ఉగ్రదాడి అనుకొని పోలీసుపై కాల్పులు | Delhi constable crashes into AIR office, shot | Sakshi
Sakshi News home page

ఉగ్రదాడి అనుకొని పోలీసుపై కాల్పులు

Published Mon, Jul 6 2015 3:10 PM | Last Updated on Sun, Sep 3 2017 5:01 AM

Delhi constable crashes into AIR office, shot

న్యూఢిల్లీ: అదుపుతప్పి ఆఫీసులోకి వేగంగా దూసుకొచ్చిన కారును చూసి ఉగ్రదాడి అనుకొని ఓ ఢిల్లీ పోలీసుపై నాగాలాండ్ పోలీసు గార్డు కాల్పులు జరిపాడు. పోలీసుల వివరాల ప్రకారం ఢిల్లీ పోలీసు బెటాలియన్లో పనిచేస్తున్న అంకిత్ కుమార్ (30) అనే కానిస్టేబుల్ అలా సరదాగా ఢిల్లీ వీధిలో కారు నడుపుకుంటూ జోరుగా వెళుతున్నాడు. సడెన్గా కారుపై అతడు నియంత్రణ కోల్పోడంతో అది ఎదురుగా ఉన్న ఆల్ ఇండియా రేడియో కార్యాలయంలోకి దూసుకెళ్లింది.

తాళం వేసి ఉన్న గేటు కాస్త కారు వేగానికి ధ్వంసమైంది. ఇంతలో తేరుకుని అంకిత్ కుమార్ కారు వెనక్కి తీసే ప్రయత్నం చేస్తుండగా అదే కార్యాలయంలో గార్డుగా విధులు నిర్వహిస్తున్న నాగాలాండ్ కు చెందిన ఓ పోలీసు గార్డు.. ఆ కారు ఉగ్రవాదులది అనుకొని, అది ఉగ్రదాడి అనుకొని వెంటనే కాల్పులు జరిపాడు. దీంతో అందులోని ఒక బుల్లెట్ అంకిత్ ఎడమవైపు ఛాతీలోకి దూసుకెళ్లింది. దీంతో అతడిని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ ఆస్పత్రికి తరలించారు. దీంతో అతడు ప్రాణగండం నుంచి బయటపడ్డాడు. అంకిత్ కుమార్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement