Mohiuddin Khan
-
స్నేహం అజరామరం.. చరిత్రాత్మకం
యే దోస్తీ హమ్ నహీ తోడేంగే తోడేంగే దమ్ మగర్ తేరా సాత్ నా చోడేంగే.. అంటూ నాటి షోలే సినిమాలో ఆనంద్ బక్షి..రచించిన ఈ పాట మొదలుకొని.. ఆ మధ్య కాలంలో వచి్చన.. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం నిదరలో ఇద్దరమూ ఒకేలా కలగంటం నిజంలో ప్రతి క్షణం కళలకే కల అవుతాం.. అంటూ భువన చంద్ర రచించిన ఈ పాట వరకూ స్నేహం గొప్పతనాన్ని తెలిపేవే.. ఇలాంటి అనేక పాటలు స్నేహంలోని మాధుర్యాన్ని తెలియజేస్తాయి.. నిజమే మరి నాటి నుంచి నేటి తరం వరకూ లవర్స్ లేని వాళ్లు ఉంటారేమో గానీ.. స్నేహితులు లేని వాళ్లు దాదాపు ఉండరనే చెప్పొచ్చు.. ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత మంది ప్రాణ స్నేహితులు ఉంటారు. వీరికి కులం, మతం, ప్రాంతం, భాష, ఆస్తి, అంతస్తు, పేద ధనిక వంటి బేధాలు అడ్డురావు.. మనం ఫోన్ చెయ్యగానే..‘అరేయ్ చెప్పరా మామా’ అనేంత క్లోజ్ నెస్ వారి మధ్య ఉంటుంది. స్నేహాన్ని పంచుకుంటూ, పెంచుకుంటూ.. కష్టాలు, కన్నీళ్లు, ఆనందాలు, సరదాలూ అన్నీ వారితో పంచుకునే వాళ్లే నిజమైన ఫ్రెండ్స్. నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా.. అలాంటి కొందరు దోస్తులకు సంబంధించిన కొన్ని ప్రేరణాత్మక విషయాలు..విడదీయరాని స్నేహ బంధం..గోల్కొండ: రాజకీయాల్లో ఒకేసారి ప్రవేశించి అంచలంచలుగా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగామని కార్వాన్, బహదూర్‌పురా ఎమ్మెల్యేలు కౌసర్ మోహియుద్దీన్, మహ్మద్ ముబీన్ అంటున్నారు. రోజు రోజుకు తమ స్నేహ బంధం బలపడుతుందని ‘ఫ్రెండ్షిప్ డే’ సందర్భంగా ‘సాక్షి’తో తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. 40 ఏళ్ల క్రితం మజ్లీస్ కార్యకర్తలుగా కార్వాన్ నుంచి కౌసర్ మోహియుద్దీన్ తన రాజకీయ జీవితం ప్రారంభించారు. అదే సమయంలో పాత నగరం ఆగాపూరా నుంచి మహ్మద్ ముబీన్ రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ సమయంలో ఇద్దరూ చురుకైన యువ కార్యకర్తలుగా పార్టీ అధిష్టానం మెప్పుపొందారు. దివంగత మజ్లీస్ అధినేత సలావుద్దీన్ ఓవైసీతో పాటు ప్రస్తుత అధినేత అసదుద్దీన్ ఓవైసీకి నమ్మిన బంటులుగా మారారు. అయితే ముందుగా ఎమ్మెల్యే పదవి వరించింది మాత్రం కౌసర్ మోహియుద్దీన్‌కు. వరుసగా మూడోసారి కౌసర్ ఎమ్మెల్యేగా విజయం సాధించగా ముబీన్ మొదటిసారి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మెహియుద్దీన్ సతీమణి గోల్కొండ వెస్ట్, నానల్‌నగర్ నుంచి కార్పొరేటర్‌గా విజయం సాధించగా ముబీన్ మాత్రం ఆగాపూరా నుంచి రెండుసార్లు, శాస్త్రీపురం నుంచి ఒకసారి కార్పొరేటర్‌గా గెలిచారు. ప్రస్తుత అసెంబ్లీలో గెలిచిన ఇద్దరూ ఒకే రోజు ఒకే సారి ఒకే సమయంలో ఆప్తమిత్రులుగా అసెంబ్లీలో అడుగు పెట్టడం విశేషం. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ తాము ప్రాధాన్యం ఇస్తామంటారు. 40 ఏళ్ల తమ స్నేహ బంధంలో ఏనాడూ పొరపచ్చాలు రాలేదని వారు స్పష్టం చేశారు. -
నా వర్గం వారిని రక్షించేందుకే చేరా...
