Kausar
-
స్నేహం అజరామరం.. చరిత్రాత్మకం
యే దోస్తీ హమ్ నహీ తోడేంగే తోడేంగే దమ్ మగర్ తేరా సాత్ నా చోడేంగే.. అంటూ నాటి షోలే సినిమాలో ఆనంద్ బక్షి..రచించిన ఈ పాట మొదలుకొని.. ఆ మధ్య కాలంలో వచి్చన.. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం నిదరలో ఇద్దరమూ ఒకేలా కలగంటం నిజంలో ప్రతి క్షణం కళలకే కల అవుతాం.. అంటూ భువన చంద్ర రచించిన ఈ పాట వరకూ స్నేహం గొప్పతనాన్ని తెలిపేవే.. ఇలాంటి అనేక పాటలు స్నేహంలోని మాధుర్యాన్ని తెలియజేస్తాయి.. నిజమే మరి నాటి నుంచి నేటి తరం వరకూ లవర్స్ లేని వాళ్లు ఉంటారేమో గానీ.. స్నేహితులు లేని వాళ్లు దాదాపు ఉండరనే చెప్పొచ్చు.. ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత మంది ప్రాణ స్నేహితులు ఉంటారు. వీరికి కులం, మతం, ప్రాంతం, భాష, ఆస్తి, అంతస్తు, పేద ధనిక వంటి బేధాలు అడ్డురావు.. మనం ఫోన్ చెయ్యగానే..‘అరేయ్ చెప్పరా మామా’ అనేంత క్లోజ్ నెస్ వారి మధ్య ఉంటుంది. స్నేహాన్ని పంచుకుంటూ, పెంచుకుంటూ.. కష్టాలు, కన్నీళ్లు, ఆనందాలు, సరదాలూ అన్నీ వారితో పంచుకునే వాళ్లే నిజమైన ఫ్రెండ్స్. నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా.. అలాంటి కొందరు దోస్తులకు సంబంధించిన కొన్ని ప్రేరణాత్మక విషయాలు..విడదీయరాని స్నేహ బంధం..గోల్కొండ: రాజకీయాల్లో ఒకేసారి ప్రవేశించి అంచలంచలుగా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగామని కార్వాన్, బహదూర్‌పురా ఎమ్మెల్యేలు కౌసర్ మోహియుద్దీన్, మహ్మద్ ముబీన్ అంటున్నారు. రోజు రోజుకు తమ స్నేహ బంధం బలపడుతుందని ‘ఫ్రెండ్షిప్ డే’ సందర్భంగా ‘సాక్షి’తో తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. 40 ఏళ్ల క్రితం మజ్లీస్ కార్యకర్తలుగా కార్వాన్ నుంచి కౌసర్ మోహియుద్దీన్ తన రాజకీయ జీవితం ప్రారంభించారు. అదే సమయంలో పాత నగరం ఆగాపూరా నుంచి మహ్మద్ ముబీన్ రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ సమయంలో ఇద్దరూ చురుకైన యువ కార్యకర్తలుగా పార్టీ అధిష్టానం మెప్పుపొందారు. దివంగత మజ్లీస్ అధినేత సలావుద్దీన్ ఓవైసీతో పాటు ప్రస్తుత అధినేత అసదుద్దీన్ ఓవైసీకి నమ్మిన బంటులుగా మారారు. అయితే ముందుగా ఎమ్మెల్యే పదవి వరించింది మాత్రం కౌసర్ మోహియుద్దీన్‌కు. వరుసగా మూడోసారి కౌసర్ ఎమ్మెల్యేగా విజయం సాధించగా ముబీన్ మొదటిసారి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మెహియుద్దీన్ సతీమణి గోల్కొండ వెస్ట్, నానల్‌నగర్ నుంచి కార్పొరేటర్‌గా విజయం సాధించగా ముబీన్ మాత్రం ఆగాపూరా నుంచి రెండుసార్లు, శాస్త్రీపురం నుంచి ఒకసారి కార్పొరేటర్‌గా గెలిచారు. ప్రస్తుత అసెంబ్లీలో గెలిచిన ఇద్దరూ ఒకే రోజు ఒకే సారి ఒకే సమయంలో ఆప్తమిత్రులుగా అసెంబ్లీలో అడుగు పెట్టడం విశేషం. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ తాము ప్రాధాన్యం ఇస్తామంటారు. 40 ఏళ్ల తమ స్నేహ బంధంలో ఏనాడూ పొరపచ్చాలు రాలేదని వారు స్పష్టం చేశారు. -
అమ్మాయి పాటలు రాయడమేమిటని ఆశ్చర్యపోయేవారు!
‘బాలీవుడ్లో పదిమంది పాటల రచయితల పేర్లు చెప్పండి?’ అని అడిగితే ‘పదేం ఖర్మ పాతిక పేర్లు చెబుతాం’ అంటాం. ‘ఫిమేల్ లిరిసిస్ట్‌ల పేర్లు చెప్పండి?’ అంటే మాత్రం నీళ్లు నములుతాం. ఇలాంటి సమయంలో కౌసర్ మునీర్ లాంటి లిరిసిస్ట్‌లను ఒకసారి పరిచయం చేసుకుంటే కొత్తదారి కనిపించే స్ఫూర్తి కచ్చితంగా దొరుకుతుంది. ఇంగ్లీష్ సాహిత్యంలో పట్టా పుచ్చుకుంది కౌసర్ మునీర్. నానమ్మ సల్మా సిద్దికీ ఉర్దూ రచయిత్రి. భాషలోని సొగసు ఏమిటో ఆమె ద్వారా తెలుసుకుంది. నాన్న ఒక ఫిల్మ్స్టూడియోలో పాఠాలు చెప్పే ప్రొఫెసర్. ఆయన నుంచి మంచి మంచి సినిమాల గురించి తెలుసుకుంది. సినిమాలు చూడడం కంటే అందులో పాటలు వినడం ఆమెకు ఇష్టం. జావెద్సాబ్ పాటలు వినడం అంటే ఎంత ఇష్టమో! వినగా వినగా పదాల గురించి లోతైన పరిచయం ఏర్పడింది. ఇక అప్పటి నుంచి తాను కూడా పాట రాయాలనే తపన మొదలైంది. సినిమాలలో ఎన్నో సందర్భాలను ఊహించుకొని వాటికి తగ్గట్టు పాటలు రాసుకొని మురిసిపోయేది. కాని ఎన్నాళ్లు ఇలా తనకు తాను మురిసిపోవడం! ‘సినిమాలో ఫీల్డ్‌కు వెళ్లి పాటలు రాయాలని ఉంది’ అని తన మనసులో మాటను సన్నిహితుల దగ్గర చెప్పినప్పుడు నవ్వనివారు తక్కువ. ‘డైరెక్టర్ కావాలనుకుంటారు లేదా కొరియోగ్రాఫర్ కావాలనుకుంటారు. పాటలు రాయడం ఏమిటీ!’ అని ఆశ్చర్యపోయేవారు. ఒక టీవీ సీరియల్‌కు అసిస్టెంట్ రైటర్‌గా పనిచేసిన కౌసర్‌కు మంచి ప్రశంసలు లభించాయి. మరిన్ని సీరియల్స్‌కు అసిస్టెంట్‌గా అవకాశాలు వచ్చినా వాటిని నిరాకరించింది. దీనికి కారణం తన మనసులో కోరిక... పాటలు రాయాలని. డైరెక్టర్ విజయ్‌కృష్ణ ఆచార్యను కలిసి తన మనసులో మాట చెప్పింది. ఇంతకుముందే రచయిత్రిగా తనను తాను నిరూపించుకోవడం వల్ల ఆచార్యను నమ్మించడం పెద్ద కష్టం కాలేదు. అలా ‘తషాన్’ సినిమాలో పాట రాసే అవకాశం వచ్చింది. ‘ఫలక్తక్ ఛల్ సాత్ మేరే ఫలక్తక్ ఛల్ సాత్ ఛల్ యే బాదల్ కీ చాదర్ యే తారోం కీ ఆంచల్’... అనే ఆ పాట అందరినీ ఆకట్టుకుంది. అవార్డ్లు తెచ్చిపెట్టింది. ఇక వెనక్కి తిరిగిచూసుకోనక్కర్లేదు, అవకాశాలు వెదుక్కుంటూ వస్తాయి అనుకుంది. కానీ అదేమీ జరగలేదు. మళ్లీ సినిమా ఆఫీస్ మెట్లు ఎక్కడం మొదలుపెట్టింది. అలా యశ్‌రాజ్ ఫిల్మ్స్ ‘ఇష్క్‌జాదే’లో పాట