
ఏసీబీ చేతికి చిక్కిన ఏఎంవీఐ
రూ. 3 కోట్ల విలువైన ఆస్తుల గుర్తింపు
హైదరాబాద్: రాష్ట్ర అవినీతి నిరోధక విభాగానికి మరో అవినీతి చేప చిక్కింది. మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ చెక్‌పోస్టు సహాయ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) ఎ.శివలింగం, ఆయన బంధువులు, స్నేహితుల నివాసాలపై ఏసీబీ అధికారులు గురువారం దాడులు చేశారు. హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని క్రాంతినగర్‌లో ఉన్న శివలింగం నివాసంతోపాటు ఇతర ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో కోట్ల రూపాయల విలువ చేసే అక్రమ ఆస్తులను అధికారులు గుర్తించారు. దొరికిన ఆస్తుల విలువ డాక్యుమెంట్ల ప్రకారం రూ.1.50 కోట్లు అని ఏసీబీ డీజీ ఎ.కె.ఖాన్ ప్రకటించారు. మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తులు రూ. 3 కోట్లకుపైగా విలువ చేస్తాయని ఆయన చెప్పారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన సమాచారంతో ఈ దాడులు చేశామన్నారు. శివలింగంపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు.
శివలింగం ఆస్తుల చిట్టా..
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో రెండంతస్తుల భవనం సైదాబాద్‌లో ఒక ఫ్లాట్ రంగారెడ్డి జిల్లాలో 13 ఎకరాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో
10 ఎకరాల వ్యవసాయ భూమి రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో రెండు చొప్పున ప్లాట్లు 77 తులాల బంగారు ఆభరణాలు2.3 కిలోల వెండి సామగ్రి, ఆభరణాలు రూ.23.8 లక్షల విలువ చేసే బీమా పాలసీలు రూ.7.4 లక్షల విలువ చేసే గృహోపకరణాలుసరూర్‌నగర్ ఆంధ్రాబ్యాంకు లాకర్‌లో రూ.1.16 లక్షలు, రెండు కార్లు, రెండు ద్విచక్రవాహనాలు