ఢిల్లీ: ఢిల్లీలో వీధి కుక్కల్లో అరుదైన వ్యాధి కారక మొండి శిలీంద్రాన్ని గుర్తించారు. మందులకు కూడా లొంగని కాండిడా అరిస్‌గా పిలిచే ఈ వ్యాధి కారకానికి వీధి కుక్కలు ఆవాసంగా ఉంటాయి. ఈ మేరకు ఢిల్లీ యూనివర్శిటీ, కెనడాకు చెందిన ఎంసీ మాస్టర్ విశ్వవిద్యాలయ నిపుణులు సంయుక్తంగా జరిపిన పరిశోధనలో తెలింది. ఈ శిలీంద్రంతో ఆస్పత్రుల్లో భారీగా వ్యాధి భారిన పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్‌ఓ నిర్దారించిన దృష్టిసారించాల్సిన ఫంగస్‌లలో ఒకటి ఇది కావడం గమనార్హం.
చర్మవ్యాధి సోకిన కుక్కల చెవులు, చర్మం నుంచి షాంపిల్స్ తీసుకుని పరీక్షలు నిర్వహించగా.. ఈ మేరకు హానికారక కాండిడా అరిస్‌ను గుర్తించినట్లు చెప్పారు. దీనికి పోలిన వేరియంట్లను కుక్కలు, మానవుల్లోనూ ఉన్నట్లు తెల్చిన శాస్త్రవేత్తలు.. దీని కారణంగా మనుషులు, జంతువుల్లో వీటి భారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.
'కుక్కలు పెంపుడు జంతువులు. కాండిడా అరిస్ కేవలం వీధి కుక్కల్లో మాత్రమే కనుగొన్నాం. ఇలాంటి కుక్కలు ప్రపంచంలో చాలా ప్రదేశాల్లో ఉండొచ్చు. జంతువుల నుంచి మనుషులకు కాండిడా అరిస్ వ్యాప్తి చెందడానికి ఇవి కారకాలుగా మారుతున్నాయి.' అని యూనివర్శిటీకి చెందిన జర్నల్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీధి కుక్కలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి: CM Siddaramaiah: సిద్దరామయ్యకు జలుబు, దగ్గు.. సీఎం కార్యక్రమాలన్నీ రద్దు
Comments
Please login to add a commentAdd a comment