న్యూఢిల్లీ: యూపీలోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు ఆవరణలో శాస్త్రీయ సర్వే చేపట్టాలన్న వారణాసి కోర్టు ఉత్తర్వులపై మసీదు నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమ పిటిషన్‌పై సత్వరమే విచారణ చేపట్టాలని కోరింది. ఈ పిటిషన్ సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ముందుకు రానుంది.
జ్ఞానవాపి మసీదుకు సంబంధించిన అన్ని ఉత్తర్వులపై వెంటనే స్టే ఇవ్వాలని మసీదు కమిటీ కోరుతోంది. ఇప్పటికే జూలై మొదటి వారంలోనే ఈ పిటిషన్ వేసింది. అయితే, విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకుని ఉన్న జ్ఞానవాపి మసీదు ఆవరణలో సర్వే చేపట్టాలంటూ వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో మసీదు కమిటీ సత్వర విచారణ కోరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment