కృష్ణా జిల్లా నూజివీడు ఏరియా ఆస్పత్రిలో పదిహేను రోజుల పసికందును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు.
నూజివీడు: కృష్ణా జిల్లా నూజివీడు ఏరియా ఆస్పత్రిలో పదిహేను రోజుల పసికందును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఆస్పత్రి ఆవరణలో ఏడుస్తున్న ఆడ శిశువును సిబ్బంది గుర్తించారు. ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. శిశువును శిశు సంరక్షణ కమిటీకి అప్పగించాలని అధికారులు నిర్ణయించారు.