రైలు టాయిలెట్‌లో ఐదు నెలల చిన్నారి.. తరువాత? | Child Found in Train Toilet | Sakshi
Sakshi News home page

రైలు టాయిలెట్‌లో ఐదు నెలల చిన్నారి.. తరువాత?

Published Tue, Dec 5 2023 9:11 AM | Last Updated on Tue, Dec 5 2023 9:35 AM

Child Found in Train Toilet - Sakshi

దిక్కులేనివారికి దేవుడే దిక్కు అంటారు. ఐదు నెలల బాలుని విషయంలో ఈ మాట నూటికి నూరుపాళ్లు నిజమైంది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన ఒక ముస్లిం కుటుంబానికి రైలులోని టాయిలెట్‌లో ఒక పసిబాలుడు కనిపించాడు. వారు ఆ చిన్నారిని తమ ఇంటికి తీసుకువెళ్లారు. వారి ఫిర్యాదు మేరకు ఆ చిన్నారి సంబంధీకుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

డెహ్రాడూన్‌లోని జీఎంఎస్‌ రోడ్డులో నివాసం ఉంటున్న ఫర్నిచర్‌ వ్యాపారి ఫయాజ్‌ అహ్మద్‌ కుటుంబం ఆదివారం జ్వాలాపూర్‌ నుంచి డెహ్రాడూన్‌కు రైలులో తిరిగి వస్తోంది. ఈ నేపధ్యంలో ఆ కుటుంబానికి చెందిన ఒక మహిళకు టాయిలెట్‌లో ఐదు నెలల బాలుడు కనిపించాడు. దీంతో ఆ మహిళ కోచ్‌లోని వారందరికీ ఈ విషయాన్ని తెలిపింది. వారెవరూ ఆ బాలుడు తమకు చెందినవాడు కాదని స్పష్టం చేశారు.

ఇంతలో డెహ్రాడూన్ స్టేషన్ వచ్చింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు బాలుడిని తమ ఇంటికి తీసుకువచ్చారు. ముందుగా ఆ బాలునికి వైద్య చికిత్స అందించారు. తరువాత ఇందిరానగర్ పోలీస్ పోస్ట్‌లో ఈ విషయమై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ చిన్నారి సంబంధీకుల కోసం దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ చిన్నారిని పెంచే బాధ్యతను అధికారులు తమకు అప్పగిస్తే అందుకు తాను సిద్ధమేనని ఫయాజ్ తెలిపారు. కాగా ఆ చిన్నారికి ఇంకా పేరు పెట్టలేదు. 
ఇది కూడా చదవండి: ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యే.. ఇప్పుడు ఊహించని ఫలితం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement