వైరల్‌ వీడియో.. గుండెను తడిమే దృశ్యాలు! | Viral Video: Woman gets a warm greeting From Several Street Dogs | Sakshi

వైరల్‌ వీడియో.. హృదయానికి హత్తుకుంటోంది!

Aug 8 2022 4:34 PM | Updated on Aug 8 2022 7:38 PM

Viral Video: Woman gets a warm greeting From Several Street Dogs - Sakshi

మనం ఏది ఇస్తే అదే తిరుగొస్తుందనడానికి ఇంత కంటే నిదర్శనం కావాలా! ఈ వీడియోను మీరూ చూడండి.

స్నేహానికి కన్నా మిన్న లోకాన లేదన్నారు. చెలిమిని వర్ణించడానికి ఈ ఒక్క మాట చాలు. నా అన్నవాళ్లు ఎవరున్నా లేకపోయినా మంచి మిత్రుడు తోడుంటే జీవితాంతం భరోసాగా బతికేయొచ్చు. స్నేహం విలువను చాటి చెప్పడానికి ఆగస్టు నెలలో మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం. 

స్మార్ట్‌ ఫోన్లు, సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాక ఫ్రెండ్‌షిప్‌ డే’ లాంటి ప్రత్యేకమైన రోజుల్లో శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇక ఫొటోలు, వీడియోలకైతే లెక్కేలేదు. అయితే అక్కడక్కడా గుండెను తడిమే హృద్యమైన దృశ్యాలు మన కంటబడుతున్నాయి. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్‌ గోయెంకా ట్విటర్‌లో షేర్‌ చేసిన వీడియో హృదయానికి హత్తుకుంటోంది. (క్లిక్: వందేళ్ల క్రితం చనిపోయిన చిన్నారి... ఇంకా ఇప్పటికీ చెక్కుచెదరకుండా..)

విశ్వాసానికి మారుపేరుగా నిలిచే శునకాలు.. వెల్లువలా వచ్చి ఓ మహిళను అప్యాయంగా ముద్దాతున్న దృశ్యాలు వీక్షకులను తన్మయత్వానికి గురిచేస్తున్నాయి. తనపై ఎంతో ప్రేమ చూపిస్తున్న మూగజీవాలను ఆమె గుండెలకు హత్తుకోవడం చూస్తుంటే.. హృదయం పులకిస్తుంది. ఆమె ఎవరు.. ఎక్కడ, ఎపుడు జరిగిందనే వివరాలతో సంబంధం లేకుండా అలౌకిక భావనలోకి వెళ్లిపోతాం. మనం ఏది ఇస్తే అదే తిరుగొస్తుందనడానికి ఇంత కంటే నిదర్శనం కావాలా! ఈ వీడియోను మీరూ చూడండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement