Delhi constable
-
ముఖ్యమంత్రిపై కానిస్టేబుల్ పరువునష్టం దావా
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పోలీసులను పరుష పదజాలంతో దూషించారంటూ ఓ కానిస్టేబుల్ దాఖలుచేసిన పరువునష్టం దావాను విచారిచేందుకు కోర్టు అంగీకరించింది. దక్షిణ ఢిల్లీలోని గోవింద్‌పురి పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేసే హర్వీందర్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలుచేశారు. ఈ కేసు విచారణను కోర్టు సెప్టెంబర్ 10వ తేదీకి పోస్ట్ చేసింది. ఆరోజు ఫిర్యాది తరఫు సాక్షులను విచారిస్తారు. గోవింద్‌పురి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌తో పాటు ఓ హెడ్ కానిస్టేబుల్ కూడా ఈ కేసులో సాక్షులుగా ఉన్నారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పోలీసులను 'తుల్లా' అనే పదం వాడటం వల్ల తాము ప్రజలతో పాటు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల దృష్టిలో బాగా చులకన అయిపోయామని హర్వీందర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎల్.ఎన్. రావు అనే న్యాయవాది ద్వారా కోర్టులో ఫిర్యాదు చేశారు. కేజ్రీవాల్ చేసిన నేరాలు ఐపీసీ సెక్షన్లు 500, 504 కిందకు వస్తాయన్నారు. -
ఉగ్రదాడి అనుకొని పోలీసుపై కాల్పులు
న్యూఢిల్లీ: అదుపుతప్పి ఆఫీసులోకి వేగంగా దూసుకొచ్చిన కారును చూసి ఉగ్రదాడి అనుకొని ఓ ఢిల్లీ పోలీసుపై నాగాలాండ్ పోలీసు గార్డు కాల్పులు జరిపాడు. పోలీసుల వివరాల ప్రకారం ఢిల్లీ పోలీసు బెటాలియన్‌లో పనిచేస్తున్న అంకిత్ కుమార్ (30) అనే కానిస్టేబుల్ అలా సరదాగా ఢిల్లీ వీధిలో కారు నడుపుకుంటూ జోరుగా వెళుతున్నాడు. సడెన్‌గా కారుపై అతడు నియంత్రణ కోల్పోడంతో అది ఎదురుగా ఉన్న ఆల్ ఇండియా రేడియో కార్యాలయంలోకి దూసుకెళ్లింది. తాళం వేసి ఉన్న గేటు కాస్త కారు వేగానికి ధ్వంసమైంది. ఇంతలో తేరుకుని అంకిత్ కుమార్ కారు వెనక్కి తీసే ప్రయత్నం చేస్తుండగా అదే కార్యాలయంలో గార్డుగా విధులు నిర్వహిస్తున్న నాగాలాండ్ కు చెందిన ఓ పోలీసు గార్డు.. ఆ కారు ఉగ్రవాదులది అనుకొని, అది ఉగ్రదాడి అనుకొని వెంటనే కాల్పులు జరిపాడు. దీంతో అందులోని ఒక బుల్లెట్ అంకిత్ ఎడమవైపు ఛాతీలోకి దూసుకెళ్లింది. దీంతో అతడిని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ ఆస్పత్రికి తరలించారు. దీంతో అతడు ప్రాణగండం నుంచి బయటపడ్డాడు. అంకిత్ కుమార్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.