శత్రువు ఒక్కడైనా ఎక్కువే.. స్నేహితులు వందమంది అయినా తక్కువే అంటారు వివేకానందుడు. మనిíÙని అవసరంలో ఆదుకునే స్నేహ హస్తం కన్నా ప్రియమైనదేదీ లేదంటారు గురునానక్. నిజమైన మిత్రుడెవరో తెలిసేది కష్టకాలంలోనే అంటారు గాం«దీజీ.. ఎవరేమన్నప్పటికీ స్నేహాన్ని మించింది ఈ లోకాన లేదంటారు సినీ కవులు.. ఇంతటి విశిష్ట బంధాన్ని పటిష్టం చేయడానికి ఇప్పటి ఆధునిక కమ్యూనికేషన్ తోడ్పాటునందిస్తోంది.
చిన్నప్పుడెప్పుడో మరిచిపోయిన మిత్రుడ్ని గుర్తు చేస్తోంది. తనతో చదువుకున్న వారందరినీ ఏకం చేస్తోంది.. సోషల్ మీడియా వేదికగా చాలామంది స్నేహితులవుతున్నారు. పుట్టిన రోజు వస్తే ఒకప్పుడు ఇంట్లోవారికి తప్ప మరెవరికీ తెలిసేది కాదు. అలాంటిది ఇప్పుడు ఫేస్‌బుక్.. వాట్సప్‌లు వచ్చాక ఇలాంటి సందర్భాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ఎవరికైనా సహాయం అందించడంలోనూ ఈ మిత్ర సమూహాలు ముందుంటున్నాయి. కొన్నాళ్లుగా టెన్తులోనో.. లేదా మరే సందర్భంలోనో కలిసి చదువుకున్న వారంతా ఏటా ఒకసారైనా కలిసి ఆనందం కలబోసుకుంటున్నారు. వీరి స్నేహ కలయికకు ఆధునిక సమాచారమే వారధిగా నిలుస్తోంది.
ప్రత్తిపాడు: వారు చిన్ననాటి స్నేహితులు. వారు వృత్తి రీత్యా వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. 35 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. వారిలో ఒకరు తెలంగాణ గవర్నర్ తమిళసై కాగా మరొకరు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయిని దేవన్ రేమల. వారిద్దరూ తమిళనాడు రాష్ట్రం చైన్నెలోని ఒకే ప్రాంతంలో ఉండేవారు. తమ స్నేహం గురించి రేమల ఏమంటారంటే... ప్రస్తుతం గవర్నర్ తమిళసై తండ్రి కుమారి అనంతన్, మా నాన్న దేవరాజ్ రాజకీయంగా సన్నిహితులు.
తమిళసైతో కలిసి రాయపురంలో ఒకటో తరగతి నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకూ చదువుకున్నాను. తమిళసై మెడిసిన్ చదివారు. నేను ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డాను. ఆమె గవర్నరుగా బాధ్యతలు చేపట్టారని తెలిసి చాలా సంతోషించాను. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ గవర్నర్‌కు మెయిల్ పంపాను. దీంతో ఆమె స్పందించారు. ఫలితంగా తమిళ సైను కలిసే అవకాశం ఇటీవల వచ్చింది. చూడగానే గవర్నర్ ఆప్యాయంగా పలుకరించారు. ఆనాటి ముచ్చట్లను జ్ఞప్తికి తెచ్చుకున్నామని రేమల అన్నారు. అంతస్తులు, హోదాలు తమ స్నేహానికి అడ్డు కాలేదన్నారు.
ఔదార్యం... అ‘పూర్వ’ం
మండపేట: ఆపన్నులకు ఆసరాగా నిలుస్తున్నారు మండపేట ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులు. ఏటా రూ. 7.5 లక్షల నుంచి రూ. 8 లక్షల విలువైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1983–84 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు 75 మంది 2008లో ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ పేరిట సంస్థగా ఏర్పడ్డారు. కొంత స్థిర నిధిని ఏర్పాటు చేసుకున్నారు. కోవిడ్ ముందు వరకు 13 ఏళ్ల పాటు ఏటా ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు రూ. 2.5 లక్షల విలువైన పుస్తకాలు, స్టేషనరీని అందించేవారు.
సీఎంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చాక ప్రభుత్వమే విద్యార్థులకు పుస్తకాలను అందిస్తుండటంతో మూడేళ్లుగా ప్రభుత్వ, మున్సిపల్ హైస్కూళ్లలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. కలువపువ్వు సెంటర్‌లో ఏటా శ్రీరామ నవమి నుంచి జూన్ మొదటి వారం వరకు చల్లటి మజ్జిగను సరఫరా చేస్తున్నారు.
ఇందుకు ఏటా రూ.4 లక్షలు వెచ్చిస్తున్నారు. సంస్థ కార్యదర్శి సంకా శ్రీనివాసరంగా ఏటా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి రూ. 1.5 లక్షల విలువైన బహుమతులు అందజేస్తున్నారు. ప్రస్తుతం బిక్కిన చక్రవర్తి అధ్యక్షునిగా ఉండగా కోశాధికారిగా పోతంశెట్టి సత్తిబాబు సేవలు అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment