
నా ప్రియనేస్తం వాడే!
‘‘ఏం ఫర్వాలేదు... నీకు నేనున్నాను’’ అని భరోసా ఇచ్చేవాడే నిజమైన స్నేహితుడు. అలాంటి ఓ స్నేహితుడు లభించడం నా అదృష్టం. తన పేరు రాజా. మేమిద్దరం కలిసి చదువుకోలేదు కానీ, కలిసి ఆడిన ఆటలు బోల్డన్ని. మా ఇంటి పక్కనే రాజా ఇల్లు. తనలో నాకు నచ్చే లక్షణం ఏంటంటే.. ఎప్పుడూ హాయిగా నవ్వుతూ ఉంటాడు.
పెద్దయిన తర్వాత ఎవరి కెరీర్‌లో వాళ్లు స్థిరపడినా... వీలు దొరికినప్పుడల్లా కలుసుకుంటాం. షూటింగ్స్ కోసం నేనెక్కడికెళ్లినా.. తను ఖాళీగా ఉంటే నాతో పాటు వస్తాడు. ఎంత స్నేహితుల మధ్య అయినా అప్పుడప్పుడూ గొడవలు వస్తాయంటారు. కానీ, మా మధ్య ఎప్పుడూ గొడవలు రాలేదు. భవిష్యత్తులో కూడా రాకూడదని కోరుకుంటున్నాను. నా జీవితంలో జరిగే మంచీ, చెడూ రెంటినీ పంచుకునే నా ప్రియ నేస్తం రాజా. మా స్నేహం ఎప్పటికీ ఇలానే సాగాలని కోరుకుంటున్నాను.