Shiva Lingam
-
శివుని సేవలో నాగుపాము.. వీడియో వైరల్
విశాఖపట్నం: నగరంలోని ఎగువ రెల్లివీధిలో వెలసిన శివాలయంలో అద్భుతం ఆవిష్కృతమైంది. మాఘ పౌర్ణమి పుణ్యదినాన నాగసర్పం ఒకటి శివలింగాన్ని చుట్టుకుని దర్శనమిచ్చింది. సుమారు 20 నిమిషాల పాటు ఆలయంలో సంచరించిన నాగేంద్రుడు చేసిన విన్యాసాలు భక్తులను పరవశింపజేశాయి. మాఘ పౌర్ణమి రోజున మహాశివుని దర్శనంతో పాటు నాగేంద్రుడు స్వయంగా స్వామి భక్తిని ప్రదర్శించడం కనులారా చూశామని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. మూడేళ్ల కిందట వెలుగులోకి.. సుమారు మూడేళ్ల కిందట కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన సమయంలో ఈ శివలింగం వెలుగులోకి వచ్చింది. దశమంతుల మాణిక్యాలరావు(వైఎస్సార్ సీపీ నాయకుడు) ఇంటి సమీపంలో కొండచరియలు విరిగిపడగా, శివలింగాన్ని ఆయనే గుర్తించారు. అప్పట్లో ఆ శివలింగం చుట్టూ మూడు, నాలుగు పాములు సంచరించేవి అని, కొంత సమయం తర్వాత వాటంతట అవే వెళ్లిపోయేవని స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని పూజారి దృష్టికి తీసుకువెళ్లగా, శివలింగం ఎక్కడ లభించిందో అక్కడే ప్రతిష్టించాలని సూచించారు. దీంతో మాణిక్యాలరావు ఆ ప్రదేశంలోనే శివాలయాన్ని నిర్మించారు.శివలింగంతో పాటు పార్వతీ సమేత గణనాథుని విగ్రహాలను ప్రతిష్టించి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. రాత్రి వేళల్లో తరచూ పాములు ఆలయంలోకి వస్తుంటాయని, అయితే అవి ఎవరికీ ఎలాంటి హాని కలిగించలేదని మాణిక్యాలరావు తెలిపారు. మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతుండగా, మధ్యాహ్నం 12 గంటల సమయంలో నాగుపాము ఆలయంలోకి ప్రవేశించడాన్ని మాణిక్యాలరావు స్వయంగా చూసి తన సెల్ఫోన్లో వీడియో తీశారు. ఆ పాము శివాలయం ప్రాంగణమంతా కలియతిరుగుతూ, పార్వతీ సమేత గణనాథుడి విగ్రహం వద్ద, శివుని చిత్రపటం వద్ద పడగ విప్పి కొంతసేపు నిలబడిందన్నారు. సుమారు 10 నిమిషాల పాటు శివలింగానికి చుట్టుకుని కనిపించిందని ఆయన వివరించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.pic.twitter.com/fJ2iOBoesP— greatandhra (@greatandhranews) February 12, 2025 -
ఈ చర్య మతసామరస్యానికి శరాఘాతం!
అజ్మీర్ దర్గాకు సంబంధించిన వార్తలు ముస్లింలకు మాత్రమే బాధ కలిగిస్తాయనుకుంటే పొరపాటు. తరతరాలుగా హిందువులు ఆ దర్గాలో ఆరాధనలు జరుపుతున్నారు. ‘చాదర్’ సమర్పిస్తు న్నారు. భక్తులు ఎంతో పవిత్రంగా ‘గరీబ్ నవాజ్’ అని పిలుచుకునే ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఎదుట మొక్కులు తీర్చుకుంటున్నారు. భారత దేశంలోని ముస్లింలు, హిందువులకు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్రాన్ని ప్రతి రోజూ 1.5 లక్షల మంది భక్తులు సందర్శిస్తారు. భారతీయ ముస్లింలలో అత్యధికులు అజ్మీర్ దర్గాను జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి అనుకుంటారు. అజ్మీర్ దర్గా భారతదేశంలోని ముస్లింలకు మక్కా లాంటిదని పలువురు భావిస్తారు. అజ్మీర్ ఖ్వాజాను ‘హిందూస్థాన్ కే వలీ’ లేదా ‘హింద్ వలీ’ అని పిలుస్తారు.కాని ఇటువంటి ఈ సామరస్య కేంద్రం ఇప్పుడు వార్తల్లో అనవసర కారణాలతో నిలవడం బాధాకరం. భారతదేశంలో బాబ్రీ తర్వాత సాగుతున్న హైందవ సంస్కృతి ఆనవాళ్ల వెతుకులాట మసీదుల చుట్టూ ఇంతకాలం ఉండగా... ఇప్పుడు దర్గాలకు చేరడం, అదీ కోట్లాది మంది సెంటిమెంట్‌గా భావించే అజ్మీర్ దర్గాకు చేరడం ఆందోళన కలిగించే అంశం. చినికి చినికి గాలివాన అయినట్టుగా ఇది ఎక్కడకు చేరబోతున్నదో పాలకులకూ, ఈ వివాదాన్ని రేపుతున్నవారికీ అంచనా ఉందా? ఈ వివాదాన్ని లేపేవారు భారతీయ హిందూ– ముస్లింల మధ్య ఎడతెగని అనిశ్చితి, ఘర్షణ, విభజన, ద్వేషం ఆశిస్తున్నారా? ఒక దేశంలో కలిసిమెలిసి ఉండవలసిన రెండు ప్రధాన మతాలు నిత్యం ఘర్షణల్లో ఉంటే ఆ దేశ ప్రగతి ఏ రీతిలో కొనసాగుతుందనేది మనలో ప్రతి ఒక్కరం ప్రశ్నించుకోవాలి.అయోధ్యలో ప్రార్థనా స్థలంపై జరిగినట్లుగా అజ్మీర్‌లో దీర్ఘకాలంగా పోరాటం లేదు. ఇది మసీదు వంటి బహిరంగ ప్రదేశం కాదు. ఇది సూఫీ సాధువు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ సమాధి. అజ్మీర్ దర్గాపై ఎటువంటి న్యాయపోరాటం లేనప్పుడు, 800 ఏళ్ల సూఫీ సాధువు సమాధి వద్ద యంత్రాలు, గునపాలు చేరడం చట్టవిరుద్ధం. హిందూసేన కోర్టు సహాయంతో అజ్మీర్ ఖ్వాజా దర్గాను సర్వే చేయాలనుకుంటోంది. ఈ సర్వేను నిలిపివేయాలని ఈ దేశంలో బాధ్యతగల పౌరులెవరైనా ఆశిస్తారు. తాజ్‌మహల్, కుతుబ్మినార్ల విషయంలో చేసినట్లుగా అజ్మీర్ దర్గా సర్వేను తిరస్కరించాలి. వివాదాలు లేని చోట వివాదాలు సృష్టించవలసిన అవసరం ఏమిటని గౌరవనీయమైన పెద్దలు ముందుకు రావాలి.హిందూ ముస్లింలకు ఇది దర్గా అని తెలుసు. ఇది రెండు మతాలకు చెందినది కాబట్టి వారు దానిని ఒకే దృష్టితో చూశారు. భక్తులు అక్కడ సంతోషంగా ప్రార్థనలు చేస్తున్నప్పుడు వారిని భంగపరచి దేశవ్యాప్తంగా ఎందుకు హింసను ప్రేరేపించాలి? శివలింగం ఉందా... లేదా ఉందని వెలికితీయడానికీ, లేదా లేకపోయినా ఉందని వాదించడానికీ పవిత్రమైన 800 సంవత్సరాల నాటి సూఫీ సాధు సమాధిని అన్వేషించడం 140 కోట్ల జనాల మనోభావాలను దెబ్బతీసినట్లే. దర్గా హిందువులు– ముస్లింల మధ్య వారధిగా నిలుస్తుంది. ఈ వంతెనను దెబ్బ తీస్తే, హిందువులు – ముస్లింల మధ్య సంబంధాన్ని విచ్ఛిన్నం చేసినట్లే. ఇలా చేసి చివరికి ఏమి సాధించబోతున్నారు?గత పాఠాలు బోధించడం, అవగాహన పెంపొందించడంలో చరిత్రకు దాని విలువ ఉంది. ప్రజలను విభజించడానికి లేదా శాంతికి భంగం కలిగించడానికి చరిత్రను ఆయుధంగా వాడకూడదు. చరిత్రను తవ్వకూడదు. చరిత్రకు దానిదైన విలువ ఉంటుంది. చరిత్ర గతిలో గడిచిపోయిన విషయాలను కొన్నింటిని వర్తమానంలోకి తెచ్చినప్పుడు అవి మనం కోరే వ్యాఖ్యానాలు, ఫలితాలు మాత్రమే ఇవ్వవు. తేనెతుట్టెను కదిల్చి తేనెటీగలను ఒక వరుస క్రమంలో ఎగిరి వెళ్లమని కోరడం లాంటిది ఇది. సమాజంలో అన్ని మతాలకూ, వారి పవిత్ర స్థలాలకూ గౌరవం అవసరం. సామరస్యాన్ని కాపాడుకోవాలంటే విశ్వాసం విభజితం కాకుండా ఏకం కావాలని గుర్తించాలి. ఈ మతాతీత ప్రదేశాలు గౌరవం, ఐక్యతలకు సంబంధించిన స్థలాలుగా ఉండాలి.చదవండి: ఒక అపరిచితుడి దయగత రెండు సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ‘మేము కొన్ని పరిస్థితుల్లో ప్రకృతికి విరుద్ధంగా బాబ్రీ మసీదు సమస్యను లేవనెత్తాము. ఇప్పుడు ఆ సమస్య సమసిపోయింది. ఇప్పుడు మరలా ప్రతిరోజూ మసీద్–మందిర్ గొడవలు దేనికని? ఎందుకు అనవసర గొడవలు సృష్టిస్తు న్నారు? ప్రతీ మసీదులో శివలింగం ఉందని వాదించడం సరైనది కాదు. విధానం వేరైనప్పటికి మసీదుల్లో ముస్లింలు చేస్తున్నది కూడా దైవ ఆరాధనే. వారు మనవాళ్ళే, బయట నుండి ఏమి రాలేదు. ఇది అందరూ అర్థం చేసుకోండి’ అని చెబుతూనే వస్తున్నారు. కానీ, జరుగుతున్నది వేరు.సూఫీ సాధువు సమాధి కింద శివలింగం ఉందనడానికి ఎటువంటి ఆధారాలూ లేవు. హింసను ప్రేరేపించడానికి అలాంటి కల్పనలను వదిలివేయాలి. భాగవత్ మాటలను గౌరవించమని హిందూ సోదరులకు విజ్ఞప్తి. అలాగే ముస్లిం సోదరులు కూడా సంయమనం పాటించాలి. ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా కలిసి మెలిసి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరూ కలిసి నడుద్దాం. భారతదేశ జెండాను ప్రపంచంలో ఉన్నత శిఖరాల్లోకి ఎగరవేద్దాం. మేరా భారత్ మహాన్ హై! జై హింద్!!- జహారా బేగంసామాజిక కార్యకర్త (ఇండియా/యు.ఎస్.ఎ) -
శ్రీశైలంలో అద్భుతం..
-
శ్రీశైలంలో బయటపడిన పురాతన శివలింగం
సాక్షి, నంద్యాల: శ్రీశైలం దేవస్థానం యాంఫి థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. సీసీ రోడ్డు సపోర్ట్ వాల్ నిర్మాణానికి జేసీబీతో చదును చేస్తుండగా శివలింగంతో పాటు అదే రాయిపై నంది విగ్రహం బయటపడింది. శివలింగం పక్కనే రాయిపై తెలియని లిపితో గుర్తులు రాసి ఉన్నాయి. బయటపడిన శివలింగాన్ని దేవస్థానం అధికారులు పరిశీలించారు. శివలింగం దగ్గర ఉన్న లిపిని ఆర్కియాలజీకి పంపించారు. బయట పడిన పురాతన శివలింగం వద్ద ఉన్న శాసన లిపి 14,15 వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనంగా గుర్తించారు.గతంలో ఇదే ప్రాంతంలో చతుర్ముఖ లింగం బయటపడింది. గతంలో పంచమఠాల పునర్నిర్మాణ సమయంలో పలు తామ్ర శాసనాలు బయటపడ్డాయి. -
పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ శివలింగాలు ఇక్కడే!
-
Gyanavapi Case: శివలింగం బయటపడిన ప్రాంతాన్ని పరిరక్షించాలి: సుప్రీం
న్యూఢిల్లీ: వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదులో వెలుగుచూసిన శివలింగాన్ని పరిరక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని సుప్రీంకోర్టు తెలిపింది. సర్వే సందర్భంగా జ్ఞానవాపి మసీదులో బయటపడిన శివలింగం రక్షణ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం మే17న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మసీదులో శివలింగాన్ని గుర్తించిన వాఘూఖానా ప్రాంతాన్ని సీజ్ చేయాలని, ముస్లింల ప్రార్థనలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని ఆదేశాలిచ్చింది. ఈ మధ్యంతర ఉత్తర్వుల గడువు రేపటితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ సుప్రీం ధర్మాసనం ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను నవంబర్ 28కి వాయిదా వేసింది. చదవండి: (Delhi MCD Election: పది కీలక హామీలు ప్రకటించిన కేజ్రీవాల్) -
దేశంలో ఏకైక పంచ బ్రహ్మలింగేశ్వర ఆలయం
కోవెలకుంట్ల: కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలంలోని భీమునిపాడులో వెలసిన పంచబ్రహ్మలింగేశ్వర ఆలయం దేశంలోనే ఏకైక ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. వినాయకుడు, ఈశ్వరుడు, అమ్మవారు, విష్ణువు, బ్రహ్మ పూర్ణంగా(పంచబ్రహ్మలు) శివలింగాన్ని ప్రతిష్టించారు. ప్రతి ఏటా మహాశివరాత్రి పండుగ రోజున దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రవహిస్తున్న నది జలాలతో పంచబ్రహ్మలింగేశ్వరుడికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఒక్కో సంవత్సరం ఒక్కో నది నుంచి క్యానులో 25 లీటర్ల చొప్పున ఆరు క్యాన్లతో నది జలాలను తీసుకొచ్చి అభిషేకం చేస్తున్నారు. ఇప్పటి వరకు గంగ, యమున, కృష్ణ, గోదావరి, కావేరి, నర్మద నదుల నీటితో అభిషేకం నిర్వహించారు. అలాగే ఆలయం ఎదుట 14 సంవత్సరాల క్రితం ప్రతిష్టించిన 68 అడుగుల ఏకశిలా ధ్వజస్తంభం దేశంలోనే రెండవ అతిపెద్ద ధ్వజస్తంభంగా పేరుగాంచింది. కర్నాటక రాష్ట్రంలోని హోస్పెట్ నుంచి ఏకశిలా రాతి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టించారు. దేశంలో అతిపెద్ద ఏకశిలా విగ్రహం కర్నాటక రాష్ట్రంలో ఉండగా రెండవది ఆంధ్రప్రదేశ్‌లోని భీమునిపాడులో ప్రతిష్టించడం విశేషం. -
