ఛత్తీస్‌గఢ్–ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 14 మంది నక్సలైట్లు మృతిచెందడం మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘నక్సలిజానికి మరో పెద్ద ఎదురుదెబ్బ. దేశాన్ని నక్సల్ రహితం చేయాలన్న లక్ష్యం దిశగా భద్రతాబలగాలు పెద్ద విజయం సాధించాయి. సీఆర్పీఎఫ్, ఒడిశా స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, ఛత్తీస్‌గఢ్ పోలీసు బలగాలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో 14 మంది నక్సలైట్లు మృతి చెందారు. నక్సల్స్ లేని భారత్ దిశగా ఇదొక ముందడుగు. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉంది..’ అని అమిత్ షా పేర్కొన్నారు.
2026 నాటికి అంతం చేస్తాం: ఛత్తీస్‌గఢ్ సీఎం
కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్న డబుల్ ఇంజన్ సర్కారు నక్సలిజం అణచివేతను విజయవంతంగా కొనసాగిస్తోందని ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ పేర్కొన్నారు. ‘2026 మార్చి నాటికి నక్సలిజం అంతం చేస్తాం. ఆ దిశగా భద్రతా దళాలు ముందుకెళుతున్నాయి’ అని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment