అదొక్కటే దారి..: రేణు దేశాయ్
అసలే ట్రాఫిక్.. ఆపైన హారన్.. ఎంత చిరాకుగా ఉంటుందో కదా. ట్రాఫిక్ జామ్ అయిందని చూస్తూ కూడా కొంతమంది అదే పనిగా హారన్ మోగిస్తుంటారు. అప్పుడు కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. బహుశా రేణు దేశాయ్కి కూడా అలాంటి అనుభవమే ఎదురైనట్టుంది. తన అనుభవాన్ని కాదుగానీ.. ఇదొక్కటే దారి అంటూ ట్విట్టర్లో తనకు తోచిన పరిష్కారాన్ని సూచించారు రేణు. హారన్ బటన్ను పెట్రోల్ ట్యాంకుకు అటాచ్ చేసి.. హారన్ మోగించినప్పుడల్లా ట్యాంకులో ఉన్న ఇంధనం త్వరగా అయిపోయేలా చేయడమే.. ఇండియాలో అనవసరంగా హారన్ మోగించేవారిని ఆపగలిగే ఏకైక పరిష్కారం అంటూ ట్వీట్ చేశారు.
అలాగే.. ఎప్పుడైనా మీకు వృద్ధులుగానీ, పిల్లలు గానీ రోడ్డు దాడుతూ కనిపిస్తే.. జస్ట్ ఒక్కసారి వారిని మీ తల్లిదండ్రులుగా, పిల్లలుగా ఊహించుకుని దయచేసి మీ వాహనాన్ని ఆపి వారిని రోడ్డు దాటనివ్వండి అంటూ ట్వీట్ చేశారు రేణు దేశాయ్.
When you see old ppl or kids trying to cross the road, just imagine them to be ur parents or kids& stop ur bike/car&let them cross...please
— renu (@renuudesai) September 22, 2015
The only way ppl will stop honking unnecessarily in India is, if the horn button is attached to petrol tank & the fuel gets used up faster
— renu (@renuudesai) September 22, 2015