superbug
-
వీధి కుక్కల్లో వ్యాధి కారక మొండి శిలీంద్రం.. మందులకు కూడా లొంగదు..
ఢిల్లీ: ఢిల్లీలో వీధి కుక్కల్లో అరుదైన వ్యాధి కారక మొండి శిలీంద్రాన్ని గుర్తించారు. మందులకు కూడా లొంగని కాండిడా అరిస్గా పిలిచే ఈ వ్యాధి కారకానికి వీధి కుక్కలు ఆవాసంగా ఉంటాయి. ఈ మేరకు ఢిల్లీ యూనివర్శిటీ, కెనడాకు చెందిన ఎంసీ మాస్టర్ విశ్వవిద్యాలయ నిపుణులు సంయుక్తంగా జరిపిన పరిశోధనలో తెలింది. ఈ శిలీంద్రంతో ఆస్పత్రుల్లో భారీగా వ్యాధి భారిన పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్ఓ నిర్దారించిన దృష్టిసారించాల్సిన ఫంగస్‌లలో ఒకటి ఇది కావడం గమనార్హం. చర్మవ్యాధి సోకిన కుక్కల చెవులు, చర్మం నుంచి షాంపిల్స్ తీసుకుని పరీక్షలు నిర్వహించగా.. ఈ మేరకు హానికారక కాండిడా అరిస్ను గుర్తించినట్లు చెప్పారు. దీనికి పోలిన వేరియంట్లను కుక్కలు, మానవుల్లోనూ ఉన్నట్లు తెల్చిన శాస్త్రవేత్తలు.. దీని కారణంగా మనుషులు, జంతువుల్లో వీటి భారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. 'కుక్కలు పెంపుడు జంతువులు. కాండిడా అరిస్ కేవలం వీధి కుక్కల్లో మాత్రమే కనుగొన్నాం. ఇలాంటి కుక్కలు ప్రపంచంలో చాలా ప్రదేశాల్లో ఉండొచ్చు. జంతువుల నుంచి మనుషులకు కాండిడా అరిస్ వ్యాప్తి చెందడానికి ఇవి కారకాలుగా మారుతున్నాయి.' అని యూనివర్శిటీకి చెందిన జర్నల్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీధి కుక్కలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇదీ చదవండి: CM Siddaramaiah: సిద్దరామయ్యకు జలుబు, దగ్గు.. సీఎం కార్యక్రమాలన్నీ రద్దు -
ఆ చికెన్ తిన్నారో.. అంతే!
బ్రిటిష్ దుకాణాల్లో ఉన్న తాజా చికెన్ అని చెబుతున్న దాన్ని తింటే అంతే సంగతులని హెచ్చరిస్తున్నారు. దాదాపు మూడింట రెండొంతుల చికెన్‌లో అత్యంత ప్రమాదకరమైన ఈ-కోలి సూపర్ బగ్ ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ప్రజారోగ్యానికి తీవ్రమైన ప్రమాదం పొంచి ఉంటుందని తెలిపారు. ఇంగ్లండ్‌లోని ప్రముఖ దుకాణాల్లో అమ్ముతున్న చికెన్‌లో 78 శాతం ఈ-కోలి బ్యాక్టీరియా కలిగి ఉందట. అదే స్కాట్లండ్‌లో 53 శాతం, వేల్స్లో 41 శాతం చికెన్‌లో ఈ-కోలి ఉందన్నారు. అత్యంత ప్రమాదకరమైన ఈ-కోలి బ్యాక్టీరియా వల్ల ఒక్క ఇంగ్లండ్‌లోనే ఏడాదికి 5,500 మంది చనిపోతున్నారు. ఈ కోలి బ్యాక్టీరియా వల్ల కేవలం డయేరియా లేదా వాంతులు కావడం మాత్రమే కాదని, అది పెద్దప్రేవుల్లో కొన్ని సంవత్సరాల పాటు ఉండిపోయి ప్రాణాంతకంగా మారుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎవరికైనా ఈ బ్యాక్టీరియా శరీరంలో చేరితే.. ఇక ఏ రకమైన యాంటీబయాటిక్ మందులు వాడినా అవి పనిచేయవు. ఈ ఏడాది ప్రారంభంలో యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో కూడా.. చాలావరకు ప్రముఖ సూపర్ మార్కెట్లలో కొన్ని చికెన్‌లో ఈ-కోలి ఉన్నట్లు తేలింది. అయితే తాజాగా చేసిన పరిశోధనలలో మాత్రం ఇంతకు ముందు కంటే దీని తీవ్రత, వ్యాప్తి చాలా ఎక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని దశాబ్దాలుగా కోళ్లకు ఉపయోగిస్తున్న మేతలో యాంటీ బయాటిక్ మందులను ఎక్కువ మోతాదులో కలపడం వల్లే ఈ సూపర్ బగ్ తయారైందని చెబుతున్నారు. కోడి పిల్లలకు ఎలాంటి వ్యాధులు సోకకూడదన్న ముందు జాగ్రత్తతో అవి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాటికి యాంటీ బయాటిక్స్ ఇస్తున్నారు. దాంతో వాటికి యాంటీ బయాటిక్ మందులు పనిచేయక.. చివరకు మనుషుల ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి.