సాక్షి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడశిశువును గుర్తు తెలియని వ్యక్తులు గోనె సంచిలో కట్టేసి వదిలివెళ్లారు. స్థానిక పచ్చిపులుసు కళ్యాణ మండపం వద్ద ఈ ఘటన జరిగింది. గోనె సంచిలో నుంచి ఏడుపు విని అటుగా వెళ్తున్నవారు పాపను అక్కున చేర్చుకున్నారు. అనంతరం పసికందును చికిత్స కోసం నిడదవోలు ఆస్పత్రికి తరిలించారు. కాగా, ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. పాపను ఎవరు వదిలి వెళ్లారనే దానిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment