఇందులో హైనా క్యారెక్టర్ మాత్రం చూసిన ప్రతిఒక్కరికీ పిచ్చపిచ్చగా నచ్చేసింది. మూవీ సక్సెస్‌లో మేజర్ రోల్ ప్లే చేసిన ఈ జంతువు పాత్ర వల్ల ఇద్దరు స్టార్ హీరో ఫ్యాన్స్ తిట్టుకుంటున్నారు. ఈ వ్యవహారంలో విజయ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారండోయ్. ఇంతకీ హైనా వల్ల హర్ట్ అయిన స్టార్ హీరో అభిమానులు ఎవరు? అసలెందుకీ గొడవ? (ఇదీ చదవండి: చిన్నప్పటి ఫ్రెండ్ కోసం కదిలొచ్చిన చిరంజీవి.. స్వయంగా ఆస్పత్రికి వెళ్లి!) అసలేం జరిగింది? LCU అదేనండి లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తీసిన సినిమా 'లియో'. దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ మూవీలో ఓ హైనా క్యారెక్టర్ కూడా ఉంది. సినిమా ఎంట్రీ సీన్లో హీరో దీనితో పోరాడుతాడు. తర్వాత దాన్ని అటవీశాఖ అధికారులకు అప్పగిస్తాడు. కొన్నాళ్లకు దాన్ని మచ్చిక చేసుకుని సుబ్రహ్మణ్యం అని పేరు కూడా పెడతాడు. క్లైమాక్స్‌లో ఇదే హైనా హీరో ఫ్యామిలీని కాపాడే సీన్ ఒకటి ఉంటుంది. థియేటర్లలో అరుపులే అసలు. సమస్య ఏంటి? అయితే లియో సినిమాలో హైనాకి సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టడం అజిత్ ఫ్యాన్స్‌కి నచ్చలేదు. ఎందుకంటే తమ అభిమాన హీరో పూర్తి పేరు అజిత్ కుమార్ సుబ్రమణియన్. దీంతో కావాలనే హైనాకి ఈ పేరు పెట్టారని కామెంట్స్ చేస్తున్నారు. అయితే దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఉద్దేశం మాత్రం అది అయ్యిండదు. ఎందుకంటే గతంలో ఓసారి మాట్లాడుతూ.. హీరో అజిత్ తోనూ సినిమా చేస్తానని అన్నాడు. ఇలా సినిమా చేస్తానని అన్నవాడు.. సదరు హీరో పేరు వచ్చేలా చేయడు కదా! సో అదన్నమాట విషయం. కానీ ఇదంతా వినే మూడ్‌లో ఫ్యాన్స్ లేరు. విజయ్ vs అజిత్ అభిమానులు ఈ విషయమై సోషల్ మీడియాలో గొడవపడుతున్నారు. (ఇదీ చదవండి: 'అల వైకుంఠపురములో' నటుడికి నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?) -
హైన దాడిలో లేగదూడ మృతి
స్టేషన్ ఘన్పూర్ మండలం రాఘవాపూర్‌లో ఓ లేగ దూడపై హైన దాడి చేసి చంపింది. హైన దాడిలో జంతువులు చనిపోవడం ఈ మధ్య సర్వసాధారణమైపోయింది. సుమారు 10 మూగజీవాలు ఈ మధ్య కాలంలో హైనాల చేతిలో చనిపోయారు. అధికారులు ఈ విషయంపై దృష్టిసారించి తగుచర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
లేగదూడలపై హైనా పంజా
రఘనాథపల్లి మండలం గోవర్ధనగిరిలో మళ్లీ హైనాలు తమ ప్రతాపం చూపించాయి. ఒకే రైతుకు చెందిన రెండు లేగదూడలపై దాడి చేశాయి. ఇందులో ఒక లేగదూడ మృతిచెందగా..మరొకటి తీవ్రంగా గాయపడింది. హైన సంచారంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. -
చిరుత కాదు హైనా
గోవర్ధనగిరిలో అటవీ అధికారుల పరిశీలన రఘునాథపల్లి : మండలంలోని గోవర ్ధనగిరి పరిసర ప్రాంతాల్లో పశువుల పాకలలో ఉన్న లేగ దూడలను చంపింది చిరుత పులి కాదని, హైనా అనే జంతువని వరంగల్ అటవీ శాఖ రేంజ్ అధికారి ప్రకాష్ తెలిపారు. గ్రామానికి చెందిన ఈదులకంటి మల్లారెడ్డి, గొడుగు రాజు, ఈదులకంటి ప్రతాప్‌రెడ్డి, వల్లపు రాజు, చిలువేరు బచ్చయ్యలకు చెందిన లేగ దూడలను గుర్తు తెలియని జంతువు హతం చేసిన విషయం విదితమే. ఈ మేరకు బుధవారం రాత్రి ప్రకాష్‌తో పాటు భీట్ ఆఫీసర్లు శివాజి, హుస్సేన్, సెక్షన్ అధికారి అరుణ గ్రామ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. బాదిత రైతుల నుంచి లేగ దూడలను జంతువు చంపిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. జంతువు చేతిలో మృతి చెందిన లేగ దూడలను భూమిలో నుంచి వెలికి తీసి గురువారం శవ పంచనామ చేస్తామని చెప్పారు. దూడలను చంపింది చిరుతనా, హైనానా అనేది పంచనామాలో స్పష్టంగా తేలుతుందన్నారు. -
హైనాను కొట్టి చంపిన 'అనంత' వాసులు
పుట్టపర్తి: అనంతపురం జిల్లా వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన అడవి జంతువు హైనాను స్థానికులు కొట్టి చంపారు. పుట్టపర్తి, బుక్కపట్నం మండలాల్లో 25 మందిపై దాడి చేసి గాయపరిచిన హైనాను పట్టుకుని కొట్టి చంపారు. పొలానికి వెళ్లిన పలువురు రైతులపై హైనా దాడి చేసింది. హైనా దాడిలో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే రైతులపై దాడిచేసింది చిరుతపులి అని ముందు అనుకున్నారు. చివరకు హైనాగా గుర్తించి పట్టుకున్నారు. హైనాను కొట్టి చంపడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.