పరివార ఆలయాలు – దేవతలు
ఆలయానికి దేవాలయం.. దేవస్థానం అనే పేర్లు ప్రచారంలో ఉన్నా ఆగమం అందులో ఓ తేడాను చెప్తుంది. గర్భగుడి.. గుడిలో మూలమూర్తి లేదా శివలింగం.. ఎదురుగా నంది/వాహనం... ధ్వజస్తంభం..బలిపీఠం ఇవి మాత్రమే ఉంటే దాన్ని దేవాలయం అంటారు. అదే వీటితోపాటు దేవి, గణపతి, స్కందుడు, చండేశ్వరుడు, పరివార దేవాలయాలు, అనేక శాలలు, గోపురాలు ఉన్నదాన్ని దేవస్థానం అంటారు. శయనాలయం దర్శించుకున్న భక్తులు ఆ తర్వాత తప్పనిసరిగా ఆలయం చుట్టూ ఉన్న చిన్న చిన్న ఆలయాలను దర్శించుకోవాలి. వాటిలో ఉన్న దేవతలను పరివార దేవతలు అంటారు. పరివార దేవతలను తప్పక దర్శించాలి అన్నది ఆలయ నియమం. స్వామివారి దేవేరులు.. పిల్లలు...ద్వారదేవతలు... దిక్పాలకులు.. గణనాయకుడు.. సేనాపతి... ఋషులు.. భక్తులు వీళ్లంతా పరివారదేవతలుగానే పరిగణించబడతారు. పరివార దేవతలందరికీ చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి. రాజు ఒక పనిని తన పరివారం తోడ్పాటుతో పూర్తి చేసినట్లే... ఇక్కడ భగవంతుడు తన భక్తుల కోర్కెలను కూడా ఈ పరివార దేవతల ద్వారా తీరుస్తాడు. ఈ పరివార దేవతలనే ఆవరణ దేవతలు, ఉపదేవతలు అని కూడా అంటారు. వీరిని మూలమూర్తితో పాటు నిత్యం పూజిస్తారు. ఈ పరివారమూర్తులను ప్రతిష్ఠించడం దేవాలయానికి శోభను.. శాంతిని... మరింత పవిత్రతను.. తెచ్చిపెడుతుందని శ్రీ ప్రశ్నసంహిత చెబుతుంది. ఈ పరివార దేవతలు సామాన్యంగా ఎనిమిది మందితో మొదలై గరిష్టంగా అరవైనాలుగుమంది వరకూ ఉంటారు. మొదటి ప్రాకారంలో.. అంటే గర్భగుడి చుట్టూ ఎనిమిదిమంది ... రెండవ ప్రాకారంలో పదహారుమంది... మూడవ ప్రాకారంలో ముప్పైరెండుమంది పరివార దేవతలుండాలని మానసార శిల్పశాస్త్రం చెప్పింది. పన్నెండుమంది పరివారదేవతలుంటే ఉత్తమం అని సనత్కుమారసంహిత చెప్తుంది. వైఖానసాగమంలో ఎనిమిదిమందితో మొదలై.. ఏడుప్రాకారాలు.. నూటపన్నెండుమంది పరివారదేవతల వరకు ఉంది. అలా ఉన్న ఆలయమే ఉత్తమోత్తమమైనది అని చెప్తోంది. శివాలయానికి దేవి, నంది, గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, అగ్నిదుర్గా, అగస్త్యుడు, బ్రహ్మ, సప్తమాతృకలు, వీరభద్రుడు, విష్ణువు, శివసూర్యుడు, జ్యేష్ఠ పరివారదేవతలుగా ఉంటారు. విష్ణ్వాలయానికి దేవేరులు శ్రీదేవి–భూదేవి, గరుడుడు, విష్వక్సేనుడు, చక్రమూర్తి, దశావతారాలు, పంచమూర్తులు, నవమూర్తులు, ద్వాదశాదిత్యులు పరివారదేవతలు. శక్తి ఆలయానికి జయా, విజయా, అజితా, అపరాజితా, విభక్తా, మంగళా, మోహినీ, స్తంభినీ అనే ఎనిమిదిమంది దేవతలు. పరివారదేవతలను దర్శించి మూలమూర్తి దగ్గర కోరిన కోరికలు మరోమారు తలుచుకుంటే మన కోరికలు తప్పక నెరవేరుతాయన్నది ఆగమ శాస్త్రోక్తి. – కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య ఆగమ, శిల్పశాస్త్ర పండితులు -
పరమపవిత్రం స్ఫటిక లింగం
సాక్షి, రాజాం : రాజాం పట్టణం అనగానే అందరికంటే ముందుగా గుర్తొచ్చేది తాండ్ర పాపారాయుడు. రాజాం కేంద్రంగా బొబ్బిలి రాజుల ప్రతినిధిగా ఆయన పాలన సాగించేవారు. ఇదే సమయంలో అక్కడ ఆయన పలు ఆలయాలను నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్లో ఎక్కువుగా వైష్ణవ ఆలయాలు ఉండే ఈ ప్రాంతంలో ఆయన మాత్రం సారధిలోని కూరాకుల వీధిలో ప్రత్యేకంగా స్ఫటిక శివలింగాన్ని ప్రతిష్టించారు. లోక కల్యాణార్థం అప్పట్లో ఆయన శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్టించారని అంటారు. ఈ శివలింగాన్ని కాశీ నుంచి తీసుకొచి్చన రాతితో నిర్మించినట్లు చెబుతారు. మరోవైపు ఈ ఆలయంలో గర్భగుడి కుడి, ఎడమ వైపునున్న గుడుల్లో గణేశుని ప్రతిమతతో పాటు పార్వతిదేవి ప్రతిమలు ఉత్తర, దక్షిణ ముఖంగా ఉంటాయి. ఇలా ఈ రెండు విగ్రహాలు ఉత్తర, దక్షిణ ముఖాలుగా ఉండడం ఇక్కడి ప్రత్యేకత. తాండ్ర పాపారాయుడు ప్రతిరోజు ఉదయం శివలింగ దర్శనం చేసుకుని, ప్రత్యేక పూజలు చేసేవారని తెలుస్తోంది. ఈ శివలింగానికి నిష్టతో పూజచేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. -
హర హర మహాదేవ
