సాక్షి, మచిలీపట్నం: స్నేహ బంధం మధురమైంది.. తియ్యనైంది. దీనికి కుల, మత, వర్గ, లింగ భేదాలు ఉండవు. తరాలు గడిచినా.. యుగాలు అంతరించినా తరగని పెన్నిధి స్నేహం. స్పందించే గుండె ఉండాలే కాని స్నేహం అనే పదం అనిర్వచనీయమైంది. బంధుత్వం కన్నా ఒక్కొక్కసారి రక్త సంబంధం కన్నా స్నేహ బంధమే విడదీయలేని అనుబంధంలా నిలిచిపోతుంది. నిజమైన స్నేహం త్యాగాన్నే కోరు కుంటుంది. మన పురాణాల్లో శ్రీకృష్ణ కుచేలుని స్నేహ బంధం ఇందుకు ప్రత్యక్ష సాక్షం. స్నేహం గొప్పతనం గురించి డాక్టర్ సి.నారాయణ రెడ్డి ఓ పాటలో భార్యాభర్తల మధ్య స్నేహం విరబూస్తే ప్రేమ పరిమళిస్తుంది. దాంపత్య జీవితం మధురంగా ఉంటుంది. తల్లి తండ్రీ.. బిడ్డల మధ్య స్నేహం నింగికి ఎగబాకితే వెన్నెల సౌధమై వికసిస్తుంది. అక్కా తమ్ముడు, అన్న చెల్లెళ్లు, కుటుంబ సభ్యులు.. ఆ మాటకు వస్తే ప్రజలందరూ స్నేహ భావంతో మెలిగితే సమాజంలో విద్వేషాలు, శతృత్వాలు తగ్గి కలిసి మెలిసి ఉండే తత్వం ఏర్పడుతుంది. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈ కథనం..
నా సతీమణే నా బెస్ట్ ఫ్రెండ్
పాఠశాల దశ నుంచే నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. కర్ణాటకలోని తుముకూరు జిల్లా కొరటగెరె గ్రామంలోని స్కూల్‌లో, ఇంటర్ తుముకూరులోని కాలేజీలో, బెంగళూరులో డిగ్రీ (బీబీఎం), ఎంబీఏ చదివేటప్పుడు, ఐఏఎస్ శిక్షణలో మంచి స్నేహితులు కలిశారు. నేను అందరితో స్నేహంగా, సరదాగా ఉంటాను. అయితే చిన్నప్పటి నుంచి మా నాన్న కృష్ణయ్య శెట్టి, అమ్మ మంజులాదేవి నాతో తల్లిదండ్రుల్లా కాకుండా స్నేహితుల్లా ఉండేవారు. సివిల్స్ శిక్షణ పూర్తి చేసుకున్న నాకు ఏపీ కేడర్ దక్కింది. దీంతో 2016 జూన్‌లో కృష్ణాజిల్లా ట్రైనీ కలెక్టర్‌గా నియమితులయ్యాను. 2017 ఏప్రిల్ 23న బెంగళూరుకు చెందిన వి.ఎన్. పృ«థ్వీ కల్యాణితో వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన పెళ్లే అయినా తరువాత ఆమే నాకు బెస్ట్ ఫ్రెండ్. విధి నిర్వహణలో, ప్రభుత్వ కార్యక్రమాల్లో, ఇతర సందర్భాల్లోనూ అన్ని విధాలా అర్థం చేసుకుని సహకరిస్తుంది. పైగా ఏదైనా పనిభారం, ఒత్తిడి ఉన్నప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఆమె నాకు అండగా నిలిచి, ధైర్యం చెబుతుంది. ఆమె ప్రైవేటు సెక్టార్‌లో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నా.. అవసరమైన సమయాల్లో సలహా ఇచ్చి, కష్టాల్లోనూ షేర్ చేసుకొని బెస్ట్ ఫ్రెండ్‌లా నిలుస్తుంది.
అపురూపం వారి స్నేహం
కంచికచర్ల: స్నేహానికి మించిన బంధం ఏదీ లేదని వారు నిరూపించారు. మండలంలోని గండేపల్లిలో 10 మంది విద్యార్థులు పదవ తరగతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివి అనంతరం నందిగామ కేవీఆర్ కళాశాలలో 2012లో ఇంట రీ్మడియెట్ చదివారు. కొంతమంది విద్యార్థులు డిగ్రీ, పీజీలు చదివారు. మరికొంతమంది పాలి టెక్నిక్, ఐటీఐ చదివారు. వీరంతా వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు. అయితే నేటికీ వీరంతా ఒకే కుటుంబంలాగా కలసి మెలసి ఉంటారు. వాళ్లల్లో ఎవరి కుటుంబంలో శుభకార్యాలు జరిగినా అందరూ తమతమ కుటుంబసభ్యులతో హాజరవుతారు. వీరి స్నేహానికి ఆర్థిక అసమానతలు, హెచ్చుతగ్గులు లేవు. వీరిలో బొక్కా శ్రీకాంత్ (ప్రయివేటు ఎల్రక్టీíÙయన్), బొక్కా మార్క్ (ఆక్వా సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మచిలీపట్నం), సంగం దిలీప్(సాంసంగ్ యాడ్ ఏజన్సీ), మీసాల జయప్రకా‹Ù(డ్రైవింగ్ ఫీల్డ్), బొక్కా రాంబాబు (హయ్యర్ కంపెనీ సేల్స్ మేనేజర్, విశాఖపట్నం), మందా నాని( ప్రయివేటు ఎలక్ట్రికల్స్) బి.నరేంద్ర (రైల్వే ఎంప్లాయి), మార్కపూడి మాణిక్యరావు (ప్రయివేటు ఎంప్లాయి), ఐలపోగు గోపీ(ప్రయివేటు ఎంప్లాయి) వీరంతా వివిధ వృత్తులలో కొనసాగుతున్నారు. వీరి స్నేహబంధాన్ని గురించి గండేపల్లిలో అందరూ గొప్పగా చెప్పుకుంటారు.
ఏడు లోకాల్లో ఎక్కడున్నా...ఈ ఏడుగురూ కలవాల్సిందే
వారంతా చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. పెద్దయ్యాక అందరూ తలో రకంగా వారి వారి ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర వృత్తుల్లో వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నా...ఇప్పటికీ వారి స్నేహానికి విలువనిస్తూ ముఖ్యమైన శుభకార్యాల్లో కుటుంబసభ్యులతో కలసి అందరూ పాల్గొంటారు. ఏడు లోకాల్లో ఎక్కడున్నా ఈ ఏడుగురు కలవాల్సిందే...వారిలో ఒకరు కంచికచర్ల మండలంలో పంచాయతీ విస్తరణాధికారి(ఈఓపీఆర్డీ) బొజ్జగాని శ్రీనివాసరావు. తను చదువుకున్న రోజుల నుంచి ఉద్యోగం చేస్తున్నా కాని తన ఏడుగురు బాల్య స్నేహితులతో కలసి అంతే స్నేహంగా ఉంటారు. వీరి స్నేహ బృందం సభ్యులు రేగళ్ల శ్రీనివాసరావు(ఏఎస్‌ఐ గన్నవరం), శ్రీనివాసరావు( రైల్యే ఉద్యోగి,), ఆర్.శ్రీనివాస రావు(పొగాకు వ్యాపారి, విజయవాడ),జి.దాసు,(టైర్ల వ్యాపారం, వెంకటాపురం), పవన్‌కుమార్(అడ్వకేట్, హైకోర్టు). వీరంతా విజయవాడ కొత్తపేటలోని కేబీఎన్ డిగ్రీ కళాశాలలో ఇంటర్‌మీడియెట్, డిగ్రీ పూర్తిచేశారు. చదువులో ఒకరితో ఒకరు పోటీ పడేవారు. వీరంతా నేడు ఉద్యోగాలు, వ్యాపారాలు, వివిధ వృత్తులతో కొనసాగుతున్నారు. అయితే నేటికి కుటుంబాలలో జరిగే శుభకార్యాలకు హాజరై సంతోషాల్లో పాలుపంచుకుంటున్నారు. వారిలో ఏ ఒక్కరికి ఆర్థికంగా సమస్య వచ్చినా మిగతా వారంతా సహాయ సహకారాలందిస్తారు.
స్నేహం ఒకటే.. నిర్వచనాలు అనేకం
స్నేహం పదం ఒకటే అయినా అనేక నిర్వచనా లు ఇస్తుంది. ఎలాంటి రక్త సంబంధం లేకుండా ఏర్పడే దృఢమైన బంధం స్నేహం. ఇందులో త్యాగం, నమ్మకం, ధైర్యం, ప్రేమ, భరోసా, నిజాయితీ ఇలా అనేక అంశాలు కలిసి ఉంటా యి. స్వార్థానికి, మోసానికి చోటు లేదు. ఆర్థికంగానో మరో విధంగానే సహాయం చేస్తేనే స్నేహం కాదు. కష్టసుఖాల్లో పాలు పంచుకుని, ధైర్యం చెప్పినా అది ఎంతో ఊరటనిస్తుంది. నా చిన్నప్పుటి మిత్రడు అబ్దుల్ సుభాన్. అతను స్కూల్ దశ నుంచే మంచి స్నేహితుడు. ఇప్పు డు నేను ఏఎస్పీగా పనిచేస్తున్న మచిలీపట్నంలో నే అతను డీఎస్పీగా పనిచేస్తున్నాడు. ఏ సమస్య వచ్చినా ఒకరికొకరు కలిసినప్పుడు చెప్పుకుంటాం. అది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది.
– ఎస్‌వీడీ. ప్రసాద్, అడిషనల్ ఎస్పీ, కృష్ణా జిల్లా
Comments
Please login to add a commentAdd a comment