లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం లో ఓ మహిళ అక్రమంగా తరలిస్తున్న 30 కిలోల కొకైన్ ను పట్టుకున్నారు. తనిఖీల్లో భాగంగా మహిళ తీసుకు వెడుతున్న క్యారీ బ్యాగ్ లో కొకైన్ ఉన్నట్లు గుర్తించామని డ్రగ్ ఎన్ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి వెల్లడించారు. విమాన సిబ్బందిగా భావిస్తున్న ఆమె... శుక్రవారం టర్మినల్ కు వచ్చి... అక్కడ తనిఖీలు నిర్వహిస్తుండటాన్ని చూసి, తనతో తెచ్చిన బ్యాగ్ లు వదిలి తప్పించుకొని పారిపోయిందని స్పెషల్ ఏజెంట్ తిమోతి మాసినో తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు డీఈఏ తెలిపింది.
అయితే నిందితురాలి ఆచూకీకోసం దర్యాప్తు ప్రారంభించిన అధికారులు సోమవారం సాయంత్రానికి ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఆమె ఏ ఎయిర్ లైన్స్ లో పనిచేస్తోంది అన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఖంగారుగా ఓ ఫోన్ కాల్ చేసిన తర్వాత అక్కడినుంచీ పారిపోయిన ఆమె ఏ భాషలో మాట్లాడిందన్నది సరిగా గుర్తించలేకపోయామని, అయితే ఆమె ఎస్కలేటర్ నుంచి పారిపోయేప్పుడు ఓ జత డిజైనర్ షూ వదిలి వెళ్ళిపోయిందని ఓ వార్తా సంస్థ తమ వెబ్ సైట్ లో వెల్లడించినట్లు లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్టు పోలీసులు, ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ అధికారులు తెలిపారు.
ఎయిర్ లైన్స్ స్టీవార్డెస్ బ్యాగ్ లో 30 కిలోల కొకైన్
Published Tue, Mar 22 2016 1:18 PM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM
Advertisement