
సాక్షి, నంద్యాల: శ్రీశైలం దేవస్థానం యాంఫి థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. సీసీ రోడ్డు సపోర్ట్ వాల్ నిర్మాణానికి జేసీబీతో చదును చేస్తుండగా శివలింగంతో పాటు అదే రాయిపై నంది విగ్రహం బయటపడింది.
శివలింగం పక్కనే రాయిపై తెలియని లిపితో గుర్తులు రాసి ఉన్నాయి. బయటపడిన శివలింగాన్ని దేవస్థానం అధికారులు పరిశీలించారు. శివలింగం దగ్గర ఉన్న లిపిని ఆర్కియాలజీకి పంపించారు. బయట పడిన పురాతన శివలింగం వద్ద ఉన్న శాసన లిపి 14,15 వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనంగా గుర్తించారు.
గతంలో ఇదే ప్రాంతంలో చతుర్ముఖ లింగం బయటపడింది. గతంలో పంచమఠాల పునర్నిర్మాణ సమయంలో పలు తామ్ర శాసనాలు బయటపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment