ఆ కారు దొరికింది
పారిస్: పారిస్ ఉగ్రదాడిలో కీలకమైన సాక్ష్యాలను సేకరించడంతో పోలీసులు పురోగతి సాధించారు. నగరంలో పలుచోట్ల భీకరమైన కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులు వాడిన కారును పోలీసులు గుర్తించారు. ఉగ్రవాదులు ఉపయోగించినట్టుగా అనుమానిస్తున్న ఈ బ్లాక్ సీట్ కారును మౌంట్రెయుల్ కి సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బటాక్లాన్ ఏరియాలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తిని పారిస్ లో నివసించే ఒమర్ ఇస్మాయిల్ ముస్తఫా(29) గా పోలీసులు గుర్తించారు. అతడి తండ్రి, అన్న, వదిన సహా ఆరుగుర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గ్రీస్, బెల్జియం, జర్మనీ పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోవైపు పారిస్ దాడికి సంబంధించి అనుమానితులుగా భావించిన పలువురిని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. బెల్జియంలో అద్దెకుతీసుకున్న గ్రే పోలో కారు బటాక్లాన్ కన్సర్ట్ హాల్ దగ్గర స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారి తెలిపారు.