
తమిళ స్టార్ హీరోలు అజిత్, విజయ్‌కు ఇద్దరికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అటు తమిళనాట కాకుండా తెలుగులో కూడా వీరికి సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడతాయి.
Venkat Prabhu Says Ajith Vijay Multi Starer Movie: తమిళ స్టార్ హీరోలు అజిత్, విజయ్‌కు ఇద్దరికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అటు తమిళనాట కాకుండా తెలుగులో కూడా వీరికి సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడతాయి. అలాంటిది వీరిద్దరు కలిసి ఒకే సినిమాలో నటిస్తే. విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ పడితే ఆ క్రేజ్ మాములుగా ఉండదు.
అయితే వీరిద్దరితో కలిసి సినిమా తీయాలనుందని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు వెల్లడించారు. ఇటీవల శింబు హీరోగా మానాడు సినిమా తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టారు. టాలీవుడ్ గుడ్ బాయ్ నాగ చైతన్యతో వెంకట్ ప్రభు ఓ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా చెన్నైలోని ఓ కాలేజ్ ఫంక్షన్లో అజిత్, విజయ్ ఇద్దరితో కలిపి మూవీ తెరకెక్కించాలని, అందుకు సరిపడా కథ సిద్ధంగా కూడా ఉందని తన మనసులోని మాట బయటపెట్టాడు వెంకట్ ప్రభు. దీంతో తమిళ సినీ పరిశ్రమలో ఒకరకమైన ఉత్సుకత ఏర్పడింది. మరీ ఈ సినిమాకు అజిత్, విజయ్ ఒప్పుకుని పట్టాలెక్కుద్దో వేచి చూడాలి.
చదవండి: ‘సలాం రాఖీ భాయ్’ అంటూ ఐరా ఎంత క్యూట్‌గా పాడిందో చూడండి..
‘గెట్ అవుట్’ అంటూ విశ్వక్ సేన్‌పై టీవీ యాంకర్ ఫైర్
#Ajithkumar Vs #ThalapathyVijay in #Mankatha2 Official Announcement 🔜💥@vp_offl Sir ❤#Beast #HBDAjithkumar #Ak61 pic.twitter.com/JWqdBPgy4U
— indian Box office (@indianBoxofflce) April 30, 2022