ప్రస్తుతం సినిమాటోగ్రాఫర్‌గా రాణిస్తున్న పీజీ.వింద (అష్టాచెమ్మా, సమ్మోహనం, జెంటిల్మన్..ఫేం) నిజమైన హితుడు అని చెప్పాలి. తన కల సాకారంతో పాటు మిత్రులందిరివీ కలిపి మన కలలను సాకారం చేయాలని ఆరాటపడతాడు. సిటీలోని జేఎన్‌టీయూలో చదివేటప్పుడు నాకు సహాధ్యాయి. ఇద్దరికీ కళలపట్ల ఆసక్తి, ఏదో సాధించాలన్న తపన.. మా స్నేహబంధంతో పాటు బలపడుతూ వచి్చంది. బేగంపేట్‌లో ఓ చిన్న గదిలో అద్దెకుంటూ చాలీ చాలని డబ్బులతో బిస్కట్లు, సమోసాలతో కడుపు నింపుకుంటూ.. బహుశా ఇవన్నీ ఎదిగే క్రమంలో చాలా మందికి అనుభవమే కావచ్చు.
కానీ.. మా లాంటి స్నేహం మాత్రం అతి కొద్దిమందికే దక్కింది అని సగర్వంగా చెప్పగలను. దర్శకులు శేఖర్ కమ్ములకు నన్ను పీజీ.వింద పరిచయం చేసి కాస్ట్యూమ్ డిజైనర్‌గా అవకాశం ఇప్పించకపోతే.. బహుశా సినీరంగానికి దూరంగానే ఉండేవాడినేమో. నాలాంటి మరికొంత మంది స్నేహితుల కలల సాకారానికి కూడా సాయం అయ్యాడు. అందుకే ఎందరో ఫ్రెండ్స్.. కానీ కొందరే స్నే‘హితులు’.. అలాంటివారిలో బెస్ట్ పీజీ.వింద.
–అరవింద్ జాషువా, ఫ్యాషన్ డిజైనర్, తెలుగు సినీ దర్శకుడు
Comments
Please login to add a commentAdd a comment