సాక్షి, కొవ్వూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని ఓ స్నానఘట్టంలో ఇరిగేషన్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. టూరిజం పేరుతో టీడీపీ పెద్దలకు స్థలం కేటాయించేందుకు ఏకంగా స్నానఘట్టంలోని శివలింగంతోపాటు దేవతా విగ్రహాలను కూడా ధ్వంసం చేశారు. దీన్ని అడ్డుకున్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇరిగేషన్ అధికారులు, పోలీసుల తీరుకు నిరసనగా తానేటి వనిత ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో చేశారు.
Comments
Please login to add a commentAdd a comment