న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ దసరా రోజు (ఈ నెల 3)న ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో) ద్వారా చేసిన ప్రసంగం ‘మన్‌కీ బాత్’పై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాని(ఈసీ)కి ఫిర్యాదు చేసింది. మహారాష్ట్ర, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఆకాశవాణిలో ప్రసారం చేయించడం ద్వారా ప్రధాని ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించింది. ఈ మేరకు ఏఐసీసీ న్యాయ విభాగం కార్యదర్శి కేసీ మిట్టల్ ప్రధాన ఎన్నికల అధికారి వీఎస్ సంపత్‌కు లేఖ రాశారు.
మోదీ రేడియో ప్రసంగంపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
Published Tue, Oct 7 2014 12:22 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement