పాకిస్తాన్లో సీనియర్ జర్నలిస్టు హస్సన్ బెలాల్ తల్లిదండ్రులు జావేద్ జైది(65) కౌసర్ (60) దంపతులను పదునైన ఆయుధంతో దాడిచేసి దారుణంగా హత్యచేశారని పోలీసులు తెలిపారు
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఓ జర్నలిస్టు తల్లిదండ్రుల హత్య కలకలం రేపింది. సీనియర్ జర్నలిస్టు హస్సన్ బెలాల్ తల్లిదండ్రులు లాహోర్లోని తమ ఇంట్లో బెడ్ రూంలో శవాలై పడి ఉండడానికి బుధవారం రాత్రి పోలీసులు గుర్తించారు. జావేద్ జైది(65) కౌసర్ (60) దంపతులను పదునైన ఆయుధంతో దాడిచేసి దారుణంగా హత్య చేశారని పోలీసులు తెలిపారు. మృతదేహాల తీరును పరిశీలిస్తే రెండు రోజుల క్రితమే చనిపోయి ఉంటారని వారు భావిస్తున్నారు. ఇంటికి బయటి నుంచి తాళం వేసి ఉండడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందన్నారు. మరోవైపు దంపతుల కారు కూడా కనిపించడంలేదని పోలీసులు తెలిపారు.