అయోధ్యలో రామాలయ నిర్మాణపనులు 2025 డిసెంబర్ నాటికి పూర్తికానున్నాయి. ఇప్పటి వరకూ ఆలయ నిర్మాణ పనుల్లో మొదటిదశ పూర్తయ్యింది. 2024 జనవరి 22న బాల రాముడు ఆలయంలో ప్రతిష్ఠితుడయ్యాడు. రామాలయ నిర్మాణం ప్రారంభమైనది మొదలు భక్తులు ప్రతిరోజూ విరాళాలు అందజేస్తున్నారు.
రామ్‌లల్లా ఆలయానికి భూమి పూజ 2020, ఆగస్టు 5న జరిగింది. అప్పటి నుండి రామభక్తులు ఆలయ నిర్మాణానికి రూ. 55 వేలకోట్లకు పైగా నిధులను విరాళాల రూపంలో అందజేశారు. 2021లో నిర్వహించిన ఫండ్ డెడికేషన్ క్యాంపెయిన్‌లో రామమందిర్ ట్రస్ట్ దాదాపు రూ. 3500 కోట్ల విరాళాలను అందుకుంది. గడచిన 10 నెలల్లో రామాలయ నిర్మాణానికి విదేశాల్లో ఉంటున్న రామ భక్తులు సుమారు 11 కోట్ల రూపాయల మేరకు విరాళాలు అందించారు.
రామమందిర్ ట్రస్ట్ 2021లో 42 రోజుల పాటు ఆలయ నిర్మాణం కోసం నిధుల సేకరణ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందుకోసం ట్రస్టు 10 వేల రసీదులను ముద్రించింది. ఈ సందర్భంగా దేశంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి 3,500 కోట్ల రూపాయలు విరాళాల రూపంలో అందాయి. 2024 జనవరి 22న రామాలయంతో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగింది అప్పటి నుంచి రామ భక్తులు ప్రతిరోజూ భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటి వరకూ మూడు కోట్ల మందికి పైగా రామ భక్తులు ఆలయాన్ని సందర్శించారు. వీరు విరాళాలతో పాటు బంగారు, వెండి కానుకలను కూడా అందజేస్తున్నారు.
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి ప్రకాష్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం రామభక్తులు ఇప్పటి వరకు ఐదువేల కోట్ల రూపాయల మేరకు విరాళాలు అందించారు. విదేశాలలో ఉంటున్న రామభక్తులు కూడా ఉత్సాహంగా విరాళాలు అందజేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో రామమందిర్ ట్రస్ట్ విదేశాల నుంచి వచ్చిన విరాళాల మొత్తాన్ని లెక్కించింది. ఇప్పటి వరకు విదేశాల నుంచి దాదాపు 11 కోట్ల రూపాయలు విరాళాలుగా అందాయి.
Comments
Please login to add a commentAdd a comment