లోక కళ్యాణం కోసం గరళాన్ని సైతం గొంతులో దాచుకొని అందరికీ అమృతాన్ని పంచిన ప్రేమమూర్తి ఆయన. రాక్షసులకు సైతం వరాలను అనుగ్రహించగల బోళాశంకరుడు, మూడోకన్నుతో లోకాలన్నిటì నీ భస్మం చేయగల ముక్కంటి, లోకంలోని సర్వ దుఃఖాలను, సర్వుల పాపాలను తనలో లయం చేసుకునే లయకారుడయిన శివుడిని అర్చించడం కంటే మించిన పూజ, అంతకు మించిన సాధన మరేదీ లేదు. ఆ స్వామి ఓంకార నాదంతో స్వయం ప్రకాశ స్తంభంగా(లింగం)గా ఆవిర్భవించిన పర్వదినం ‘మహాశివరాత్రి’. ఈ పర్వదినం మాఘమాసంలో బహుళ పక్షంలో అర్ధరాత్రి వ్యాపకమైన చతుర్దశి తిథిలో వస్తుంది. ప్రతి మాసంలో వచ్చే బహుళ చతుర్దశి తిథులు ‘మాస శివరాత్రులు’ గా వ్యవహరిస్తారు. ఏడాది కాలంలో వచ్చే ద్వాదశ శివరాత్రులలో మాఘ బహుళ చతుర్దశి శివునికి అత్యంత ప్రీతికరమైనది. కనుకనే ఈ మాఘ బహుళ చతుర్దశి మహా శివరాత్రిఅంటే శివరాత్రులలో గొప్పది అయింది. శివలింగ ఆవిర్భావం గురించిన వివరణ శివపురాణంలో ఉంది. దానిని అనుసరించి... ఒకసారి బ్రహ్మ, విష్ణువుల మధ్య ఎవరు గొప్పవారు..? అనే వాదన తలెత్తింది. వారి గర్వాన్ని పోగొట్టేందుకు శివుడు కోటిసూర్య సమాన దివ్యతేజస్సుతో లింగరూపంలో ఆవిర్భవించాడు. ఆ లింగం ఆది, అంతం తెలుసుకోగలిగిన వారే గొప్పవారు అని వారితో చెప్పాడు. అప్పడు ఆ లింగం మూలస్థానం చూసేందుకు విష్ణువు వరాహరూపంలో పైకి, అంతిమ స్థానం చూసేందుకు బ్రహ్మ, హంస రూపంలో కిందివైపుకి ప్రయాణించారు. ఎంతగా వెదికినా, మరెంతగా శోధించినా ఫలితం కనిపించలేదు. బ్రహ్మ, విష్ణువులిద్దరూ ఆ తేజోమయ లింగ ఆది, అంతాలను తెలుసుకోలేకపోయారు. అప్పుడు వారిద్దరూ శివుడిని ‘మహాప్రభూ’.. మమ్మల్ని అనుగ్రహించండి. మీ నిజరూపాన్ని ప్రదర్శించండి’ అని అన్నారు. అప్పుడు శివుడు వారికి దివ్యజ్ఞానాన్ని ప్రసాదించాడు. మాఘ బహుళ చతుర్దశి నాడే ఈ మహాలింగం ఉద్భవించింది. అందుకే అది మహాశివరాత్రి పర్వదినమయ్యిందని అంటారు. స్నానం... దానం... అర్చన అభిషేకం... ఉపవాసం... జాగారం మహాశివరాత్రి పర్వదినాన పూజ, అభిషేకం, ఉపవాసాలను భక్తిశ్రద్ధలతో నిర్వర్తించడం వలన శివానుగ్రహానికి పాత్రులు కాగలరు. శివరాత్రినాడు మహాదేవుని అర్చించి మోక్షాన్ని పొందిన భక్తుల కథలు పురాణాల ద్వారా మనకు కొంతవరకూ పరిచితమే కాబట్టి అభిషేక ప్రియుడైన శివుని ఈ మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం, అభిషేకాలు, నాలుగు జాముల్లోనూ పూజలు, జాగరణలతో శివపూజ సాగించాలి. మొదటి పూజ రాత్రి ఎనిమిదిగంటలకు ప్రారంభిస్తారు. చివరి పూజ తెల్లవారుజామున ఐదుగంటలకు ముగిస్తారు. శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చెబుతోంది. అయితే, చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది. ఉపవాసం ఎలా చేయాలి? ఉపవాసం ఉండే ముందురోజు, ఉపవాసం మరుసటి రోజు కూడా మాంసాహారం, గుడ్డు తినకూడదు, మద్యపానం చేయకూడదు. ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలస్నానం చేసి, ‘ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను, విఘ్నాలేమీ లేకుండా నా దీక్ష చక్కగా సాగాలి’ అని సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అనే పదానికి దేవునికి దగ్గరగా ఉండడం అని అర్థం. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్థాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరు చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును మళ్లించడం ఈ కాలంలో అయితే చాలా కష్టం. జీవారాధన మనం ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం, ఇతర ఆహారపదార్ధాలు మిగులుతాయో, వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి. అప్పుడే మనం చేసిన ఉపవాసం ఫలిస్తుంది. ఎందుకంటే అష్టమూర్తితత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వరసేవయే. అందుకే స్వామి వివేకానంద ’జీవారాధనే శివారాధన’ అన్నారు. శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే, వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం కాకుండా, వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి, అలాగే నిలబడాలి. అప్పుడే దృష్టిని కేంద్రీకరించగలుగుతాం. ఆ శివశక్తిని గ్రహించ గలుగుతాం. మౌనవ్రతమూ మహిమాన్వితమే! శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించరాదు. మనసును కూడా మౌనం ఆవరించినప్పుడు మౌనవ్రతం సంపూర్ణమవుతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును శివునిపై కేంద్రీకరించాలి. మీరు అభిషేకం చేయించుకోకపోయినా ఆందోళన అవసరం లేదు. ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులు పఠిస్తున్న రుద్ర – నమక చమకాలను వింటే చాలు.. మనసు మధురభక్తితో నిండిపోతుంది. ఈ జగత్తంతా శివమయమే. అంతటా శివతాండవమే. ఎక్కడ చూసినా ఎంతో పురాతన చరిత్రనూ, మరెంతో వైభవాన్నీ, ఆ స్వామి మహిమలనూ కలిగిన శైవక్షేత్రాలే. శివతత్త్వాన్ని శిల్పాల రూపంలో, స్థలపురాణాల రూపంలో జ్ఞానామృతాన్ని పంచుతుంటాయి. అందుకే అందుబాటులో ఉన్న ఏ శివాలయానికైనా వెళదాం, ఆ ఆనందాన్ని దోసిళ్లతో గ్రోలుదాం. హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివభక్త్యామృతంలో ఓలలాడదాం. పూర్ణిమా స్వాతి త్రిలోకనాయకుడు ఆ స్వామి త్రినేత్రుడు. త్రిగుణాకారుడు. త్రి ఆయుధుడు. త్రిజన్మ పాప సంహారుడు. మూడు అడ్డురేఖలను నామంగా కలిగినవాడు. త్రిదళాలతో కూడిన బిల్వాలను ఇష్టపడేవాడు. త్రిశూలధారి. త్రికాలాలకు, త్రి నామాలకు అధిపతి. త్రిలోక రక్షకుడు. ఆకాశమనే లింగానికి భూమి పీఠం. సమస్త దేవతలూ అందులో ఉన్నారు. అంతా అందులోనే లయమవుతుంది. అందుకే ఈశ్వరులకు ఈశ్వరుడు, దేవతలకు దైవం అయిన పరమేశ్వరుడు జాగ్రద్, సుషుప్త, స్వప్నాలకు అతీతుడు. అన్నీ ఆయనలో ఉన్నాయి. అంతటా ఆయనే నిండి ఉన్నాడు. -
మోదీ.. శివలింగంపై తేలు!
