యే దోస్తీ హమ్ నహీ తోడేంగే తోడేంగే దమ్ మగర్ తేరా సాత్ నా చోడేంగే.. అంటూ నాటి షోలే సినిమాలో ఆనంద్ బక్షి..రచించిన ఈ పాట మొదలుకొని.. ఆ మధ్య కాలంలో వచి్చన.. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం నిదరలో ఇద్దరమూ ఒకేలా కలగంటం నిజంలో ప్రతి క్షణం కళలకే కల అవుతాం.. అంటూ భువన చంద్ర రచించిన ఈ పాట వరకూ స్నేహం గొప్పతనాన్ని తెలిపేవే.. ఇలాంటి అనేక పాటలు స్నేహంలోని మాధుర్యాన్ని తెలియజేస్తాయి..
నిజమే మరి నాటి నుంచి నేటి తరం వరకూ లవర్స్ లేని వాళ్లు ఉంటారేమో గానీ.. స్నేహితులు లేని వాళ్లు దాదాపు ఉండరనే చెప్పొచ్చు.. ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత మంది ప్రాణ స్నేహితులు ఉంటారు. వీరికి కులం, మతం, ప్రాంతం, భాష, ఆస్తి, అంతస్తు, పేద ధనిక వంటి బేధాలు అడ్డురావు.. మనం ఫోన్ చెయ్యగానే..‘అరేయ్ చెప్పరా మామా’ అనేంత క్లోజ్ నెస్ వారి మధ్య ఉంటుంది. స్నేహాన్ని పంచుకుంటూ, పెంచుకుంటూ.. కష్టాలు, కన్నీళ్లు, ఆనందాలు, సరదాలూ అన్నీ వారితో పంచుకునే వాళ్లే నిజమైన ఫ్రెండ్స్. నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా.. అలాంటి కొందరు దోస్తులకు సంబంధించిన కొన్ని ప్రేరణాత్మక విషయాలు..
విడదీయరాని స్నేహ బంధం..
గోల్కొండ: రాజకీయాల్లో ఒకేసారి ప్రవేశించి అంచలంచలుగా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగామని కార్వాన్, బహదూర్‌పురా ఎమ్మెల్యేలు కౌసర్ మోహియుద్దీన్, మహ్మద్ ముబీన్ అంటున్నారు. రోజు రోజుకు తమ స్నేహ బంధం బలపడుతుందని ‘ఫ్రెండ్‌షిప్ డే’ సందర్భంగా ‘సాక్షి’తో తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.
40 ఏళ్ల క్రితం మజ్లీస్ కార్యకర్తలుగా కార్వాన్ నుంచి కౌసర్ మోహియుద్దీన్ తన రాజకీయ జీవితం ప్రారంభించారు. అదే సమయంలో పాత నగరం ఆగాపూరా నుంచి మహ్మద్ ముబీన్ రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ సమయంలో ఇద్దరూ చురుకైన యువ కార్యకర్తలుగా పార్టీ అధిష్టానం మెప్పుపొందారు. దివంగత మజ్లీస్ అధినేత సలావుద్దీన్ ఓవైసీతో పాటు ప్రస్తుత అధినేత అసదుద్దీన్ ఓవైసీకి నమ్మిన బంటులుగా మారారు. అయితే ముందుగా ఎమ్మెల్యే పదవి వరించింది మాత్రం కౌసర్ మోహియుద్దీన్‌కు.
వరుసగా మూడోసారి కౌసర్ ఎమ్మెల్యేగా విజయం సాధించగా ముబీన్ మొదటిసారి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మెహియుద్దీన్ సతీమణి గోల్కొండ వెస్ట్, నానల్‌నగర్ నుంచి కార్పొరేటర్‌గా విజయం సాధించగా ముబీన్ మాత్రం ఆగాపూరా నుంచి రెండుసార్లు, శాస్త్రీపురం నుంచి ఒకసారి కార్పొరేటర్‌గా గెలిచారు. ప్రస్తుత అసెంబ్లీలో గెలిచిన ఇద్దరూ ఒకే రోజు ఒకే సారి ఒకే సమయంలో ఆప్తమిత్రులుగా అసెంబ్లీలో అడుగు పెట్టడం విశేషం. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ తాము ప్రాధాన్యం ఇస్తామంటారు. 40 ఏళ్ల తమ స్నేహ బంధంలో ఏనాడూ పొరపచ్చాలు రాలేదని వారు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment