గుంటూరు జిల్లా నగరం మండలం దూలిపుడి గ్రామ సమీపంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం...
నగరం(గుంటూరు): గుంటూరు జిల్లా నగరం మండలం దూలిపుడి గ్రామ సమీపంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కనిపంచడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దూలిపుడి పడమట పాలెం మధ్యలో గుర్తుతెలియని మహిళను దుండగులు సజీవ దహనం చేసిన ఆనవాళ్లు ఉండటంతో.. పోలీసులు మహిళల మిస్సింగ్ కేసులపై దృష్టి సారించారు. ఎక్కడైనా హత్య చేసి తీసుకొచ్చి ఇక్కడ కాల్చారా లేక ఇక్కడే హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.