రాసే అవకాశం వచ్చింది. ‘ఆడియో ఇండస్ట్రీలో స్త్రీలను చిన్నచూపు చూస్తారనేది అపోహ కాదు. వాస్తవం. అలా అని వెనక్కితగ్గితే వారికి బలాన్ని ఇచ్చినట్లవుతుంది’ అంటున్న కౌసర్ మునీర్ బజ్రంగీ భాయిజాన్, డియర్ జిందగీ, సీక్రెట్ సూపర్‌స్టార్, గుంజనా సక్సేనా: ది కార్గిల్ గర్ల్... మొదలైన సినిమాలలో పాటలు రాసి తన బలమేమిటో నిరూపించుకుంది. ఇండస్ట్రీకి వచ్చి పాటలు రాయాలనుకునే మహిళలకు ధైర్యాన్ని, స్ఫూర్తిని ఇస్తోంది. -
‘రూ. 50 లక్షలు ఇవ్వకుంటే నీ కొడుకును కిడ్నాప్ చేస్తాం’
బంజారాహిల్స్: కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్ చేసి బెదిరించారు. రూ.50 లక్షలు ఇవ్వకపోతే నీ కొడుకును కిడ్నాప్ చేస్తామంటూ చెప్పడంతో ఆందోళన చెందిన ఎమ్మెల్యే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యా దు చేశారు. టోలీచౌకీ సమీపంలోని హకీంపేట్‌లో నివసించే ఎమ్మెల్యే కౌసర్ గత నెల 28వ తేదీన హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వెళుతున్నాడు. అదే సమయంలో 9102563387 నెంబర్ నుంచి ఆయనకు ఫోన్‌కాల్ వచ్చింది. రూ.50 లక్షలు ఇవ్వాలని, లేకపోతే చిన్నకొడుకు జాఫర్‌ను కిడ్నాప్ చేస్తామంటూ హెచ్చరించి నిందితుడు ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. ఆందోళన చెందిన ఎమ్మెల్యే వెనక్కి తిరిగి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ప్రేమకు నో చెప్పిందని టెకీపై కత్తితో దాడి) -
జర్నలిస్టు తల్లిదండ్రుల దారుణ హత్య
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఓ జర్నలిస్టు తల్లిదండ్రుల హత్య కలకలం రేపింది. సీనియర్ జర్నలిస్టు హస్సన్ బెలాల్ తల్లిదండ్రులు లాహోర్‌లోని తమ ఇంట్లో బెడ్ రూంలో శవాలై పడి ఉండడానికి బుధవారం రాత్రి పోలీసులు గుర్తించారు. జావేద్ జైది(65) కౌసర్ (60) దంపతులను పదునైన ఆయుధంతో దాడిచేసి దారుణంగా హత్య చేశారని పోలీసులు తెలిపారు. మృతదేహాల తీరును పరిశీలిస్తే రెండు రోజుల క్రితమే చనిపోయి ఉంటారని వారు భావిస్తున్నారు. ఇంటికి బయటి నుంచి తాళం వేసి ఉండడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందన్నారు. మరోవైపు దంపతుల కారు కూడా కనిపించడంలేదని పోలీసులు తెలిపారు.