పోలీసు విచారణలో ఐఎస్ఐఎస్ సభ్యుడు సల్మాన్ వెల్లడి అతడి కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ సాక్షి, హైదరాబాద్: విజిట్ వీసా మీద దుబాయ్‌కు వెళ్తూ శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం పోలీసులకు పట్టుబడిన ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) ఉగ్రవాద సంస్థ సభ్యుడు సల్మాన్ మొహియుద్దీన్ విచారణలో అనేక విషయాలు వెల్లడించాడు. సిరియాలో చిత్రహింసలకు గురవుతున్న తమ వర్గం వారిని రక్షించుకునేందుకే ఐఎస్ఐఎస్లో చేరానని పోలీసుల విచారణలో అంగీకరించాడు. ‘దుబాయ్‌లో ఉన్న నా ప్రియురాలు నక్కీ జోసెఫ్ అలియాస్ ఆయేషాతో కలసి దుబాయ్ నుంచి టర్కీ మీదుగా రహస్యంగా సరిహద్దులు దాటి సిరియా చేరాలనుకున్నా, అమెరికాలో ఉన్నప్పుడే దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించా. అక్కడ వీసా రాకపోవడంతో హైదరాబాద్‌కు వచ్చా. ఐఎస్ఐఎస్లో శిక్షణ తరువాత ఇక్కడ కూడా (హైదరాబాద్‌లో) ఇస్లాం రాజ్య స్థాపనకు కృషి చేయాలనుకున్నా’ అని సల్మాన్ విచారణలో పోలీసులకు తెలిపాడు. సల్మాన్ కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్... విమానాశ్రయంలో సల్మాన్ తమకు చిక్కకుండా ఉంటే భవిష్యత్తులో హైదరాబాద్‌లో భారీ విధ్వంసం జరిగేదని పోలీసులు అంటున్నారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న లాప్టాప్ హార్డ్‌డిస్క్‌ను విచారణ నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. సల్మాన్‌ను పూర్తిస్థాయిలో విచారించేందుకు ఏడు రోజుల కస్టడీ కోరుతూ ఆర్జీఐఏ పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో శనివారం పిటిషన్ దాఖలు చేశారు. కాగా, చర్లపల్లి జైలులో ఉన్న సల్మాన్‌ను చూసేందుకు శనివారం కుటుంబసభ్యులు వచ్చివెళ్లారు. ఫేస్బుక్, ట్వీటర్లపై ఆరా.. ‘దౌలాన్ న్యూస్’ పేరుతో సల్మాన్ నడుపుతున్న ఫేస్బుక్, ట్వీటర్ ఖాతాలో ఉన్నవారి జాబితాపై కూడా పోలీసులు దృష్టిసారించారు. అక్టోబర్‌లో అమెరికా నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చాక సల్మాన్ ఎన్ని పేర్లతో ఫేస్బుక్ ఖాతాలు తెరిచాడు, ఎంత మందితో పరిచయం పెంచుకున్నాడు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఇందులో హైదరాబాద్‌తో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారని తేలింది. సల్మాన్ మొబైల్ కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ‘ఐఎస్’వైపు 87 మంది హైదరాబాదీలు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 87 మంది విద్యావంతులు కూడా ఐఎస్ఐఎస్ వైపు ఆకర్షితులైన వారిలో ఉన్నారు. వీరిలో 44 మంది యువకులకు సీసీఎస్ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. మిగతావారిపై గట్టి నిఘా పెట్టారు. వీరంతా శివార్లలోని ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల్లో చదువుతున్నవారే కావడం గమనార్హం. అప్రమత్తమైన పోలీసులు... ఐఎస్ఐఎస్ జాడలు మరోసారి నగరంలో కనిపించడంతో జంట పోలీసు కమిషనరేట్ అధికారులు అప్రమత్తమయ్యారు. రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లు, లాడ్జీలు, హోటళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఫేస్బుక్ ఖాతాలపై నిఘాను సైతం పెంచారు. ‘‘ సిరియాలో చిత్రహింసలకు గురవుతున్న మా వర్గం వారిని రక్షించుకునేందుకే ఐఎస్ఐఎస్లో చేరా. దుబాయ్‌లో ఉన్న నా ప్రియురాలు అయేషాతో కలిసి టర్కీ నుంచి రహస్యంగా సిరియాకు వెళ్లాలనుకున్నాం. అమెరికా నుంచే దుబాయ్‌కి విజిటింగ్ వీసా మీదా వెళ్లాలనుకున్నా.. కానీ, వీలుకాలేదు. అందుకే హైదరాబాద్‌కు వచ్చి నాలుగు నెలల తర్వాత మళ్లీ దుబాయ్‌కి వెళ్లేందుకు ప్రయత్నించా.’’ - పోలీసుల విచారణలో ఐఎస్ఐఎస్ సభ్యుడు సల్మాన్