రణబీర్ కాదు... రచ్చబండ!
‘బ్రదరూ! రణబీర్ కపూర్‌తో జర జాగ్రత్త’. బాలీవుడ్ పార్టీల్లో ఇప్పుడిదే కొత్త స్లోగన్ అట. రణబీర్‌కి ఏదైనా సీక్రెట్ చెప్పాలంటే హిందీ సినిమా జనాలు భయపడుతున్నారు. అంతే కాదండోయ్... అతడికి ‘ఆలిండియా రేడియో’ అని ఓ ముద్దు పేరు కూడా పెట్టారు. రణబీర్‌కి ఏదైనా సీక్రెట్ చెబితే రేడియోలో చెప్పినట్టేనట. దాంతో మేటర్ రచ్చబండకు ఎక్కినట్టే అంటున్నారు. బాలీవుడ్‌లో కొందరు రణబీర్‌కి సీక్రెట్ చెప్పడం.. చివరకు, అది అందరికీ తెలియడంతో చిరాకు పడ్డారట. రణబీర్ మాత్రం ఈ ప్రపంచంలో సీక్రెట్ అనేది లేదంటున్నారు.
ఈ రొమాంటిక్ హీరో చెప్పిన వివరణ ఏంటో తెలుసా? ‘‘ఈ ప్రపంచంలో సీక్రెట్ అనేది ఏదీ లేదు. ప్రతి ఒక్కరికీ ఓ స్నేహితుడు ఉంటాడు. వాళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణలను ఆ స్నేహితుడు ఎవరికీ చెప్పడనే నమ్మకం ఉంటుంది. ఆ స్నేహితుడికీ ఓ స్నేహితుడు ఉంటాడు.. అతను కూడా అంతే. ఆ విధంగా సీక్రెట్ అనేది ప్రపంచం మొత్తం చక్కర్లు కొడుతుంది. ఇక, సీక్రెట్ అనేదానికి అర్థం ఎక్కడుంది? నాతో ఎవరైనా సీక్రెట్ చెబితే... నా ఆరోగ్యం పాడవుతుంది. వెంటనే ఎవరో ఒకరితో ఆ సీక్రెట్ చెప్పేసి, నా ఆరోగ్యాన్ని కాపాడేసుకుంటా’’ అన్నారు రణబీర్. భలే వింతగా, నిజమే అనేంతలా ఉంది కదూ!!