
కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్
బంజారాహిల్స్: కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్ చేసి బెదిరించారు. రూ.50 లక్షలు ఇవ్వకపోతే నీ కొడుకును కిడ్నాప్ చేస్తామంటూ చెప్పడంతో ఆందోళన చెందిన ఎమ్మెల్యే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యా దు చేశారు. టోలీచౌకీ సమీపంలోని హకీంపేట్‌లో నివసించే ఎమ్మెల్యే కౌసర్ గత నెల 28వ తేదీన హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వెళుతున్నాడు.
అదే సమయంలో 9102563387 నెంబర్ నుంచి ఆయనకు ఫోన్‌కాల్ వచ్చింది. రూ.50 లక్షలు ఇవ్వాలని, లేకపోతే చిన్నకొడుకు జాఫర్‌ను కిడ్నాప్ చేస్తామంటూ హెచ్చరించి నిందితుడు ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. ఆందోళన చెందిన ఎమ్మెల్యే వెనక్కి తిరిగి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: ప్రేమకు నో చెప్పిందని టెకీపై కత్తితో దాడి)
Comments
Please login to add a commentAdd a comment