తిరువనంతపురం: ఆల్ ఇండియా రేడియో (ఏఐఆర్)లో ప్రసారమైన ‘సుభాషితం’ అనే కార్యక్రమం కేరళలో దుమారం రేపుతోంది. ఏఐఆర్ త్రిస్సూర్ ప్రాంతీయ కేంద్రంలో సుభాషితం అనే కార్యక్రమాన్ని డాక్టర్ సీఎన్ పరమేశ్వరన్ అనే స్కాలర్ గతవారం ప్రెజెంట్ చేశారు. అయితే అందులో మన పురాణాల్లోని దేవతలు, రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధాలు.. అగ్రవర్ణాలకు చెందిన పరదేశీయులకు, స్థానికులకు మధ్య జరిగినవని వ్యాఖ్యానించారు.
దీనిపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. హిందువుల ఆరాధ్య దైవాలు రాముడు, కృష్ణుడు విదేశీయులని వ్యాఖ్యానించడం తమ మనోభావాలను దెబ్బతీయడమేనని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బీ గోపాలకృష్ణన్ ఆరోపించారు.