
న్యూఢిల్లీ: వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదులో వెలుగుచూసిన శివలింగాన్ని పరిరక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని సుప్రీంకోర్టు తెలిపింది. సర్వే సందర్భంగా జ్ఞానవాపి మసీదులో బయటపడిన శివలింగం రక్షణ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం మే17న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
మసీదులో శివలింగాన్ని గుర్తించిన వాఘూఖానా ప్రాంతాన్ని సీజ్ చేయాలని, ముస్లింల ప్రార్థనలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని ఆదేశాలిచ్చింది. ఈ మధ్యంతర ఉత్తర్వుల గడువు రేపటితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ సుప్రీం ధర్మాసనం ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను నవంబర్ 28కి వాయిదా వేసింది.
చదవండి: (Delhi MCD Election: పది కీలక హామీలు ప్రకటించిన కేజ్రీవాల్)