బెంగళూరు: ప్రధాని మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇది ఒక అసాధారణ పోలికగా అభివర్ణిస్తూ.. ‘ప్రధాని మోదీని శివలింగంపై తేలులా ఆరెస్సెస్ వారు భావిస్తుంటారు. ఆ తేలును చేత్తో తీసేయలేం. చెప్పుతో కొట్టలేం అనుకుంటుంటారు. ఈ విషయం ఆరెస్సెస్‌లోని ఒక వ్యక్తి ఓ జర్నలిస్ట్‌కు చెప్పారు’ అంటూ థరూర్ చేసిన వ్యాఖ్య దుమారం రేపుతోంది. తన వ్యాఖ్యపై వివరణ ఇస్తూ ‘ఒకవేళ చేత్తో తీస్తే ఆ తేలు కాటేస్తుంది. శివలింగాన్ని చెప్పుతో కొడితే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి’ అని థరూర్ పేర్కొన్నారు. ‘హిందుత్వ ఉద్యమం, మోదిత్వ భావజాలం మధ్య నెలకొన్న సంక్లిష్ట బంధాన్ని వివరించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది’ అన్నారు. మోదీని నియంత్రించడం బీజేపీ సైద్ధాంతిక గురువైన ఆరెస్సెస్‌కు అత్యంత కష్టంగా మారిందని కూడా థరూర్ వ్యాఖ్యానించారు. బెంగళూరు సాహిత్య వేడుకలో ఆదివారం థరూర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మాజీ కేంద్రమంత్రి వ్యాఖ్యలపై బీజేపీ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. వీటిపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించాలని, శివభక్తుడినని చెప్పుకునే రాహుల్ ఈ వ్యాఖ్యను సమర్థిస్తారో లేదో చెప్పాలని బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. థరూర్ వ్యాఖ్యలు మహాశివుడిని అవమానించేవేనని, తక్షణమే రాహుల్, శశిథరూర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రవిశంకర్ ప్రసాద్ విమర్శలపై థరూర్ స్పందిస్తూ.. మోదీకి సంబంధించి ఈ వ్యాఖ్య తాను చేసింది కాదని, ఆ కామెంట్ ఇప్పటిది కూడా కాదని, చాన్నాళ్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారమవుతూనే ఉందని సమాధానమిచ్చారు. మోదీపై థరూర్ రాసిన ‘ది పారడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్’ అనే పుస్తకాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ ఇటీవలే ఆవిష్కరించిన విషయం తెలిసిందే. -
పూనకంతో ఊగిపోతూ హల్ చల్ చేసిన యువకుడు
-
నెత్తిపై రాయి.. నాగిని డాన్స్
సాక్షి, ప్రకాశం: మూఢనమ్మకాలను రూపుమాపేందుకు జన విజ్ఞాన వేదికలు కృషి చేస్తుంటే.. కొందరు మాత్రం ప్రజలను మభ్యపెడుతూ వస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో ఓ కుర్రాడు పూనకంతో ఊగిపోతూ హల్ చల్ చేశాడు. స్వయంభూ శివలింగం వెలిసిందంటూ దర్శి మండలం శివరాజ్ నగర్లో హడావుడి చేసాడు. శ్రీను అనే యువకుడు స్థానికంగా కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఏం జరిగిందో తెలీదుగానీ, హఠాత్తుగా ఓ రాయిని శివలింగంగా చెబుతూ నెత్తిన పెట్టుకొని పూనకంతో ఊగిపోయాడు. తనను ముట్టుకోవద్దంటూ ఊగిపోతూ ప్రజల మధ్యలోకి వచ్చి ఆ రాయికి పూజలు చేశాడు. ఊరిపోలిమేరలో వెలసిన శివలింగానికి వెంటనే గుడికట్టాలని, లేదంటే ఊరికే అరిష్టం అంటూ నాగిని డాన్స్‌తో ఊగిపోయాడు. అతన్ని చూసిన గ్రామస్థులు స్వామి.. స్వామి అంటూ అతని చుట్టూ చేరటం విశేషం. ప్రస్తుతం వాట్సాప్‌లో అందుకు సంబంధించిన వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. -
అయ్యో! అపచారం.. నిందితుడి అరెస్ట్
సాక్షి, చెన్నై : ఇటీవల శివలింగంపై కాళ్లు పెట్టి ఫొటో దిగిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులోనూ చెప్పులు ధరించి దర్జాగా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే నిందితుడికి ముచ్చెమటలు పట్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. సద్దాం హుస్సేన్ (35) తిరు మూర్తి మండపం వద్దకు ఇటీవల తన స్నేహితుడితో కలిసి వెళ్లాడు. అయితే పాదరక్షలతోనే గుడిలోకి వెళ్లాడు సద్దాం. అనంతరం శివలింగంపై మెకాలు పెట్టి ఫొటోలకు పోజులిచ్చాడు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. తమ మత విశ్వాసాలు, మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కొందరు హిందూత్వవాదులు, మున్నాయ్ హిందూ గ్రూపు మమళ్లాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సద్దాం హుస్సేన్ ఛెంగల్పేట్ సబ్ జైలులో ఉన్నాడు. ఆ ఫొటోలో సద్దాం పక్కన ఉన్న మరో వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. -
టీడీపీ పెద్దలకు స్థలం ఇచ్చేందుకు శివలింగం ధ్వంసం!
సాక్షి, కొవ్వూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని ఓ స్నానఘట్టంలో ఇరిగేషన్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. టూరిజం పేరుతో టీడీపీ పెద్దలకు స్థలం కేటాయించేందుకు ఏకంగా స్నానఘట్టంలోని శివలింగంతోపాటు దేవతా విగ్రహాలను కూడా ధ్వంసం చేశారు. దీన్ని అడ్డుకున్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇరిగేషన్ అధికారులు, పోలీసుల తీరుకు నిరసనగా తానేటి వనిత ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో చేశారు. -
శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా?
శివలింగాన్ని ఇంటిలో ఉంచుకోకూడదని చాలా మంది చెబుతూ ఉంటారు. అలా పెట్టుకున్నట్లయితే ఏదో అరిష్టం జరుగుతుందని, ఇంట్లో ఉంచుకోవద్దని అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి శివలింగాన్ని ఇంటిలో ఉంచుకోవడం వల్ల ఎలాంటి దోషం ఉండదు. అలంకరణ కోసం, సద్భావన కోసం పెట్టుకునే ప్రతిమలకు ఆరాధనలు, నైవేద్యాలు చేయనక్కర్లేదు. అయితే ఒక్కసారి పూజించిన విగ్రహాన్ని మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ పక్కన పెట్టకూడదు. భగవంతుని శక్తిని ఆవాహన చేసి పూజించిన తర్వాత ఆ శక్తి విగ్రహంలో నిగూఢమై ఉంటుంది. సృష్టి అంతా వ్యాపించి ఉన్న శక్తులను, వాటి ప్రయోజనాలను సాధకులకు రాబట్టేది లింగం. అంతటి శక్తిమంతమైన లింగానికి నిత్యపూజ చేయడం కనీస ధర్మం. అదేవిధంగా నర్మదా బాణలింగాల వంటివీ ఇంటిలో ఉంచుకోవచ్చు. నిత్య పూజకు లోపం రానీయకూడదు. శివుడికి ఒక్కడికే నిత్య అభిషేకం చెప్పబడింది. ‘‘అభిషేక ప్రియ శివః’’ అన్నారు. కాబట్టి రోజూ శక్తి కొద్దీ భక్తీ లోపం కాకుండా అభిషేకం చేయగలిగితే చాలు. అభిషేకం అంటే కచ్చితంగా మంత్రాలూ అవీ చదవాలి అనే నియమం ఏమీ లేదు.. శివ పంచాక్షరి (ఓం నమశ్శివాయ) చదువుతూ అభిషేకం చేయవచ్చు. శ్రద్ధగా శివపూజ చేయగలిగిన వారు ఇంటిలో శివలింగాన్ని నెలకొల్పి పూజించవచ్చు. ముందుగా దీపారాధన చేసుకోవాలి. కలశంలోని నీటిని గంగా గంగా గంగ అని అభిమంత్రించాలి. తరువాత ‘‘శ్రీ గంగా సహిత ఉమా మహేశ్వరాభ్యాం నమః ధ్యానం సమర్పయామి’’ అని అక్షితలు వేయాలి. లింగాన్ని పళ్ళెంలో పెట్టి స్నానం / అభిషేకం చేసుకుని, అభిషేకం అయ్యాక స్వామిని శుభ్రంగా తుడిచి మందిరంలో పెట్టి ఉంచితే సరి. . -
ఆ శిలా తోరణాలు ఓ మహాలయపు ఆనవాళ్లు
ఓరుగల్లు కాకతీయ తోరణాల గుట్టు విప్పిన అమెరికా పరిశోధకుడు వాగనర్ సాక్షి, హైదరాబాద్: నాలుగున్నర ఎకరాల సువిశాల స్థలం.. దానికి నాలుగు దిక్కులా ఒక్కోటి 30 అడుగుల ఎత్తుతో భారీ తోరణ ద్వారాలు.. లోపల నాలుగు నంది మండపాలు... మధ్యలో సద్యోజాత, వామదేవ, అఘోర, ఈశాన... ఇలా చతుర్ముఖ రూపంతో శివలింగం.. ఒక్కో ద్వారం నుంచి ఒక్కో రూపం దర్శనం! ఎత్తయిన స్తంభాలు, ప్రతి స్తంభం అద్భుత శిల్ప కళా వైభవానికి నిలువుటద్దం.. వెరసి సర్వతోభద్ర ఆలయం! ఈ గొప్ప ఆలయం ఉంది ఎక్కడో కాదు.. మన వరంగల్‌లో! ఆ ఆలయ తోరణాలే కాకతీయ తోరణాలు!! రాష్ట్ర అధికారిక చిహ్నంగా భాసిల్లుతున్న ఈ తోరణాల గుట్టు వీడింది. ఇన్నాళ్లూ అక్కడో దేవాలయం ఉండేదని, అందులో భాగంగానే వాటిని ఏర్పాటు చేశారని తెలుసు. కానీ.. వాటి అసలు రహస్యాన్ని తాజాగా అమెరికాకు చెందిన ఓ పురావస్తు పరిశోధకుడు తేల్చాడు. కేవలం తోరణాలే కాదు, ఆ ప్రాంతానికి చెందిన సరికొత్త అంశాలను వెలుగులోకి తెచ్చాడు. అది సర్వతోభద్ర ఆలయం సర్వతోభద్ర ఆలయం.. అన్ని వైపులా ప్రధాన శక్తులను ఆవాహన చేసి సర్వం క్షేమదాయకంగా ఉండాలని ఈ తరహా ఆలయాలను నిర్మిస్తారు. ఇవి చాలా అరుదు. ఇందులో నాలుగు వైపులా ద్వారాలు ఉండటం, ఒక్కో ద్వారం నుంచి మూల విరాట్టు ఒక్కో రూపంలో కనిపించడం ప్రత్యేకత. అలాంటి అరుదైన ఆలయం ఓరుగల్లు కోటలో ఒకప్పుడు వెలుగొందింది. ఆ ఆలయానికి ఏర్పాటు చేసిన ద్వారాలే ఈ కాకతీయ తోరణాలు. ఈ ఆలయానికి సంబంధించిన మూలవిరాట్ల స్థానంలో స్థాపితమైన చతుర్ముఖ లింగం.. ఇప్పుడు శంభుడి గుడిగా పిలుచుకునే మరో దేవాలయం ప్రాంగణంలో ఓ పక్కన భూమిలోకి కొంత కూరుకుపోయి ఉంది. ఈ చతుర్ముఖ శివలింగం పీఠం వరంగల్ కోటలో ఉత్తరం వైపున ఉన్న తోరణ ద్వారం పక్కన శిథిలాల్లో పడి ఉంది. ఈ వివరాలను తాజాగా అమెరికాలోని బోస్టన్ సమీపంలో ఉన్న మిడిల్‌టౌన్‌లోని వెస్లియాన్ వర్సిటీ ప్రొఫెసర్ ఫిలిప్ బి.వాగనర్ వెల్లడించారు. వీటిపై అధ్యయనం చేసి ఓ నివేదికను రూపొందించారు. గణపతి దేవుడి హయాంలో నిర్మాణం గణపతిదేవుడి కాలంలో 1220–1240 మధ్య ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. ఆలయం నిర్మాణం పూర్తయ్యే తరుణంలో ఢిల్లీ సుల్తాన్ల సైనికాధికారిగా ఉన్న ఉలూఘ్ఖాన్ వరంగల్‌పై దండయాత్ర చేసి గణపతిదేవుడిని ఓడించాడు. ఆ సమయంలో ఈ ఆలయం «పూర్తిగా ధ్వంసమైంది. ఆ రాళ్లతోనే ఆయన అక్కడ మసీదు నిర్మాణం జరిపినట్టు కూడా కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కోటలోపలి భాగంలో నిలిచి ఉన్న కొన్ని రాతి స్తంభాలు మసీదువేనని ప్రొఫెసర్ వాగనర్ పేర్కొంటున్నారు. తర్వాత ఆ ప్రాంతాన్ని పద్మనాయకులు స్వాధీనం చేసుకొని మసీదును ధ్వంసం చేసి ఉంటారని భావిస్తున్నారు. నిజాం హయాంలో 1920 ప్రాంతంలో పురావస్తుశాఖకు సంచాలకులుగా ఉన్న గులాం యాజ్దానీ హయాంలో వరంగల్ కోటలో తవ్వకాలు జరిపారు. ఆ సమయంలో చతుర్ముఖ శివలింగంతోపాటు ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న శిథిలాలు వెలుగుచూశాయి. శివలింగం పీఠం మరో ప్రాంతంలో కనిపించింది. ఇప్పుడు వాగనర్ చెప్పేంతవరకు అది శివలింగం పీఠమనే విషయం తెలియకపోవటం విశేషం. ముస్లిం రాజుల దాడిలో ఈ శైవక్షేత్రం నేలమట్టమైనా.. దానికి వినియోగించిన నాలుగు తోరణ ద్వారాలు మాత్రం చెక్కు చెదరలేదు. వ్యూహాత్మకంగానే వారు వాటి జోలికి వెళ్లలేదని వాగనర్ పేర్కొంటున్నారు. ఈ తోరణాలపై ఎక్కడా హిందూ దేవుళ్ల విగ్రహాలు, ఆకృతులు లేవు. దీంతో వాటిని మసీదుకు ద్వారాలుగా చేసుకునే ఉద్దేశంతోనే ధ్వంసం చేసి ఉండకపోవచ్చు అని ఆయన వివరించారు. అరుదు.. అత్యద్భుతం: వాగనర్ ఈ సర్వతోభద్ర ఆలయాలు చాలా అరుదు. దక్షిణ భారతదేశంలో వాటి సంఖ్య చాలా తక్కువ. కోటలో విలసిల్లిన ఆలయం అత్యద్భుతంగా నిర్మించారు. ఆలయం చాలా పెద్దదిగా నిర్మించి ఉంటారని పునాదుల ఆనవాళ్లు చెబుతున్నాయి. దీన్ని రామప్ప ఆలయం తర్వాతనే నిర్మించినా.. అలాగే నిలిచి ఉంటే దేశంలోనే గొప్ప ఆలయ నిర్మాణంగా చరిత్రలో ఉండేదేమో! సరిపోలిన లింగం పీఠం.. లింగం చుట్టుకొలత.. ప్రస్తుతం వరంగల్ కోటకు వెళ్తే.. నాలుగు తోరణాల మధ్యలో ధ్వంసమైన శిల్పాలు, ఇతర శిథిలాలు కనిపిస్తాయి. ఇవి ఏంటన్న అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. అవి ఏ కట్టడం తాలూకు భాగాలన్న వివరాలు లభ్యం కాలేదు. అమెరికా ప్రొఫెసర్ వాగనర్ వరంగల్‌పై అంతర్జాతీయ స్థాయిలో టూర్‌గైడ్ తయారీ కోసం ఇటీవల ఓరుగల్లు వచ్చారు. ఈయనకు దక్షిణ భారత్‌లో హంపి వంటి ఎన్నో చారిత్రక ప్రదేశాలపై విస్తృతంగా అధ్యయనం చేసిన అనుభవం ఉంది. ఆరు రోజులు వరంగల్‌లోనే ఉండి అక్కడి చాలా ప్రాంతాలను పరిశీలించారు. కోటకు చేరువలోని శంభుడి గుడి ప్రాంగణంలో చతుర్ముఖ లింగాన్ని చూడగానే ఇక్కడ సర్వతోభద్ర ఆలయం ఉండొచ్చని భావించారు. కోటలో నాలుగు వైపులా ఉన్న కీర్తి తోరణాలు ఆలయ ద్వారాలుగా నిర్ధారించుకుని వాటిని చతుర్ముఖ లింగంతో అన్వయించుకున్నప్పుడు కొంత స్పష్టత వచ్చింది. దీంతో నాలుగు తోరణాల మధ్య ఉన్న స్థలంలో పునాదుల ఆనవాళ్లను పరిశీలించగా అది నాలుగు మండపాలు, వాటికి నాలుగు వైపులా ద్వారాలు ఉన్నట్టు స్పష్టమైంది. దీంతో అది సర్వతోభద్ర ఆలయం ఉన్న స్థలంగా నిర్ధారించారు. ఇక్కడే శిథిలాల్లో చతుర్ముఖ లింగం పీఠం కనిపించింది. అది అష్టభుజి ఆకృతిలో ఉంది. దాని చుట్టుకొలత, చతుర్ముఖ లింగం చుట్టు కొలత సరిగ్గా సరిపోయాయి. ఆ ఆలయం ధ్వంసమైనప్పుడు అన్నీ వేర్వేరు ప్రాంతాల్లో పడిపోయాయి. -
అలజడి రేపిన వింత ఘటన
పెంబర్తి: మానసికరోగి మాటలు నమ్మి స్థానికులు జాతీయ రహదారిని తవ్వేసిన వింత ఘటన జనగామ జిల్లా పెంబర్తిలో చోటుచేసుకుంది. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై కొంతమంది జేసీబీతో పెద్దగొయ్యి తవ్వారు. దీనిపై ఆరా తీసిన పోలీసులకు అవాక్కయ్యే నిజం తెలిసింది. ఇక్కడ శివలింగం ఉందని మనోజ్ అనే వ్యక్తి చెప్పడంతో గొయ్యి తవ్వినట్టు స్థానికులు తెలిపారు. తనకు శివుడు కలలో కనిపించి ఇక్కడ తవ్వమన్నాడని మనోజ్ చెప్పడం గమనార్హం. శివుడు తనను పూనినట్టుగా వింతగా ప్రవర్తిస్తుడటంతో స్థానికులు అతడి మాటలు నమ్మారు. తాను చెప్పినట్టు చేయకపోతే శివుడు శపిస్తాడని అతడు భయపెట్టాడు. దీంతో స్థానికులు జేసీబీ సహాయంతో 10 అడుగుల గుంతను తవ్వారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మనోజ్‌తో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. తాము గొయ్యి తవ్విన చోట కచ్చితంగా శివలింగం ఉందని మనోజ్ అంటున్నాడు. శివరాత్రి రోజునే ఇక్కడ తవ్వాలనుకున్నా కుదర్లేదని చెప్పాడు. గొయ్యి తవ్వడానికి స్థానిక రాజకీయ నేతలు సహకరించారని వెల్లడించారు. అయితే పిచ్చోడి మాటలు నమ్మి రోడ్డు తవ్వారని ప్రగతిశీలవాదులు అంటున్నారు. -
అమర్నాథ్ యాత్ర
కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌కు 145 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 13వేల అడుగుల ఎత్తులో అమర్నాథ్ గుహలో భక్తులకు దర్శనమిస్తాడు భోళా శంకరుడు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద గుహల్లో ఒకటి. 150 అడుగుల ఎత్తు, 90 అడుగుల పొడవున్న గుహ ఇది. హిమాలయ పర్వత సానువుల్లో అపురూపంగా, సహజసిద్ధంగా ఏర్పడిన గుహ ఇది. ఏడాదిలో జూలై, ఆగస్టు మాసాలు మినహా మిగతా సమయం అంతా ఈ గుహ పూర్తిగా మంచు కప్పుకుని ఉంటుంది. ఆ సమయంలో మైనస్ 5 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇలాంటప్పుడు గుహను చేరుకోవటం అసాధ్యం. జూలై వచ్చేసరికి ఇక్కడ వాతావరణం కొద్దిగా వేడెక్కుతుంది. మంచు కరుగుతుంటుంది. దీంతో గుహ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ, శివలింగం ఉండే ప్రాంతంలో మాత్రం వాతావరణం ఎప్పటిలాగే ఉంటుంది. 45 రోజుల పాటు శివలింగం చెక్కు చెదరకుండా ఉంటుంది. ఆ తర్వాత క్రమంగా కరిగి అంతర్థానమవుతుంది. విచిత్ర మేమంటే గుహలో శివలింగం ప్రతి ఏటా ఒకే చోట, ఒకే ఎత్తులో ఆవిర్భవిస్తుంది. 90 అడుగుల పొడవైన గుహలో అదే చోట ఎందుకు వెలుస్తుంది.. అదే శివ మహత్యం అంటుంటారు భక్తులు. అమర్నాథ్ యాత్రలో RV టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇది మామూలు ప్రయాణం కాదు. ఓ వైపు అత్యంత లోతైన లోయలు, ఇరుకు దారులు, గుర్రాలపై తప్ప వెళ్లలేని ప్రయాణం. అయినా భక్తులు అంత దూరం వెళ్లటానికి సంకోచించరు. అదంతా కేవలం పార్వతీ ప్రియ వల్లభుడిపై ఉన్న భక్తి, కొండంత నమ్మకం. క్షణంలో మారే వాతావరణం ప్రపంచంలోనే అత్యంత కష్టమైన యాత్రల్లో ఒకటిగా పేరొందిన అమర్నాథ్ యాత్రకు ఏయేటికాయేడు భక్తులు భారీగా పెరుగుతున్నారు. యాత్రకు వెళ్లే వారు చలి నుంచి రక్షణ కోసం మంకీ క్యాప్‌లు, స్వెట్టర్లు, జర్కిన్లు, బ్లౌజ్‌లు, షూ తప్పని సరి. ఎందుకంటే... అక్కడ వాతావరణం క్షణాల్లో మారుతుంది. అప్పటికప్పుడే వర్షం పడి కొండ చరియలు విరిగిపడతాయి. దారి మూసుకు పోతుంది. కాళ్లు జారుతూ ఉంటాయి. అందుకే చేతిలో కర్ర, టార్చ్‌లైట్ ఎప్పుడూ దగ్గర పెట్టుకోవాలి. -
గుప్త నిధుల కోసం.. శివలింగం ధ్వంసం
కంబదురు(అనంతపురం): పురాతన ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన దుండగులు శివలింగాన్ని ధ్వంసం చేయడమే కాక అడ్డొచ్చిన వాచ్‌మెన్‌ను కత్తులతో బెదిరించి పరారయ్యారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కంబదురులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక మల్లేశ్వర ఆలయంలో గుర్తుతెలియని దుండగులు గుప్తు నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో ఆలయంలోని శివలింగాన్ని ధ్వంసం చేశారు. ఇది గమనించిన వాచ్మెన్ వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. అతన్ని కత్తులతో బెదిరించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గుమాస్తానగర్‌లో శివలింగం ప్రత్యక్షం!
రోడ్డు పనులను అడ్డుకోవడానికే: మున్సిపల్ కమిషనర్ తాండూరు: పట్టణంలోని గుమాస్తానగర్ (29వ వార్డు)లో రాత్రికి రాత్రే శివలింగం ప్రత్యక్షమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గుమాస్తానగర్‌లోని శివాలయానికి సుమారు పది అడుగుల దూరంలోని రోడ్డు వద్ద ఆకస్మాత్తుగా శివలింగం ప్రత్యక్షమైంది. సంఘటనా స్థలాన్ని అర్బన్ ఎస్ఐ నాగార్జున సందర్శించి వివరాలు సేకరించారు. ఇదిలా ఉండగా.. మున్సిపల్ కమిషనర్ సంతోష్‌కుమార్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఈనెల 28వ తేదీన మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు పనులు చేపట్టామన్నారు. ఈ పనులు పూర్తి దశకు చేరుకున్నాయి. అయితే రోడ్డు పనులను అడ్డుకోవడానికే గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు వద్ద శివలింగాన్ని ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు అర్బన్ సీఐ వెంకట్రామయ్యకు ఫిర్యాదు చేశామని, ఈ ఘటనపై విచారణ జరపాలని కోరినట్లు కమిషనర్ వివరించారు. అయితే శివాలయానికి చెందిన స్థలంలో మున్సిపల్ అధికారులు రోడ్డు పనులు చేపట్టడంపై ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
ఏసీబీ చేతికి చిక్కిన ఏఎంవీఐ
రూ. 3 కోట్ల విలువైన ఆస్తుల గుర్తింపు హైదరాబాద్: రాష్ట్ర అవినీతి నిరోధక విభాగానికి మరో అవినీతి చేప చిక్కింది. మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ చెక్‌పోస్టు సహాయ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) ఎ.శివలింగం, ఆయన బంధువులు, స్నేహితుల నివాసాలపై ఏసీబీ అధికారులు గురువారం దాడులు చేశారు. హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని క్రాంతినగర్‌లో ఉన్న శివలింగం నివాసంతోపాటు ఇతర ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో కోట్ల రూపాయల విలువ చేసే అక్రమ ఆస్తులను అధికారులు గుర్తించారు. దొరికిన ఆస్తుల విలువ డాక్యుమెంట్ల ప్రకారం రూ.1.50 కోట్లు అని ఏసీబీ డీజీ ఎ.కె.ఖాన్ ప్రకటించారు. మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తులు రూ. 3 కోట్లకుపైగా విలువ చేస్తాయని ఆయన చెప్పారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన సమాచారంతో ఈ దాడులు చేశామన్నారు. శివలింగంపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. శివలింగం ఆస్తుల చిట్టా.. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో రెండంతస్తుల భవనం సైదాబాద్‌లో ఒక ఫ్లాట్ రంగారెడ్డి జిల్లాలో 13 ఎకరాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 10 ఎకరాల వ్యవసాయ భూమి రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో రెండు చొప్పున ప్లాట్లు 77 తులాల బంగారు ఆభరణాలు2.3 కిలోల వెండి సామగ్రి, ఆభరణాలు రూ.23.8 లక్షల విలువ చేసే బీమా పాలసీలు రూ.7.4 లక్షల విలువ చేసే గృహోపకరణాలుసరూర్నగర్ ఆంధ్రాబ్యాంకు లాకర్లో రూ.1.16 లక్షలు, రెండు కార్లు, రెండు ద్విచక్రవాహనాలు -
సంభ్రమాశ్చర్యం !
►భీమేశ్వరస్వామి ఆలయ తవ్వకాల్లో బయల్పడిన శివలింగం చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం ►నేలమాళిగలు, గుప్తనిధులు కూడా బయటపడ్డాయని ప్రచారం ►మూడు ఆలయాల అభివృద్ధికి రూ.1.45 కోట్లు మంజూరు చేబ్రోలు : ప్రాచీన, చారిత్రక ప్రసిద్ధి గాంచిన చేబ్రోలు భీమేశ్వరస్వామి ఆలయ తవ్వకాల్లో అతి పురాతన శివలింగం బయల్పడడం భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. బుధవారం ఉత్తర భాగాన తవ్వకాలు జరుపుతుండగా, సుమారు మూడు అడుగుల ఎత్తు ఉన్న పురాతన శివలింగం వెలుగు చూసింది. భీమేశ్వరస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా పురావస్తుశాఖ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు పైభాగం మాత్రమే కనిపిస్తున్న ఆలయ అభివృద్ధికి తొలిదశలో తవ్వకాలు ప్రారంభించారు. ఈ ఆలయంతోపాటు ఆదికేశవ స్వామి, నాగేశ్వర స్వామి గాలిగోపురం అభివృద్ధికి రూ. కోటీ 45 లక్షల నిధులు మంజూరయ్యాయి. ►బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా శివలింగం బయట పడడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో పాటు నేలమాళిగలు, గుప్తనిధులు కూడా బయటపడ్డాయని ప్రచారం కావటంతో భక్తుల రాక మరింత పెరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తరలివస్తూనే ఉన్నారు. - తవ్వకాల్లో ఎలాంటి గుప్తనిధులు లభ్యం కాలేదని పురావస్తు శాఖ అధికారులు వెల్లడిచేశారు. శివలింగం ఇక్కడే ఉంచాలా వేరే చోటకు తరలించాలా అనేది ఉన్నతాధికారుల సూచనల మేరకు నిర్ణయిస్తామని పురావస్తుశాఖ డీఈ తెలిపారు. ►ప్రస్తుతం ఆలయం కింద భాగం వరకు సుమారు ఆరు అడుగుల మేర చుట్టూ తవ్వకాలు నిర్వహిస్తున్నారు. దీని వల్ల ఆలయం కింద భాగం కూడా కనిపించనుంది. ►ఆలయం కింద దక్షిణ భాగంలోని ద్వారం నుంచి మెట్లుపైకి ఎక్కి రెండో అంతస్తులోకి ప్రవేశించి స్వామి వారిని దర్శించుకొని ఉత్తరం మెట్లు ద్వారా భక్తులు బయటకు వచ్చే విధంగా పనులు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే పరిశీలన ►భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న తవ్వకాలను పొన్నూరు ఎమ్మెల్యే డి.నరేంద్రకుమార్ బుధవారం పరిశీలించారు. పనుల వివరాలను పురావస్తు శాఖ, దేవాదాయశాఖాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీడీవో జోసఫ్‌కుమార్ తదితరులు ఉన్నారు. ►పుకార్లు నమ్మవద్దు ... భీమేశ్వరస్వామి దేవస్థానం వద్ద నేలమాళిగలు, గుప్తనిధులు బయట పడ్డాయని వస్తున్న కథనాలు, పుకార్లను నమ్మవద్దు. ఎలాంటి గుప్తనిధులు బయటపడలేదు. ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావటానికి చేస్తున్న కృషిలో భాగంగానే తవ్వకాలు చేపట్టారు. - కోటేశ్వరన్,పురావస్తుశాఖ డీఈ. -
అతిచిన్న ‘బంగారు’ శివలింగం
భువనగిరిటౌన్, మహా శివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకుని అతి చిన్న సైజులో శివలింగాన్ని రూపొందించి తన కళా నైపుణ్యాన్ని చాటాడు భువనగిరి పట్టణంలోని గంజ్‌కు చెందిన చెల్లేటి శ్రీనివాసచారి. 180 మిల్లీ గ్రాముల బంగారంతో ఈ శివలింగాన్ని తయారు చేశాడు. గంట పదిహేను నిమిషాలలో దీనిని తయారు చేసి పలువురి మన్ననలు పొందాడు. ఇందు కోసం రూ.600 ఖర్చు చేశాడు